జాతీయ రోడ్డు భద్రత మాహోత్సవాలు

జాతీయ రోడ్డు భద్రత మాహోత్సవాలు

జయభేరి, సైదాపూర్ : జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు సిపి గౌస్ అలం ఆదేశాల మేరకు సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శనివారం ఎస్సై కొప్పుల స్వాతి ఆధ్వర్యంలో మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. వివిధ గ్రామాల సర్పంచులు మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలపై మహిళలు వేసిన ముగ్గులు  ఆకట్టుకున్నాయి. అందంగా ఆకర్షణీయంగా వేసిన ముగ్గులకు బహుమతులు ప్రకటించారు. హుజురాబాద్ రూలర్ సిఐ పులి వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో విజేతలు బహుమతులను మొదటి  బహుమతి దుద్దెనపల్లి గ్రామం, రెండవ బహుమతి వెన్కేపల్లి, మూడవ బహుమతి లక్ష్మన్న పల్లి, నాలుగవ బహుమతి, సైదాపూర్, పెర్కపల్లి గ్రామం విజేతలకు బహుమతి సీఐ పులి వెంకట్ గౌడ్ అందజేశారు. ప్రతి గ్రామంలో పాల్గొన్న వారికి  బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు ఫోరం అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, సర్పంచులు మునిగంటి స్వప్న, సంతోష్, మునిపాల సునీత రవి, రాయిశెట్టి  చంద్రయ్య, తొంట రజనీకాంత్, మాచమల్ల, శ్రీకాంత్, బత్తులసంపత్, ఉడిగే, విజయ-రాజశేఖర్, వర్నెలావణ్య, భాషరాజు రజిత, మదం శ్రావణి శ్రీనివాస్, పోతారాజు బాబితా, ఉపసర్పంచి, గోప గోనినవీన్ ,కుమారస్వామి, పోలీస్ శాఖ సిబ్బంది చట్ల ఆంజనేయులు, సముద్రాల సురేష్, బొజ్జ రాజు, జంపయ్య, సాయి కృష్ణ, అజయ్ కుమార్, స్రవంతి, పూజ, నాగరాణి మహిళలు తుదితరులు పాల్గొన్నారు.

Read More Telangana I కంచర గాడిద.. రేసుగుర్రం... సన్నాసి! దద్దమ్మలు! దున్నపోతును కొనుక్కున్నది ఎవరు?

IMG-20260110-WA5601

Read More Congress I రగులుతున్న రాజకీయం.. మంట పెట్టే వారెవరు!?

Views: 36