షాద్ నగర్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ నేతలు
సీఎం.. సీఎం అంటూ పెద్ద ఎత్తున కార్యకర్తల నినాదాలు..
బిఆర్ఎస్ కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించిన కేటీఆర్...
జన సందోహంలో కాన్వాయ్ నుండే అంజన్న ఎక్కడ అంటూ దగ్గరికి తీసుకున్న కేటీఆర్.
జయభేరి, షాద్ నగర్, జనవరి 12 : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ బైపాస్ కేశంపేట రోడ్డులో మహబూబ్ నగర్ వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాద్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆరు మండలాల నుండి పట్టణం నుండి ఇసుకేస్తే రాలనంత కార్యకర్తలు కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు.
ఇది బహిరంగ సభ కాదన్నారు కేవలం కేటీఆర్ కి స్వాగతం పలికేందుకే ఒక్క మెసేజ్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున జనసందోహంతో నిండిపోయిందన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వచ్చే మున్సిపల్, పరిషత్, అన్ని ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అందిస్థానాలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చి గెలుపే లక్ష్యంగా పూర్తిస్థాయిలో తమ అభ్యర్థులను గెలిపించుకుంటామని అన్నారు.
కేటీఆర్ రాకతో షాద్ నగర్ లో కొత్త జోష్.... కేటీఆర్ బి ఆర్ ఎస్ పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ లా కాకుండా ఒక సామాన్యుడిలా అందరిని పలకరించి కొద్దిసేపు ముచ్చటించడంతో నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని సీఎం సీఎం అని భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..


