అనుమానాస్పద స్థితిలో ఉ*రి వేసుకుని వ్యక్తి ఆత్మ*హ*త్య

ఆర్థిక సమస్యలే కారణమని పోలీసుల అనుమానం..

అనుమానాస్పద స్థితిలో ఉ*రి వేసుకుని వ్యక్తి ఆత్మ*హ*త్య

జయభేరి, శామీర్ పేట్, జూన్ 28 :
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉ*రి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన అప్సర్ ఆలం (36) బ్రతుకు దెరువు కోసం మూడుచింతలపల్లి కి వచ్చి పాన్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతని భార్య సైదా డెలివరీ కోసం పశ్చిమ బెంగాల్ కు వెళ్లింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆలం చీరతో స్లాబ్ కు ఉరివేసుకుని ఆత్మహ*త్యకు పాల్పడ్డాడు.

అయితే ఆలం భార్య సైదా తన భర్తకు ఫోన్ చేయగా ఎంతకు ఫోన్ ఎత్తకపోవడంతో ఇంటి యజమానికి సమాచారం అందించింది. వెంటనే యజమాని గది తలుపు పగులగొట్టి చూడగా అతను ఉరివేసుకుని కనిపించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృ*తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుటుంబ పోషణ భారమై, ఆర్థిక సమస్యలు అధికం అవడంతో వ్యక్తి ఆత్మహ*త్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read More చర్లపల్లి రైల్వే స్టేషన్ లో మహిళల మృతదేహం కేసులో పురోగతి!

Views: 0

Related Posts