ప్రతిభ చాటిన పదో తరగతి విద్యార్థులకు సన్మానం

సన్మానించిన సర్పంచ్ భూక్య సంతోష్ నాయక్

ప్రతిభ చాటిన పదో తరగతి విద్యార్థులకు సన్మానం

జయభేరి, తుర్కపల్లి, మే 02 :
తుర్కపల్లి మండలం జేతురామ్ తండా, సంగ్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని 15 మంది పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడంతో అందులో భూక్య హిందూ 567 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది.నునావత్ నందు  భూక్య సిరి మల్లికా, భూక్య మేఘన, రుణావత్ చరణ్, భూక్య విజయ్, రుణావత్ మజ్ను, భూక్య ధనుష్, లకావత్ విజయ్, భూక్య భాషా, భూక్యనందిని, భూక్యమన్సింగ్, రుణావత్ రక్షిత, లను గ్రామ సర్పంచ్ భూక్య సంతోష్ నాయక్ అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాబోవు కాలంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. విద్య ద్వారా మాత్రమే మన బతుకులు బాగుపడతాయని అది నేను బలంగా నమ్ముతానని ఇక్కడ తల్లిదండ్రులు నిరక్షరాశులు కావడం చేత పిల్లల్ని పట్టించుకునే నాధుడు లేదని అందుకే వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని అత్యంత స్థానంలో తీర్చిదిద్దరమే నా లక్ష్యమని అన్నారు.

Views: 1