జయభేరి, హైదరాబాద్, సెప్టెంబర్ 20
హైదరాబాద్ జిల్లాలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 15వ తేదీ ఉదయం ఓ సంచిలో మూటకట్టిన మహిళ మృతదేహాన్ని ఓ వ్యక్తి ఆటోలో తీసుకువచ్చి చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన పడవేసిన వ్యవహారంలో పోలీసులకు కీలక పురోగతి లభించింది.
ఆమె ఒక పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రమీలగా హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. పెళ్లి అయిన ప్రమీల.. గత కొన్నేళ్లుగా భర్తతో దూరంగా ఉంటున్న ట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే తమ రాష్ట్రానికే చెందిన మరో యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ నగరంలోని కొండాపూర్ ప్రాంతంలో కలిసి నివాసం ఉంటున్నా రు. వారిద్దరి మధ్య గొడవ లు తలెత్తగా.. ప్రమీలను చంపేసిన యువకుడు.. ఆమెను సంచిలో వేసుకుని కొండాపూర్ నుంచి ఆటోలో చర్లపల్లికి చేరుకుని.. అక్కడ వదిలేశాడు. ఆ తర్వాత స్టేషన్ లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని.. అస్సాం వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఆ నిందితుడి కోసం స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు.చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సంచిలో మహిళ మృతదేహం లభ్య మైన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.