ప్రజా గాయకుడు గద్దర్.. షాద్ నగర్ లో జయంతి వేడుకలు
గద్దర్ కు నివాళులర్పించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఉద్యమకారులు
జయభేరి, షాద్ నగర్, జనవరి 31 : ప్రజా గాయకుడు గద్దర్ అని ఆయన ఎంతోమందిని చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గొప్ప గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయం అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారులతో కలిసి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే శంకర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ... తెలంగాణకు చెందిన ప్రముఖ విప్లవ కవి, ప్రజా గాయకుడు ఆయన తన పాటల ద్వారా సామాజిక అసమానతలను ప్రశ్నిస్తూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
Views: 3


