Telangana I జంప్ జిలానీల తో ఎల్బీనగర్ తికమక
కాసుల కోసం ఇంతగా రాజకీయాన్ని వాడుకునే నేతలను చూస్తే ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
జయభేరి, హైదరాబాద్ : ఎల్బీనగర్ నియోజకవర్గంలో జంపు జిలానిలో ఎంతమంది ఉన్నా కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తోంది.. నిజానికి ఎల్బీనగర్ నియోజకవర్గం లో కాంగ్రెస్లోకి వలసలు వచ్చిన తిరిగి సొంత గూటిలోకి వెళుతున్న నాయకులను చూస్తే ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు... ఇంతటి అవకాశవాద రాజకీయం ఎక్కడ చూడలేదంటూ బాహటంగానే ఆరోపణలు చేస్తున్నారు.. ఎందుకోసం ఆ నేత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు ఎందుకోసం మళ్లీ సొంతగూటికి చేరాడు ఇప్పటికే ప్రజలకు దాదాపు అర్థమయిపోయింది...
నిజానికి ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎక్కువగా వలస వచ్చిన ప్రాంత ప్రజలు ఇక్కడ సెటిలర్స్ గా ఉంటారు. మరి అలాంటి వారు తమ నమ్ముకున్న నాయకునికి అండదండగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణ సెంటిమెంటుతో బి. అర్ స్ ను అధికారంలోకి తీసుకొచ్చారు తెలంగాణ ప్రజలు... ఎల్బీనగర్ నియోజకవర్గం అంటేనే పోరాటానికి ఒక దారి చూపిన నియోజకవర్గం గా చరిత్ర పుటల్లో ఉన్న ఇక్కడ రాజకీయాలు చూస్తే మాత్రం అపహస్యకంగా మారిపోతున్నాయి...
నాయకుల వలసలు తీరుతెన్నిలో గమనిస్తూ ప్రజలు నిషితగా పరిశీలిస్తున్నారు... ఇక సర్వేలైతే పూర్తిగా కాంగ్రెస్కే అధికారాన్ని ప్రజలు కట్టబెడతారు అని తేల్చేస్తున్నాయి... చూద్దాం నవంబర్ 30 వ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో ఎల్బీనగర్ గడ్డ కాంగ్రెస్ కి అడ్డంగా మారుతుందా లేకుంటే ప్రజలు మళ్ళీ అధికార పార్టీకే పటం కడతారా అనే విషయం రిజల్ట్ తర్వాత చూడాల్సిందే...
... కడారి శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్
Post Comment