రేవంత్ రెడ్డి డౌన్ డౌన్..

రేవంత్ రెడ్డి డౌన్ డౌన్..

జయభేరి, మేడ్చల్ :
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని గుండ్లపోచంపల్లి బిఆర్ఎస్ నాయకులు కావేలి రాజిరెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యువ నాయకుడు కావేలి రాజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసి పదేళ్లు అద్భుతమైన పాలన అందించిన కేసీఆర్ ని బాదనం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసిందని రాజిరెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, మధుచారి, మనవ్ గౌడ్, శ్రీచరన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 74