Telangana I పదవి అమ్మది.. పెత్తనం కొడుకుది...

తల్లి సర్పంచ్ అయితే ఆమె కుమారుడు సంతకం పెట్టడం ఏంటీ...? ఇది ఫోర్జరీ చేసినట్లే కదా....

Telangana I పదవి అమ్మది.. పెత్తనం కొడుకుది...
శామీర్ పేట్ మండలం, జయభేరి జనవరి 16 :
గ్రామాల్లో పాలన గాడి తప్పుతోంది. స్థానిక సర్పంచులు ఎన్నికల్లో మహిళలు పోటీ చేసి గెలుపొందిన తరువాత వారు కేవలం సీటు కే పరిమితమవుతున్నారు. గ్రామాల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూడాలన్న మహిళా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలగ చేసుకొని వారు ఆడిందే ఆట పాడిందే పాట గా కొనగసిస్తున్నారు. ఇలా జరుగుతుండటం మహిళా రిసర్వేషన్లు ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు...
IMG-20240116-WA1725
ఇక వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా శామిర్ పేట్ మండలం యాడారం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న పరిశ్రమ వద్ద పరిశ్రమ యాజమాన్యం స్పీడ్ బ్రేకర్ ను ఏర్పాటు చేయాలని యోచించింది. దింతో పరిశ్రమ యాజమాన్యం స్థానిక సర్పంచ్ అయిన యాంజాల సుజాత తో ఆమె అనుమతి గురించి గ్రామస్తులు, పరిశ్రమ సిబ్బంది చర్చించారు.
IMG-20240116-WA1717
అయితే పండగ సందర్భంగా సర్పంచ్ పిండి వంటలు చేస్తుండగా ఆమె కుమారుడు యంజాల శ్రీధర్ రెడ్డి అనుమతి పత్రంలో సంతకం చేశారు. విషయం తెలిసిన గ్రామస్తులు, పరిశ్రమ సిబ్బంది ఆశ్చర్యానికి గురై అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామంలో సర్పంచ్ పదవి లో ఉన్నది ఎవరు తల్లి సర్పంచ్ అయితే ఆమె కుమారుడు సంతకం పెట్టడం ఏంటని ఇది ఫోర్జరీ చేసినట్లే కదా అని ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు.
ఇలా అనుమతి కోసం ఒక దాని పైననే సంతకం చేశారా లేక ఇలానే పలు మార్లు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఉన్నతధికారులు స్పందించి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, పరిశ్రమ యాజమాన్యం డిమాండ్ చేస్తున్నారు.