యూరియా కోసం చెప్పులను క్యూలైన్ లో...
పోలీసుల రంగ ప్రవేశంతో చెప్పులను తొలగించి రైతులను వరుసలో నిలబెట్టి బస్తాల పంపిణీ
జయభేరి, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెనుకేపల్లి గ్రామంలో యూరియా ఎరువులు కోసంపడరాన్నిపాట్లుపడుతున్నారు, రైతులు యూరియాకోసం వేకువ జాము నుంచి స్థానిక గోదాం వద్ద నిరీక్షిస్తున్నారు. వెనుకేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు ఉదయమే 6 వేచి చూడగా వచ్చిన యూరియా సగంలోడు ఉన్నందునరైతులు పెద్ద పెద్ద సంఖ్యలో క్యూ లైన్ లో నిలబడ్డారు 10 గుంటలు 20 గుంటలు ఉన్న రైతులకు రెండు బస్తాలు 10 ఎకరాలు ఉన్న రైతులకు కూడా రెండు బస్తాలే ఇస్తున్నారు.

మండల వ్యాప్తంగా యూరియా కొరత వేధిస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎరువుల కొరత తీర్చలని అన్నదాతలు కోరుతున్నారు. అనంతరం సొసైటీ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వెంటనే సొసైటీ గోదాం వద్దకు వచ్చి క్యూలైన్లో చెప్పులను తొలగించి క్యూ పద్ధతిలలో రైతులను నిలబెట్టి సొసైటీ సిబ్బంది సూచన మేరకు ఒక్కొక్క రైతుకు రెండు బస్తాలు ఇవ్వడం వలన రైతుల్లో అసంతృప్తి నిరాశ ఎదురైంది.



