Telangana I రాజకీయాలు.. పోలీసులు...
తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల ప్రక్షాళన మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా రాష్ట్ర పోలీస్ అధికారి శ్రీనివాస్ రెడ్డి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్న మొత్తం పోలీసు సిబ్బందిని దాదాపు 85 మందిని ఒకేసారి బదిలీ చేసింది. అంతేకాదు వారికి ఎక్కడ కూడా పోస్టు ఇవ్వలేదు.
జయభేరి, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో పంజాగుట్ట ఈ పోలీస్ స్టేషన్లో కారణాలు ఏమైనప్పటికీ 85 మందిని ఎస్సై దగ్గర నుంచి హోంగార్డు వరకు అందరినీ ఏకబిగిన బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు పోలీస్ బాస్ శ్రీనివాస్ రెడ్డి. ఈ నేపథ్యంలో పలు అనుమానాలకు దారితీస్తున్న సందర్భం చోటుచేసుకుంది. పోలీసులను ఉన్నతాధికారులు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సస్పెన్స్ చేయడం పెద్ద పనిష్మెంట్ కాదు. ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వారికి అలవెన్స్ లు అందుతాయి. ఈ రెండు కాకుండా పోలీసు వ్యవస్థలో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టపరంగా వారిని ఎఫ్ ఐ ఆర్ చేసి శిక్షించాలి. అంతేకానీ సస్పెన్స్ చేసిన తర్వాత మరి కొద్ది రోజుల్లోనే మళ్లీ ఉద్యోగం పొందుకునే అవకాశాలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మూకుమ్మడిగా ఎందుకు పోలీసులందరినీ బదిలీ చేశారు అని ఆలోచిస్తే అక్కడ ఉన్న పోలీసు స్టాఫ్ మొత్తం దాదాపు ఏళ్ల కొద్దీ అక్కడనే మఖం పెట్టి ఉన్నారు అనేది పచ్చి నిజం. అలా కొన్ని నీళ్లు గా అక్కడనే డ్యూటీ చేస్తూ ఉండడం దీని ద్వారా కొందరిపై తీవ్రమైన ఆరోపణలు రావడం అర్హతను పట్టి ఉన్న పోలీసు విభాగాల్లో పని చేస్తున్న వారికి పని విధానం తప్పుదోవ పట్టడం రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చడం ఇలా కారణాలు ఏమైనాప్పటికీ ఏకబిగిన పంజాగుట్టలో పనిచేస్తున్న 85 పోలీసులపై బదిలీ వేటు పడింది. ఇప్పటివరకు వారికి ఎక్కడ పోస్టు ఇవ్వలేదు. ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు వ్యవస్థపై 2006లో సుప్రీంకోర్టు 6 అంశాలతో ఒక నివేదికను అందించింది.
1) రాష్ట్రంలో పోలీసు సెక్యూరిటీ లెవెల్ దీనిలో ముఖ్యమంత్రి డిజిపి సీపీలతో కలిగిన ఒక కమిటీ ఆయా పరిధిలో పనిచేసే పోలీసు స్టేషన్లలో ఉన్న సిబ్బంది పనితీరును పసిగట్టేందుకు కొంతమందిని నియమించి రిపోర్టు ఉన్నతాధికారులకు అందివ్వాలి. అలా రిపోర్టులో అవినీతి నేరారూపణలు రుజువైన ఈమట ఆరు నెలల్లో వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.
2) డిజిపి పర్యవేక్షణలో పోలీసు శాఖలో పనిచేస్తున్న అవినీతి రహిత పోలీసు ఉన్నతాధికారులను గుర్తించి వారి సీనియార్టీ ప్రకారం పబ్లిక్ కమిషన్ నుండి వారిని రెండు సంవత్సరాల వరకు ట్రాన్స్ఫర్ లేకుండా చూడాలి. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఉండాలి.
3) కంప్లైంట్ అథారిటీ జిల్లా స్థాయిలో ఉండాలి పోలీసు వ్యవస్థ సరిగ్గా పని చేయాలంటే ప్రజలతో మమేకమవుతూ సేవా భావం నమ్మకం గౌరవాన్ని పెంపొందించుకోవాలి...అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ లోకాయుక్త పేరుతో నడిపిస్తున్న ప్రస్తుతం అది కోరల్లేని లోకాయుక్త గా మారుతుంది. అదే కర్ణాటకలో లోకయుక్త చాలా మంచిగా యదార్ధంగా పనిచేస్తుంది.
పోలీసు శాఖలో చాలా ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వారిపై నిఘాలు ఏర్పాటు నిఘ ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎంతటి వారైనా సరే అవినీతి రుజువైతే వారిపై ఎఫ్ఐఆర్ కట్టాలి. అలాగే పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ ల్యాండ్ మాఫియాలో తలదుర్చే వారు ఎవరైనా తమ పరిధిలో ఉంటే కమిషన్ కు రిపోర్టు చేయాలి. కానీ చాలా విషయాల్లో ఎస్ హెచ్ ఓ పరిధిలో ఉన్న నిగ పెట్టే పోలీసు సిబ్బంది నిజాయితీగా పని చేయకపోవడం వలన సుపరిపాలన జరగడం లేదు. దీనివల్ల ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీసు అధికారులు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అండదండలతో ఆ జిల్లా మంత్రితో తత్సబంధాలు కలిగి పొలిటికల్ మాఫియాలు రక్షణ వ్యవస్థ బలహీన పడిపోతుంది. ఒక పోలీసు అధికారి మంచిని కాపాడడంలో వెనకడుగు వేస్తున్నారు గట్టిగా వినపడుతున్నాయి. ఎందుకంటే లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే మనిషి చెప్పు చేతుల్లో సదరు ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జీ హుజూర్ అని తమ పనిని తాము చేసుకోకుండా వాయిదా వేసుకుపోవడమే ఎందుకు నిదర్శనం. ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయ నాయకుల కాళ్లకు మడుగులోత్తుతున్నారు పోలీసు వ్యవస్థ అని నిక్కచ్చిగా చెప్పవచ్చు. అలా అలా అని పోలీసు వ్యవస్థలో నీతి నిజాయితీ గల పోలీసులు ఉన్నారు. వారికి ఈ మాటలు వర్తింపవు. అలా అంటే నిజాయితీ గల పోలీసులకు ఉన్నతాధికారులకు సరైన గుర్తింపు లేదనేది వాస్తవం.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పూర్తిగా అక్కడ పనిచేస్తున్న హోంగార్డు నుంచి ఎస్ఐ వరకు 86 మందిని సస్పెండ్ చేయడం గత ఆగస్టులో కూడా బదిలీల కోసం ఆదేశాలు చేయడం జరిగినప్పటికీ బదిలీ చేయడం ఆగిపోయింది. ఎలక్షన్ సమయంలో పోలీసులు అవినీతి రాజకీయ నాయకులతో మమేకమై ఎలక్షన్ కమిషన్ కి దొరికితే వారిని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తుంది. అలా సస్పెండ్ అయిన వారు తిరిగి మళ్లీ ఎలక్షన్ డ్యూటీ లో పడకుండా ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అది ఎంతవరకు జరుగుతుందనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అందుకని కచ్చితంగా పోలీస్ ఎస్టాబ్లిష్ పోలీస్ రిఫార్మ్స్ అనేవి కచ్చితంగా జరగాలి. రాజకీయాలు పోలీసులు ఎవరి పని వారు చేసుకునే కానీ గత ఐదేళ్లలో రాజకీయ నాయకుల గుప్పెట్లలో పోలీసులు పనిచేశారు అని ఆరోపణలు గట్టిగా వినపడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంది. అందుకుగాను కమాండ్ కంట్రోల్, షీ టీమ్స్ 24 గంటలు రక్షణ వ్యవస్థ, ఏసీబీ ఇలా చెప్పుకుంటూ పోతే పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంది. పోలీసు వ్యవస్థలో స్థిరంగా పనిచేయాలి అంటే వివాదాలకు భూ సంబంధిత సివిల్ కు సంబంధించిన కేసులను దూరంగా పెట్టాలి. ఇందుకోసం డిజిపి కమిషనర్ హోమ్ మినిస్టర్ సీఎం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పటికీ సివిల్ భూ వివిధ భూ వివాదాల్లో పోలీసులు 80% తల దూరుస్తున్నారనేది ప్రజసర్వే ప్రకారం తెలుస్తోంది.
ఎందుకంటే రాజకీయ నాయకుల ఒత్తిడి ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాల్లో తాను ఖర్చుపెట్టిన దానికంటే ఎక్కువగా సంపాదించుకోవడానికి ల్యాండ్ మాఫియాలు ఇసుక మాఫియాలు భూ దందాలు ఇలాంటి వాటిని ప్రేరేపిస్తూ వారికి రక్షణగా పోలీసులను తమ గుప్పిట్లో పెట్టుకుని లాభాలను అర్జిస్తూ దాంట్లో సగభాగం పోలీసుల ఉన్నతాధికారులకు అందించే ఒక దుర్భరమైన వ్యవస్థను తయారు చేసింది ప్రస్తుత రాజకీయం.. ఎందుకంటే ఆ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేకు కావలసిన ఎస్ఐ సీఐలను ఏరి కోరి మరీ పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల ఎమ్మెల్యే ఆడింది ఆట పాడింది పాట. అందుకనే ఈ మధ్యన ప్రజలు తమ సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్ కు వెళ్లడం లేదు. సదరు ఎమ్మెల్యే ఇంటి గడప ముందర వందల జనాలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. ఇలా చేయడం వల్ల ప్రజల్లో పోలీసు వ్యవస్థ ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఒకవేళ రాజకీయ నాయకులకు లొంగకుండా నిజాయితీ నిబద్ధత గల పోలీసు అధికారులు పనిచేసుకుంటూ పోతే రాజకీయ నాయకుడు జోక్యం చేసుకొని ఆరు నెలల్లోనే ఆ పోలీసు ఉన్నతాధికారిని ట్రాన్స్ఫర్ చేపించే పనిని పూనుకుంటాడు. ఇలా చేయడం ద్వారా పోలీసులు కాలానుగుణంగా రాజకీయ నాయకులతో మనకెందుకు అనుకుంటూ ప్రజా సమస్యలను పెడచెవిన పెట్టి సదరు ఆ ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారు.అందుకే ప్రజాస్వామ్యం అనుగడం కోసం ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో నిఘా టీం ఏర్పాటు చేయాలి వారి వారి విధి విధానాలపై ఎప్పటికప్పుడు డేగ కన్నుతో దృష్టి సారించాలి అలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సదరు పోలీసు ఉన్నతాధికారి అవినీతి రుజువని తేలితే ఎఫ్ఐఆర్ వెంటనే కట్టాలి ఇలా చేస్తే ప్రజాస్వామ్యం మనుగడ పరిరవీల్లుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా నడుస్తోంది. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ వచ్చిన దగ్గరనుంచి వారికి ట్రైనింగ్ లో చాలా బాగా తమ మాట తీరు భాష పరిజ్ఞానం పెంచుకునేలా చక్కని ట్రైనింగ్ ఇస్తున్నారు తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్. గత 15 సంవత్సరాల పరిపాలనలో పోలీసుల మాట చాలా దురుసుగా ఉండేది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత గడచిన పదేళ్ల లో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ పటిష్టం కావడం వల్ల పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐ సీఐ హోంగార్డుల దగ్గర నుంచి వారి భాష పూర్తిగా మారిపోయింది మే ఐ హెల్ప్ యు అనే పదం వచ్చింది. అవినీతికి చోటు లేకుండా నిజాయితీ నిబద్ధతతో చట్టానికి లోబడి పని చేయాల్సిన పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ చరిత్రలో దళితులపై అమాయకమైన అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడ్డ దాఖలాలు లేకపోలేదు... అలాంటి దుర్మార్గమైన పనికి దూరంగా పోలీసు వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం దృష్టిలో అందరూ సమానమే కాబట్టి ప్రతి వారిని గౌరవిస్తూ మంచి భాష పరిజ్ఞానంతో పోలీసులు పోలీసులు ఉన్నతాధికారులు ప్రజల పట్ల మంచి భాషతో ప్రవర్తించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్లల్లో పోలీసు వ్యవస్థకు మంచి లేటెస్ట్ టెక్నాలజీ ఉంది నేరాలు తగ్గిపోయాయి. ఇప్పటికే పోలీసు వ్యవస్థలో చాలా మార్పు వచ్చినప్పటికీ ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో జరిగిన బదిలీల పర్వాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది.
అవినీతి ఆరోపణలు వచ్చిన పోలీసు ఉన్నతాధికారులను ట్రాన్స్ఫర్ పనిష్మెంట్ చేయడం వల్ల వారిలో ఎలాంటి మార్పు రాదు కాబట్టి వారిని పూర్తిగా విధుల్లో నుంచి నిషేదించాలని పలు పలు సంఘాలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకనే పోలీసు వ్యవస్థలో పని చేస్తున్న ప్రతి ఒక్క ఉన్నతాధికారులకు కానిస్టేబుల్ హోంగార్డ్ ఎస్ ఐ సి ఐ ఇలా ప్రతి ఒక్కరికి మంచి ట్రైనింగ్ ను ఇస్తూ వారికి శిక్షణను కల్పిస్తూ విధుల్లోకి పంపాలి.
మొత్తానికి పోలీసు వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన జరుగుతుందా అంటే రాజకీయాలు పోలీసు వ్యవస్థకు ఎంత దూరంగా ఉంటే పోలీసు వ్యవస్థ అంత మెరుగ్గా పనిచేస్తుంది అనేది జగమెరిగిన సత్యం. పోలీసులు రాజకీయాలకు దూరంగా ఉండి చట్టానికి అందరూ సమానమే అన్న సూక్తితో చట్టానికి లోబడి పని చేసుకోవాలి.. దూరదృష్టితో ఆలోచించాలి కానీ ధనాపేక్షతో అధికార వ్యామోహంతో ఉన్నత అధికారులుగా మారడానికి రాజకీయ నాయకుల కాళ్లకు మడుగులోత్తకూడదు... రాబోయే కాలంలో పోలీసు వ్యవస్థ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా ఉన్న తరుణంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు భూ వివాదాల్లో పోలీసులు తలదురుచకుండా మరింత మెరుగ్గా ప్రజారక్షణ బాధ్యతను తీసుకుంటారని కోరుకుందాం...
...- కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, కవి, సీనియర్ రాజకీయ విశ్లేషకులు
9848 962 799
Post Comment