Telangana I పరీక్షకే..పరీక్ష...
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల లీకేజీలను ఎలా అరికట్టాలి అనే విషయాలపై 'జయభేరి' సమగ్ర వివరణలో భాగంగా కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర విశ్లేషణ...
జయభేరి, హైదరాబాద్ :
గత పది ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్యా వరకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ పరీక్షలకే పరీక్షగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం లీకేజీల వ్యవహారం. ఈ లీకేజీల వ్యవహారాన్ని ఎలా అరికట్టాలి ఒక మన తెలంగాణ రాష్ట్రంలోనే లీకేజీలు కొనసాగుతున్నాయి వేరే రాష్ట్రాల్లో ఉందా అని మనం పూర్తిగా విశ్లేషణ చేసుకుంటే రాజస్థాన్ జమ్మూ పంజాబ్లలో చాలా లీకేజీలు జరిగిన మాట వాస్తవం. ఒక తెలంగాణలోనే కాదు మన దేశంలోనే ఆయా రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అనేక లీకేజీలు పరీక్షల సమయంలో అనేక లీకేజీలు జరిగాయి. కానీ మన మనదేశంలో మన రాష్ట్రంలో ఎక్కువగా యువత నిరుద్యోగ మహమ్మారితో బాధపడుతున్న సమయంలో ఇలాంటి లీకేజీల వ్యవహారం పూర్తిగా యువత భవిష్యత్తుపై దెబ్బ పడుతోంది.
వాస్తవానికి మన రాష్ట్రంలో విద్య వ్యవస్థ 16 నెలల నుండి 22 నెలల వరకు ఒక పరీక్ష జరుగుతుంది. కానీ ఏడు నెలల నుంచి పది నెలల లోపు పరీక్షను కుదించి పెట్టినట్లయితే లీకేజీల బారి నుండి బయటపడవచ్చు అని నిపుణుల అభిప్రాయం. వాస్తవానికి మన దేశంలో యువత ఎక్కువగా ఉన్నది కాబట్టి వికసిత భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మంచి పని చేస్తున్న దీనిలో 70% వరకు యువత భాగస్వామ్యం తీసుకోవాలి. కేవలం మన రాష్ట్రంలో లీకేజీల వ్యవహారం బాగా నడుస్తుంది అనుకుంటే పొరపాటే 2018లో రాజస్థాన్లో ఎస్ఎస్సి పరీక్షలు ఆర్ఆర్బీ ఇలా కొన్ని పరీక్షల్లో పూర్తిగా లీకేజీల బారిన పడి అక్కడి విద్యావ్యవస్థ దుర్భిక్షమైంది.
అందుకని ఈ పార్లమెంటు సభలలో కేంద్రం ఒక చట్టాన్ని రూపొందించింది లీకేజీల వ్యవహారాన్ని పూర్తిగా రూపుమాపడానికి లీకేజీల వ్యవహారంలో అవకతవకలు ఒక వ్యూహాత్మకత ను జోడించి కేంద్రం మంచి నిర్ణయం తీసుకుంది ఒక చట్టం చేయనుంది అయితే ఈ చట్టం పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలి. కేంద్ర పరిధిలో వచ్చేవి రైల్వే బ్యాంకింగ్ కేంద్ర విశ్వవిద్యాలయాలు నీట్ జేఈఈ ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ చే పని చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో లీకేజీలను అరికట్టడానికి కేంద్రం నియమించే ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.
అయితే మన రాష్ట్రంలో లీకేజీలు ఎక్కువ ఎందుకు అని ఒకసారి మనం ఆలోచిస్తే.. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయా ప్రభుత్వాల పనితీరు స్వార్థం అక్రమార్చనకు పాల్పడుతూ విద్యావ్యవస్థను పూర్తిగా దెబ్బతీసేలా స్వార్థం కోరలు చాపింది. దీనికి తోడు ప్రతి పరీక్షలు అనేక సంవత్సరాలుగా కేంద్రం గైడ్లైన్స్ తీసుకోవాలని చెబుతున్న అవి బేకరీ చేస్తూ యూపీఎస్సీ మెడికల్ విదేశీ విద్యావ్యవస్థ నీట్ పరీక్షలలో పూర్తిగా లీకేజీల వ్యవహారం రెక్కలు విప్పుతోంది.
వాస్తవానికి మన రాష్ట్రంలో టిఎస్పిఎస్ పరీక్షల వ్యవహారం లీకేజీని ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే కేవలం ఆఫీస్ బాయ్ ద్వారా లీకేజ్ అయింది అని మనం విన్నాం.. అంటే విద్యా వ్యవస్థలోనే కాదు ప్రతి వ్యవస్థలో ఉన్న ముఖ్యంగా విద్య వ్యవస్థ యువత భవిష్యత్తుకు పునాది కాబట్టి ఇలాంటి వ్యవస్థలో ఆఫీస్ బాయ్ కి అంత అవకాశం ఎలా ఉంది అని ఒకసారి ఆలోచించాలి. అంటే విద్యావ్యవస్థలో పనిచేస్తున్న ఆఫీసర్ స్థాయి నుండి అటెండర్ స్థాయి ఆఫీస్ బాయ్ స్థాయి వరకు పూర్తిగా అవినీతిమయం అవుతూ గ్రూప్ వన్ గ్రూప్ టు పరీక్షల లీకేజీకి టీఎస్పీఎస్సీ పై ఒత్తిడి పడి డబ్బులకు ఆశపడి పేపర్లను లీకేజ్ చేసిన ఉదంతం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అసలు పరీక్షల ఉద్దేశం ఏంటి? అని మనం ఒక్కసారి ఆలోచిస్తే విద్యార్థుల్లో నిగూఢంగా దాగిన ప్రతిభను వెలికి తీయడమే పరీక్ష. నిజానికి ఈ పరీక్షకి పరీక్ష పెట్టే విధంగా కాలగమనంలో పరీక్ష విధివిధానం పూర్తిగా దారి తప్పుతోంది ఎందుకంటే సులువుగా డబ్బు అక్రమ సంపాదన సంపాదించాలి తొందరగా సెటిల్ అయిపోవాలి విలాసాలకు విందులకు అలవాటు పడిపోయే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం పొందుకోవాలి అనే ఒక కలను సాకారం చేసుకోవడానికి ఎంతటి క్రైమ్ కైనా తెగించే అవకాశం ఈజీగా దొరుకుతున్నందున లీకేజీల వ్యవహారం రోజురోజుకు పెరుగుతుంది.
ప్రభుత్వ ఉద్యోగం ఎలాగైనా సంపాదించుకోవాలనే కళ సహకారం చేసుకోవాలంటే ఖచ్చితంగా అవినీతికి పాల్పడాల్సిందే.. 53 పోస్టులకు ఐదు లక్షల మంది పోటీ చేసుకునే ఈ సమాజంలో లీకేజీల ద్వారా ఈజీగా ప్రభుత్వ కొలువును కొట్టడానికి అవకాశం ఉన్నందున ఆయా విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారిని సంప్రదింపులు చేసి చాటుగా లీకేజీల వ్యవహారాన్ని అందరూ కలిసి చేస్తున్నారు. దీని ద్వారా రాజ్యాంగం మన కల్పించిన అటానమస్ పవర్ను దుర్వినియోగం చేస్తున్నారు. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత తీరు చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే టీఎస్పీఎస్సీ పతనం తరువాత నిరుద్యోగ యువత ప్రభుత్వ కొలువుల మీద నమ్మకం పోగొట్టుకుంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుకుంటూ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్న అది కార్యాచరణ దాల్చి గ్రూప్ వన్ గ్రూప్ టు నియామకాలు సజావుగా సాగితే యువతకు మంచి అవకాశాలు దొరికినట్లే అవుతుంది. కేంద్రం తీసుకొచ్చిన విద్యావ్యవస్థలో చట్టం ప్రకారం చాలా మార్పులు చేసినప్పటికీ అవి కేంద్ర పరిధిలో నడిచే యుపిఎస్సి ఆర్ఆర్బీ ఎన్టిఏ ఇలా పోటీ పరీక్షలు కేంద్రానికి సంబంధించినవి అయితే ఆ చట్టం దానికే పనికి వస్తుంది.
కానీ కేంద్రం చెబుతున్న మాట ఏంటంటే ఇవి ఈ చట్టాల్ని రాష్ట్రాలు కూడా తమకు అనుగుణంగా మలుచుకోవాలి అని సూచన చేస్తోంది. పోటీ పరీక్షల్లో సాధారణంగా జరిగే తప్పులు ట్యాంపరింగ్ క్యూస్షన్ పేపర్ ని దొంగలించడం జవాబు పత్రాన్ని యూస్ చేస్తుండడం కంప్యూటర్ ఫేక్ ఐడి లు ఫేక్ వెబ్సైట్లు ఫేక్ హాల్ టికెట్లు టెక్నాలజీని మిస్ యూస్ చేయడం ఆర్గనైజ్ చేయడం ఇలా అనేక రకాలుగా లీకేజీలనేవి జరుగుతూ ఉంటాయి. ఇక ప్రభుత్వం అన్ని రకాలుగా పోటీ పరీక్షలకు రక్షణ కోసం అనేక రకాలుగా మద్దతు ఇస్తున్న ముఖ్యంగా పోటీ పరీక్షలు నిర్వహించే సెంటర్స్ పోలీస్ ప్రొడక్షన్ ను ఎక్కువగా పెట్టాలి ఇలా పెట్టిన సమాజంలో ఉన్న బలహీనతల వల్ల అపాయింట్ చేసిన ఉన్నత ఉద్యోగుల మీదనే నమ్మకం లేకుండా పోతున్న ఈ తరుణంలో చిత్తశుద్ధి నీతి నిజాయితీ వీటి మీద నమ్మకం లేకుండా పోతుంది. అందుకనే పోటీ పరీక్షలు నిర్వహించే సెంటర్స్ అపాయింట్ చేసిన ఉద్యోగులపై ఇంటలిజెన్స్ రక్షణ వ్యవస్థ బలోపేతం చేసే విధంగా ఉండాలి.
చట్టాలు సంస్కరణలు ఎన్ని చేసినా ముఖ్యంగా ప్రజల్లో బలహీనతలు మార్పు రావాలి ఇది జరగకపోతే ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని నియమ నిబంధనలు పెట్టిన పెద్దగా ఉపయోగం ఉండదు. వరకట్నం నిషేధం జల్లికట్టు ఇలాంటివి సుప్రీంకోర్టు నిషేధించిన అవి ప్రజల బలహీనతలుగా మారిపోయి చట్టం చట్టం మాదిరిగానే మిగిలిపోయింది తప్ప మార్పు ఏమి కనిపించలేదు. కాబట్టి సమాజంలోని ప్రతి యువత బాధ్యతగా ప్రవర్తించాలి అయ్యా ఉన్నత పోస్టుల్లో ఉన్న విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు బాధ్యతగా నిబద్ధతతో వ్యవహరించాలి. అలా చేయకపోతే లీకేజీల పర్వం కొనసాగుతుంది పరీక్షలకే పరీక్ష అనే నామకరణం చేయాల్సి ఉంటుంది....
...కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
Post Comment