మేడిపల్లి ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జెండా ఆవిష్కరణ చేసిన ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వడ్డేమాను సుందర్
జయభేరి, మేడిపల్లి :
భారత 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం నాడు మేడిపల్లి ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వడ్డేమాను సుందర్ జాతీయ జెండావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు చిర్ర శ్రీధర్ రెడ్డి,సుందర్ లు మాట్లాడుతూ.. భారత రాజ్యంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యంగామని భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు సమాజిక న్యాయం జరుగుతుందని రాజ్యంగా ఫలాలు అన్ని వర్గాలకు అందేలా మీడియా పాత్ర ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారులు కల్కూరి ఎల్లయ్య, కోశాధికారి మారాటి మల్లేష్, సంయుక్త కార్యదర్శులు చిన్నం మధు, నీరుడు అంజన్, కార్యవర్గ సభ్యులు బుషా గణేష్, శేరి కరుణాకర్ రెడ్డి, సభ్యులు సీహెచ్ రవి కుమార్, కొండకింద సురేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.


