నాయిదొరా జానపద నృత్య షూటింగ్ ప్రారంభం
కళలను ప్రోత్సహిస్తున్న RK సేవా ఫౌండేషన్
జయభేరి, దేవరకొండ :
దేవరకొండలో జరిగిన నాయిదొరా జానపద నృత్య షూటింగ్ ప్రారంభం కార్యక్రమంలో RK సేవా ఫౌండేషన్ ముహూర్తం షూట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో RK సేవా ఫౌండేషన్ అధ్యక్షులు పున్న రామకృష్ణ మాట్లాడుతూ... మల్టి టాలెంట్ అవార్డు గ్రహీత ఈ యొక్క సాంగ్ హీరో అయినా ముషీని అంజి ని అభినందిస్తూ వారు దేవరకొండ తెస్తున్న కీర్తి ప్రతిష్ట చేస్తున్న సేవలు చాలా అభినందనియమని, వారు చేస్తున్న ఈ సాంగ్ ఎన్నో అవార్డ్స్ పొందుకోవాలని మంచి పేరు తెచ్చి పెట్టాలని కొనియాడడం జరిగింది, డాన్సర్ కళ్యాణి మరియు కొరియగ్రాపర్ మాస్టర్ జగన్ కు మంచి గుర్తింపురావాలని డాన్స్ యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప అధ్యక్షులు చిత్తనూరు మాస్టర్ శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి పొట్ట విజయ్ కుమార్, మాకబుల్,గుండాల వెంకట్ యాదవ్, టోంగర్ ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.


