రుణమాఫీ సరే మరి...

రుణ విముక్తి చట్టం అవసరం లేదా..!?

  • రుణ విముక్తి చట్టం, మద్దతు ధరల చట్టం 
  • ఈ రెండు చట్టాలు అమలు చేయాలని దేశంలో ఒక ఉద్యమం కొనసాగుతోంది. 
  • డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఏం చెబుతోంది!?
  • ఎస్ ఎల్ బిసితో సీఎం రేవంత్ రెడ్డి మూడుసార్ల సమావేశం చేసిన ఇంకా లెక్క తేలని రైతుల సంఖ్య ఎంత...!?
  • రేషన్ కార్డు ప్రమాణికము అని చెప్పిన రేషన్ కార్డు లేనివారికి సైతం రుణమాఫీ రైతుల్లో హర్షతిరేకం....
  • రైతు రుణ విముక్తి చట్టం రైతు మద్దతు ధర చట్టం ఇలాంటి ఎన్నో రైతు సమస్యలపై జయభేరి సగర్వంగా సంధిస్తున్న కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ రాజకీయ సమగ్ర విశ్లేషణ....

రుణమాఫీ సరే మరి...

జయభేరి, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో 33 జిల్లాల రైతు వేదికల ద్వారా ఒకేసారి రుణమాఫీ పండుగను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 11 వేల కోట్ల నిధులను రైతు రుణమాఫీకి వెచ్చించింది.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ లో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ 72,000 కోట్లు చేస్తే ఈసారి అదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పదకొండు వేల కోట్లు విడుదల చేస్తే 11 లక్షల కుటుంబాలకు ఒక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున రుణమాఫీని మొదటి విడతగా చేసి ఈనెల ఆఖరిన 50,000 రెండో విడతగా మాఫీ చేసి ఆగస్టు మొదటి వారంలో మరో 50,000 రుణమాఫీ చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రైతు రుణమాఫీ గురించి ఎన్నికల సమయంలో వరంగల్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో డిక్లరేషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా పెట్టింది.

Read More అంతర్రాష్ట్ర గంజాయి విక్రెతల ముఠా అరెస్ట్... భారీగా గంజాయి స్వాధీనం

ఎన్నికల తరువాత ఇచ్చిన మాటను తూచా తప్పకుండా మొదటి విడత ఏకంగా లక్ష రూపాయలను మాఫీ చేస్తూ మేనిఫెస్టోను అమలుపరిచింది. నిజంగా ఇది చారిత్రాత్మకమైన విజయమని కాంగ్రెస్ వ్యవసాయ ఆధారిత పెద్దలు కితాబునిచ్చిన దాని వెనక ప్రతిపక్షాలు  గగ్గోలు పెడుతూనే ఉన్నాయి.. రేషన్ల కార్డు లేని వారి పరిస్థితి ఏమిటి? ఒకవేళ రైతు రుణమాఫీ పత్రంలో సమస్యలు ఏర్పడితే ఎవరు తీరుస్తారు అనే విషయాలపై బిఆర్ఎస్ పార్టీ అనేక ప్రశ్నలను సంధిస్తోంది. వీటన్నింటికీ సమాధానం చెబుతూ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది అని ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఇంకా ఇక్కడ మాట్లాడుకోవడానికి మాట్లాడ్డానికి విషయాలు ఏమీ లేవు...
రుణమాఫీ విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను విడుదల చేసింది ఎవరికైనా సందేహాలు సమాధానాలు ఉండి రుణమాఫీ జరగకపోతే డైరెక్ట్ గా తమ అభ్యంతరాలను సంబంధిత బ్యాంకు ఆఫీసర్లతో మండలంలో నోడల్ ఆఫీసర్లతో మాట్లాడి తమ సమస్యను పరిష్కరించుకోవచ్చు అని ప్రభుత్వం చెబుతోంది.

Read More తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి

దాదాపు 79 శాతం రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇలాంటి పరిస్థితుల్లో రుణమాఫీతో దాదాపు 11:30 లక్షల రైతులకు రుణమాఫీ జరగడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం లో జరిగిన చారిత్రాత్మకమైన విషయంగా అభివర్ణిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు.. ఇక ఎస్ఎల్బీసీ విడుదల చేసిన ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సమావేశాన్ని మూడుసార్లు ఏర్పాటు చేసి అనేక లెక్కలను కూడా తీశారు దాదాపు 79 లక్షల చిన్న సన్నకారు రైతులకు రుణ విముక్తి లభించేలా చర్యలు తీసుకున్నారు.

Read More బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మంత్రి పొన్నం ప్రభాకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

అయితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి!? అనే విషయాన్ని ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేస్తే మంచిది. రైతులకు రుణ విముక్తి కలిగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత సహాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల్లో జరిగిన ప్రభుత్వంలో అంతగా ఆశించిన స్థాయిలో రైతు రుణమాఫీ జరగలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ కొత్త ఏమీ కాదు ఆనాడు చేసిన రుణమాఫీ ఈనాడు చారిత్రాత్మకమైన రుణమాఫీ నిర్ణయంతో రైతుల సంతోషాలకు కారణమవుతోంది. గత ప్రభుత్వంలో నాలుగు విడతలుగా కొంత కొంత రుణ విముక్తి చేయగా రెండవ దశలో 20, 25 వేల రూపాయలతోనే సరిపెట్టుకుని గత ప్రభుత్వం.

Read More తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ

కానీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో డైరెక్టుగా ఒక లక్ష రూపాయలు మాఫీ అయిన తర్వాత ఇదే నెల చివరి వారంలో 50,000 మూడో విడత ఆగస్టు మొదటి వారంలోనే మరో 50 వేలుతో మూడు విడుదల్లో రెండు లక్షల రూపాయలను రైతులకు రుణమేముక్తి చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

Read More కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి కుంటుపడిన విద్యా వ్యవస్థ

రైతు రుణమాఫీ చేస్తున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రసంగాన్ని చేశారు సార్వత్రా ఇప్పుడు అదే విషయం చేర్చాంశం నియమౌవుతుంది. రెండు లక్షల కు పైగా ఋణం ఉన్నవాళ్లు కచ్చితంగా రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని చెల్లించాలని రైతు రుణమాఫీ జరిగిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తీసుకున్నప్పుడు బ్యాంకులకు విడుదలవారీగా చెల్లింపులు జరపాలని ఇప్పుడు జరిగిన రైతు రుణమాఫీ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ఆశించారు. రాష్ట్ర ప్రభుత్వం 7500 ఎకరానికి సంవత్సరానికి ఇస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి ఇస్తున్న రైతుకు ఇంకా రుణమాఫీ అవసరమా అనే వాదన వినపడుతూనే ఉంది. 
రైతుకు పూర్తిగా రుణమాఫీ జరగాలంటే ఏం చేయాలి...

Read More దొరికిన హ్యాండ్ బ్యాగ్ ను డిపో అధికారులకు అందజేసినారు

కేరళ తరహా రైతు రుణ విముక్తి చట్టాన్ని తీసుకురావాలని రైతాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతు బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించాల్సిన విషయంలో అశ్రద్ధ వహించకుండా దశలవారీగా చెల్లింపులు జరిపితే బాగుంటుంది అని కమిషన్ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అయితే ఇదే స్వామినాథన్ కమిషన్ 50% పెట్టుబడిలో కలిపి రైతును ఆదుకోవాలని కూడా సూచించింది. అంటే మొదటిదిగా మద్దతు ధరల గ్యారెంటీ చట్టం రెండవదిగా రైతు రుణ విముక్తి చట్టాన్ని కచ్చితంగా రాజ్యాంగపరంగా హక్కుగా చేయాలని రైతాంగ నిపుణులు పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇదే గనక జరిగితే రైతుకు రుణమాఫీ అంత పెద్ద విషయమేం కాదని రైతు తనకు తానుగా స్వతంత్రంగా బతకడానికి తాను పండించిన పంటకు మద్దతు ధర కలిగితే గనక కచ్చితంగా ఋణ విముక్తిని కోరుకోడు తానే తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది అని అభిప్రాయపడుతున్నారు.

Read More కేటీఆర్ చిట్టా మొత్తం నా దగ్గరుంది.. 

బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందా!?
గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఓఆర్ఆర్ పక్కన ఉన్న అనేక గుట్టలు చెట్లు రాళ్లు రప్పలు ఉన్న భూముల కూడా లక్షల కోట్ల రూపాయలను రైతుబంధు పేరుతో తెలంగాణ సంపదను ధనికులకే పంచి పెట్టింది అని అధికార ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. అందుకే ఈసారి రైతాంగ వేదికల ద్వారా రైతు భరోసా కార్యక్రమం ద్వారా డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో అనేక చోట్ల మీటింగ్లను ఏర్పాటు చేస్తూ రైతుల నుంచి మేధావుల నుంచి విజ్ఞానుల నుంచి సూచనలను తీసుకుంటూ తగిన విధంగా రైతు రుణమాఫీకి శ్రీకారం చుడుతోంది. గత ప్రభుత్వం చేసిన తప్పులను చేయకుండా అనేక విధమైన ఆలోచనలతో రైతుల నుంచి ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకొని రేషన్ కార్డు ఉన్నవారికి రేషన్ కార్డు లేకుండా అర్హులైన వారికి కచ్చితంగా రెండు లక్షల రుణమాఫీని అమలు చేస్తుంది.

Read More నల్గొండ జిల్లా ఫ్లెక్స్ ప్రింటింగ్ జిల్లా నూతన ప్రధాన కార్యదర్శిగా నల్లగాసు నవీన్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక

ఇక కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వంలో 2021, 22 సంవత్సరంలో ప్రపంచ స్థాయి తాకేలా రైతాంగ పోరాటాలు చేసిన ప్రధానమంత్రిగా కొనసాగుతున్న మోడీ హామీలు ఇచ్చి వాటిపై ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోకపోవడం దేశంలోని రైతాంగం ఆలోచనలో పడుతుంది. రైతులకు కచ్చితంగా రుణ విముక్తి చట్టాన్ని తీసుకొచ్చి అలాగే రైతుకు మద్దతు ధరల చట్టం కూడా తీసుకురావాలని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చర్చలు కూడా గట్టిగానే జరుగుతున్నాయి... డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతుకు 50 శాతం పెట్టుబడుల కలిపి మద్దతు ధరను ప్రకటించాలని నిర్ణయించిన ఆ దిశగా చర్యలు జరగట్లేదని కనీసం ఈసారైనా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ధైర్య సాహసాలతో అడుగేస్తున్న ఈ తరుణంలో ప్రధాన మంత్రి గారితో కలిసి కూడా రైతుకు మద్దతు ధర చట్టం రుణ విముక్తి చట్టాన్ని చట్టపరంగా చేసేలా పార్లమెంటులో పోరాటాన్ని చేయాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

Read More ప్రపంచ ఆక్వాకల్చర్ ఇండియా 2025 కార్యక్రమంకు బయలుదేరిన మత్స్య రైతులు, అధికారులు

అంతేకాదు బిజెపి ప్రభుత్వం వ్యవసాయ ధర దానికి సంబంధించిన విత్తనాలపైన మందులపైన పరికరాల పైన గ్రిప్ పైన కూడా జిఎస్టి ని పెట్టి రైతుల నుంచి రక్తాన్ని పీలుస్తుందని ఇలాంటి చర్యలకు ఇకనైనా కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ లాంటి చారిత్రాత్మకమైన విజయాలను పరిగణలోకి తీసుకొని బిజెపి ప్రభుత్వం చట్టాలను ఏర్పాటు చేయాలని రైతు సంఘ నాయకులు రైతు సంఘ పోరాట ప్రతినిధులు ఆశాభవాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read More ఘనంగా 161వ వారపు జ్ఞానమాల

రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పై ప్రశంసల జల్లులతో పాటు విమర్శన వస్త్రాలు ఎన్నోస్తున్న లెక్కచేయకుండా రైతు సంఘాల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం 21 22 సంవత్సరంలో ప్రపంచ స్థాయి దృష్టిని మల్లెల రైతాంగ పోరాటాలు జరిపించిన వారితో చర్చలు జరిపిన ఆనాటి ఈనాటి ప్రధానమంత్రి మోడీ తాను ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు సమావేశాల్లో కచ్చితంగా రైతుకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం రైతు రుణ విముక్తి చట్టాన్ని అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

- కడారి శ్రీనివాస్ 
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
గాయకులు, సామాజిక ఉద్యమకారులు

Views: 0