సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన

ఉదయం వాకింగ్ చేసే ప్రజలను కలుసుకుని సూచనలు చేసిన పోలీస్  అధికారులు

సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన

జయభేరి, జగిత్యాల జిల్లా..  ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం కల్పించాలన్న జిల్లా  ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలమేరకు జిల్లా పోలీస్ శాఖ ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించే దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇందులో బాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ఉదయం వాకింగ్ చేసే ప్రజలను కలుసుకుని, సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ క్రమంలో, ఉదయం వాకింగ్‌కు వచ్చే ప్రజలను పోలీసులు ప్రత్యక్షంగా కలుసుకుని, సైబర్ మోసాల నుండి రక్షించుకునే విధానాలపై వివరించారు. ప్రజలు ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు చేయడం, షాపింగ్, ట్రేడింగ్, సోషల్ మీడియా ఉపయోగించడం వంటి సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం సైబర్ మోసగాళ్లు పలు రకాలుగా ప్రజలను మోసం చేస్తున్నారని, ఫోన్ కాల్స్, ఫేక్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా లింక్స్, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా వ్యక్తిగత వివరాలు దొంగిలించి ఖాతాల్లో నుంచి డబ్బు తీసుకుంటున్నారని తెలిపారు.

Read More Telangana I తుంగతుర్తి గడ్డపై ఎగరబోయే జెండా..!?

సైబర్ మోసల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
•    అనుమానాస్పద లింక్స్‌పై క్లిక్ చేయరాదు,
•    బ్యాంకు వివరాలు, OTP, ఆధార్, పాన్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వరాదు,
•    ఏదైనా అనుమానం కలిగితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయాలి, లేదా
•    www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Read More Election I పార్టీల మేనిఫెస్టోల మతలబు ఏమిటి?

Views: 4