ఎమ్మెల్సీ రామచంద్రారావును సన్మానించిన మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గెలుపునకు అందరు కృషి చేయాలన్న ఎమ్మెల్సీ రామచంద్రారావు
జయభేరి, ఫిబ్రవరి 7:
కరీంనగర్ లో నిర్వహించిన బిజెపి సమావేశానికి వెళ్తున్న ఎమ్మెల్సీ రామచంద్రారావును తూoకుంట మున్సిపాలిటీ లోని దొంగల మైసమ్మ చౌరస్తా వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిసి అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ రామచంద్రారావు మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో బిజెపి రోజురోజుకు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పటిష్టంగా తయారవుతుందని తెలిపారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గెలుపునకు అందరు కలిసి కట్టుగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ అధ్యక్షులు నర్సింహా రెడ్డి, శామీర్ పేట మండల అధ్యక్షులు కొరివి కృష్ణ ముదిరాజ్, స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment