ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు
బతుకమ్మలతో ఆడపడుచుల సందడి
రామ రామ ఉయ్యాలో...
రామనే శ్రీరామ ఉయ్యాలో...
జయభేరి, సైదాపూర్ : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ పండుగ ప్రస్తుతం దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ప్రఖ్యాతిని పొందింది. ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు ప్రతి రోజు వైవిధ్యమైన బతుకమ్మను పేర్చుకుని పండుగ సంబరాలు నిర్వహిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై, సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అలిగిన బతుకమ్మకు, ఒక రోజు మినహాయించి, మిగతా ఎనిమిది రోజులు వైవిధ్యమైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. తీరోక్క పూలను అందంగా స్తూపం, శంఖం, గోపురం ఆకారంలో అమర్చడం జరుగుతుంది.

Read More Telangana I లగ్గం ఎట్లా జేయ్యాలే!?
Views: 97


