మచ్చలేని నాయకుడు కేసీఆర్
మాజీ కౌన్సిలర్ అమరం జైపాల్ రెడ్డి
జయభేరి, మేడ్చల్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ సరికాదని, ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడటం తగదని గుండ్లపోచంపల్లి మాజీ కౌన్సిలర్ అమరం జైపాల్ రెడ్డి తెలిపారు. ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమం చేసిన నాయకుడిపై చర్యలు తగవని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కాళేశ్వర జలాలతో లక్షల ఎకరాల భూమిని సస్యశ్యామలం చేసినందుకు, రైతుబంధు, రైతు బీమా ఇచ్చిన నాయకునిపై, వ్యవసాయాన్ని పండగల మార్చిన కేసీఆర్ పై సిట్ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థల దుర్వినియోగానికి ఇది పరాకాష్ట అని కేసీఆర్ ని టచ్ చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని టచ్ చేసినట్లే అని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ ది అని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకు నోటీసుల పేరుతో డ్రామాలు చేస్తుందని ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన ప్రజా సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ పోరాటాలు అగవని జైపాల్ రెడ్డి హెచ్చరించారు.


