చెంగిచర్ల–చర్లపల్లి, చెంగిచర్ల డిపో కుపోయే రోడ్ల పై భారీ గుంతలు!
బస్సులు నడపాలంటే భయంగా ఉంది.. వెంటనే ప్యాచ్‌వర్క్ చేపట్టాలి
చెంగిచెర్ల డిపోకు వెళ్లే మార్గం మరి అధ్వానంగా మారింది
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల ఆవేదన
జయభేరి, మేడిపల్లి :చెంగిచర్ల నుంచి చర్లపల్లి వెళ్లే ప్రధాన రహదారి భారీ గుంతలతో అధ్వానంగా మారింది. ఈ మార్గంలో ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండటంతో గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

“ప్రస్తుతం శాశ్వత రహదారి పనులు చేపట్టడానికి సమయం పట్టినా, కనీసం గుంతలపై అత్యవసరంగా ప్యాచ్‌వర్క్ అయినా చేపట్టాలి. అధికారులు వెంటనే స్పందించి రోడ్డును ప్రయాణానికి అనుకూలంగా మార్చాలి” అని రఘుపాల్ రెడ్డి కోరారు. రహదారి మరమ్మతులు చేపట్టకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గుంతలను పూడ్చి ప్యాచ్‌వర్క్ చేపట్టాలని వారు కోరుతున్నారు.


