Telangan Sand I తెలంగాణ చరిత్ర, జాతి, ఎన్నటికీ క్షమించదు... ప్రకృతి సంపదను కొల్లగొట్టిన గత ప్రభుత్వపు పాలన...

ఇక ప్రకృతి సంపదలు కొల్లగొట్టి ఇసుక మాఫియా ముఠాలుగా ఏర్పడిన చరిత్ర తెలంగాణ జాతి ఎప్పుడు మరిచిపోదు. ఇదే విషయంపై జయభేరి అందిస్తున్న ధారావాహిక అక్షర యజ్ఞం కౌంటర్ విత్త కడారి శ్రీనివాస్ సమగ్ర విశ్లేషణ....

Telangan Sand I తెలంగాణ చరిత్ర, జాతి, ఎన్నటికీ క్షమించదు... ప్రకృతి సంపదను కొల్లగొట్టిన  గత ప్రభుత్వపు పాలన...

జయభేరి, హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో అన్ని శాఖలు వ్యవస్థీకృత విధ్వంసం ఆయన సంగతి మనందరికీ తెలిసిందే... గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన ఘనత గత ప్రభుత్వానిదే. ఇక ప్రకృతి సంపదలు కొల్లగొట్టి ఇసుక మాఫియా ముఠాలుగా ఏర్పడిన చరిత్ర తెలంగాణ జాతి ఎప్పుడు మరిచిపోదు. ఇదే విషయంపై జయభేరి అందిస్తున్న ధారావాహిక అక్షర యజ్ఞం కౌంటర్ విత్త కడారి శ్రీనివాస్ సమగ్ర విశ్లేషణ....

Read More ఫ్లాష్ ప్లాష్ ఫ్లాష్ ప్లాష్... ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఇసుక రవాణాపై అమ్మకాలపై కొత్త విధివిధానాలు తయారు చేయాలని గతంలో జరిగిన విధ్వంసాన్ని అరికట్టడానికి ఎలాంటి విధివిధానాలను తీసుకురావాలని ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తి వివరాలను కనుగొనే ప్రయత్నం చేశారు.. ఈ నేపథ్యంలో మన మాజీ ముఖ్యమంత్రి చేసిన నిర్వాకానికి ఇది పరాకాష్టగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే గ్రామస్థాయిలో పటిష్టంగా పనిచేసే రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేసి ప్రకృతి సంపదను కొల్లగొట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆ నాలుగు కుటుంబాలే తెలంగాణ సంపదను దోచుకున్నాయి.

Read More రేవంత్ రెడ్డి కి ఓటు వేసి తప్పు చేశాం అంటున్న ప్రజలు....

ఇంకోవైపు తొలి తెలంగాణ శాసనసభ్యులుగా ఎన్నికైన ఒక్కొక్క ఎమ్మెల్యే రాకాసి బల్లుల కంటే ఎక్కువగా కరెన్సీ కట్టలకు లాలూచీపడి సహజ సంపదగా దొరికే ఇసుకను అక్రమ రవాణా చేస్తూ అడ్డగోలుగా సంపాదించారు. ఒక్కో ఎమ్మెల్యే ఇసుక దొరికే దగ్గర కోట్ల నిధులను కొల్లగొట్టి మెడలు తిరగకుండా బలుపు బలిసి తెలంగాణ సంపదను సహజ సంపదను అప్పనంగా ఆదాయ వనరులుగా మార్చుకున్నది నాటి కెసిఆర్ పాలన.

Read More అపూర్వం ఆత్మీయ సమ్మేళనం 

ఇసుక రవాణా తమ సొంత ఆస్తి అన్నట్టుగా గత ప్రభుత్వంలో ఇసుక విధానాన్ని ఒక్కసారి పరిశీలిస్తే లోపాయ భూయిష్టమైనదిగా ఆదాయ వనరుగా సహజ సంపదను పూర్తిగా ప్రజలకు అందుబాటులో లేకుండా కొల్లగొట్టారు. పేరుకే టెండర్లు కానీ తనిఖీలు ఉండవు విజిలెన్స్ అధికారులు ఉండరు తూతూ మంత్రంగా ఆన్లైన్ బుకింగ్ అంటూ సోది చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం వేయింగ్ మిషన్ ఉండవు డంపు యార్డుల దగ్గర సీసీ కెమెరాలు ఉండవు లోడింగ్ పాయింట్స్ దగ్గర అధిక లోడు వేస్తున్న ఎవరూ పట్టించుకోరు దీనికి భిన్నంగా పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి విద్వాంసంగా మారిపోయాయి...

Read More పెట్రోల్ ధరల పెంపు? తప్పదా?

ఇసుక మాఫియాగా ఏర్పడిన గత తెలంగాణ పాలనలో జరిగిన ఇసుక అక్రమ రవాణాపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిండు శాసనసభలో కాగ్ నివేదిక బిత్తరపోయే అంశాలను ప్రవేశపెట్టింది. సహజ సంపదలను కొల్లగొడుతూ పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టకపోతే రానున్న రోజుల్లో తెలంగాణ కరువు కోరల్లో చిక్కుకుంటుందన్న కాగు నివేదికను చూస్తే గత కెసిఆర్ పరిపాలనలో ఆయా నియోజకవర్గాల్లో పరిపాలన కొనసాగించిన ఎమ్మెల్యేలు సిగ్గుతో చచ్చిపోవాలి... అప్పనంగా సహజ సంపదను కొల్లగొట్టడమే కాకుండా దుర్భేద్యమైన రోడ్ల వ్యవస్థను నాశనం చేసి జీరో పర్మిషన్తో డంప్యాడ్ దగ్గర సిసి కెమెరాలు లేకుండా లోడింగ్ పాయింట్ దగ్గర తనిఖీలు జరపకుండా ఓవర్ లోడింగ్ తో ఇసుకను అక్రమంగా రవాణా చేయడంలో నాటి తెరాస నాయకుల పాలన తలుసుకుంటేనే తెలంగాణ రాష్ట్రంలో వారిని బొంద పెట్టాలనిపిస్తుంది... సిగ్గు లజ్జ మానం మర్యాద ఇవేవీ పట్టించుకోకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్లల్లో నిధులను వెనకేసుకున్న పాడు చరిత్ర నాటి కెసిఆర్ పాలనలో ఎమ్మెల్యేలుగా కొనసాగించిన దౌర్భాగ్యులది...

Read More మోటార్ సైకిల్ దొంగలించిన నిందితుడు అరెస్టు 

కాదు నివేదిక గత ప్రభుత్వ ఇసుక రవాణా విధి విధానాలను వ్యతిరేకించలేకపోయినా గ్రౌండ్ లెవెల్లో సూపర్ విజన్ లేకపోవడం రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేయడం దాదాపు నాలుగు వందల కోట్ల నిధులను సమకూర్చుకుందనే నిజం తెలిస్తే తెలంగాణ ప్రజలు క్షమిస్తారా!? ఇంకవైపు దళారీ వ్యవస్థ దాదాపు 900 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు చెల్లించకుండా అవినీతితో కరెన్సీ కట్టలకు అమ్ముడుపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను ఆ ఇసుకలోనే బొంద పెట్టాలనే అంత ఆవేశం తెలంగాణ ప్రజల్లో కట్టలు తెలుసుకుంటుంది. ప్రకృతి సహజ సంపదను పూర్తిగా సొంత ఆస్తిగా భావించి ఆదాయ వనరులుగా మలుచుకొని గ్రామస్థాయిలో పూర్తిగా నీటి కొరతకు ఏర్పాటు కావడానికి గత ప్రభుత్వ పాలనే సాక్ష్యం. ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది అని తెలిసిన పట్టించుకున్న నాధుడే లేడు. అంతెందుకు గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి టెండర్లు లేకుండా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా టీఎస్ఎండిసి దగ్గర ఉద్యోగులు ఉన్నారని పేరుకే చెబుతూ అక్కడ ఉద్యోగులే ఉండరు. ఇంతటి దుర్భైచమైన పాలన గత ప్రభుత్వపు పరాకాష్టకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.

Read More తెలంగాణ ప్రభుత్వ 'ప్రవాసి ప్రజావాణి' గల్ఫ్ వలసదారులకు ఓదార్పునిస్తుంది, ధైర్యాన్ని నింపుతుంది: డాక్టర్ ఎం ఎ జమాన్ 

వాల్టా చట్టం ఎన్ని నియమ నిబంధనలు చెప్పినా వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు కేసీఆర్ ప్రభుత్వం.. రెండు మీటర్ల లోతు ఇసుకను తోడుకోవాలని నిబంధనలు ఉంటే మూడు నాలుగు మీటర్ల లోతు వరకు తోడుకున్న రాక్షస మూకలు నాటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు... ఒకవైపు జీరో పర్మిషన్తో అధిక లోడింగ్ తో ఇసుకను తరలిస్తూ ఇంకోవైపు దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తూ ఎక్కువ రేటుకు నగరంలో అమ్ముకుంటూ గ్రామీణ మండల జిల్లా స్థాయి పర్యవేక్షణ లేకుండా గ్రామస్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను నడ్డి విరిచి పూర్తిగా తమవైపు మళ్లించుకుని సహజ సంపదను ఆదాయ వనరులుగా మార్చుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా మైనింగ్ రెవెన్యూ సంబంధాలతో లేకుండా అనుమతి తీసుకోకుండా ఒక సూపర్ విజన్ లేకుండా వీఆర్వో ఎమ్మార్వో రిజిస్టర్ వీరితో పని లేకుండా తమ ఇష్టా రీతిగా గ్రామాల్లో సహజ సంపాదన ఇసుక రవాణాను ఒక మాఫియా ముఠాగా ఏర్పడి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన దుర్భరమైన చరిత్రకు సాక్ష్యంగా నాటి తెరాస రాజకీయం శాసనసభ్యుల పనితీరు తెలంగాణ చరిత్ర ఎన్నటికీ మరిచిపోదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం టిఎస్ఎండిసి పర్యవేక్షణ ఎంతవరకు ఉంది కాగ్ నివేదికలు ఏం చెప్పాయి వాల్టా చట్టం ఏం చెబుతుంది నాటి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనే విషయాలను పూర్తిగా అడిగి తెలుసుకుని వాటిని వెలికి తీయాలంటూ ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను తగ్గించే చర్యలకు శ్రీకారం చుట్టారు. పర్మిషన్లు ఎంతవరకు ఇచ్చారు జీరో పర్మిషన్తో ఎంత ఇసుకను తోడుకున్నారు అనే వాటిపై ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని సూచించారు.

Read More ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... ఏసీబీ అధికారులకు చిక్కిన రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్

గ్రామపంచాయతీ ఎమ్మార్వో ఎండిఓ అధికారులకు తత్సంబంధాలు కలిగి ఉండాలని, స్థానికులకు ఇంటి నిర్మాణం కొరకు ఇసుకను "మన ఇసుక వాహనం " అనే ఆప్ ద్వారా తక్కువకు అందివ్వాలని అధికారులను సూచించారు. అంతేకాకుండా ఇసుక లారీలు తిరగడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా పాడైపోయిన రోడ్లను వెంటనే పరిశీలించి ఆ సమస్యను పరిష్కరించాలని స్థానిక సంస్థలకు 27% 50 శాతం మండల స్థాయి 20% గ్రామస్థాయిలో నిధులను కేటాయించాలని తెలియజేశారు. గ్రామీణ స్థాయిలో మెట్రిక్ టన్నుకు 600 రూపాయలను ఏర్పాటు చేయడం తగదని గ్రామంలో ఉండే స్థానికులకు వంద రూపాయలకు ఇసుకను అమ్మాలని మన ఇసుక వాహనం ద్వారా అందించాలని నిపుణులు సూచిస్తున్నారు..
గత ప్రభుత్వంలో అక్రమ ఇసుక రవాణా చేయడమే కాకుండా సేఫ్టీ చూసుకోకుండా ఆర్టీవో వాళ్లతో సంబంధం లేకుండా రెవిన్యూ పాలసీని పూర్తిగా నాశనం చేసి మైండ్సులను తెగ మింగి ప్రభుత్వం ఇసుక రేటును అమాంతం పెంచేసి ఇసుకను ఒక పెద్ద మాఫియా ముఠాగా ఏర్పాటు చేసుకున్న ఘనత నాటి కెసిఆర్ ప్రభుత్వానికి చెందుతుంది. రెండు మీటర్ల కంటే ఎక్కువ లోతు తీయకూడదు అనే కనీస ధ్యానం లేని ముష్కరులు పూర్తిగా సహజ సంపదను కొల్లగొట్టారని కాగ్ నివేదిక దుమ్మెత్తి పోసింది. పర్యావరణ పరిరక్షణకు పట్టించుకోని ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్ల నిధులను కొల్లగొట్టి పేరుకే పర్యావరణం పచ్చదనం పరిశుభ్రత ఇలాంటి మాయమాటలతో కాలం పది సంవత్సరాలు వెల్ల తీసుకొని బాగానే కాసులను వెనకేసుకొచ్చిన ప్రకృతి సహజ సంపదలను దోచుకున్న దాహం తీరక అన్ని శాఖల్లోనూ అవినీతి కార్యక్రమాలకు కోరలు చాపి విషాన్ని కక్కాయ్...

Read More శ్రీ సాయి సన్నిధి వెంచర్ ను ప్రారంభించిన సినీ హీరో  శ్రీకాంత్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

ఇప్పటికైనా స్థానికులకు 27% కచ్చితంగా అందిస్తూ మండల స్థాయి వాళ్లకు 50% అందిస్తూ 20% గ్రామస్థాయి స్థానికులకు ఇసుకను అమ్మే నా ద్వారా వచ్చే ఆదాయంలో ఆ శాతాన్ని లెక్కిస్తూ మండల స్థానిక గ్రామం అధికారులకు ఆ రుసుమును చెల్లించాలని ఉన్నప్పటికీ ప్రజలతో సంబంధం లేకుండా ఇరిగేషన్ తో సంబంధం లేకుండా విధివిధానాలు సరిగ్గా లేకుండా పూర్తిగా తెరాస ప్రభుత్వం సహజ వనరులను కొల్లగొట్టి 24 గంటలు ఇసుకను తోడుకొని కాసులు వెనకేసుకుని పబ్బం గడుపుకున్నాయి.. ఈ చరిత్ర సరిపోదా కేసీఆర్ను చిదరించుకోవడానికి. విద్య వైద్యం ఉపాధి ఇలా అన్ని శాఖలను వ్యవస్థీకృత విధ్వంసానికి పూనుకున్న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనే ఒక ఇంజనీర్గా ఆయనే ఒక కలెక్టర్గా ఆయనే ఒక సైంటిస్ట్ గా ఆయనే ఒక ఆర్కిటిక్గా అన్ని శాఖలను తన గుప్పిట్లో పెట్టుకుని తెలంగాణ సహజ సంపదను కొల్లగొట్టి కుబేరుడు అనిపించుకున్న తెలంగాణ చరిత్ర జాతి ఎన్నటికీ క్షమించదు...

Read More మైనంపల్లి హన్మంతరావు ను విమర్శించే స్థాయి ప్రతాప్ రెడ్డి కి లేదు

ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సమీక్ష నిర్వహించడమే కాదు స్థానికులకు ఇసుకను ఉచితంగా అందించే లాగున సూపర్ విజన్ ఏర్పాటుచేసి డంప్యాడ్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టి ఇసుక దళారులు లేకుండా చూసి కఠినమైన చట్టాలను చేసి కఠినమైన నిర్ణయాలు తీసుకొని ప్రకృతి సహజ సంపదలను కాపాడాలి ఆ దిశగా మాటలు కాదు చేతుల్లో నిరూపించుకోవాలి.

Read More  ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు

...కడారి శ్రీనివాస్ 
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత