TS_Assembly I అక్కడ... సీటు త్యాగాలకు సిద్ధమా.. రణమా!? శరణమా!?
కంటోన్మెంట్ ఎమ్మెల్యే అకస్మాత్తుగా ప్రమాదంలో మరణించడం అక్కడ ఉప ఎన్నికకు తెర లేపుతోంది. ఈ నేపథ్యంలో త్యాగాలకు సిద్ధమా? పోటీ తత్వమా? అనే అంశం మళ్లీ రాజకీయ రణరంగంలో వాడి వేడి చర్చ జరుగుతుంది.
జయభేరి, హైదరాబాద్ :
ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు తీసుకొస్తుంటే మరోవైపు శాసనసభ ఎన్నికలు జరిగి మూడు నెలలు కాకముందే మరో ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో లాస్య నందిత అకస్మాత్తుగా మరణించడం డిఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా సంభవిస్తుంది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ సీటును త్యాగాలకు సిద్ధం చేస్తుందా లేదంటే కచ్చితంగా పోటీ కి దిగుతుందా అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంటుంది. నిజానికి గత పదిహేళ్ళ అధికారంలో కేసీఆర్ ప్రభుత్వం త్యాగాలకు సిద్ధం లేకుండా కచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తూ తన సమాధిని తానే తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబెడుతుందా లేదా అనే విషయాన్ని ఇంకా ఎటు తేల్చుకోకపోయినా ఉపఎన్నికకు పిలుపు వస్తే కనుక కచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెట్టే యోజన లో ఉంది. గత పది ఏళ్ల ప్రభుత్వంలో టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోతే అభ్యర్థులను బరిలోకి దించిన చరిత్రకు పునాది వేసింది కేసీఆర్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోయిన నేపథ్యంలో ఏకగ్రీవానికి ఒప్పుకోవాలని ప్రత్యర్థులను కోరిన కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకోలేదు కచ్చితంగా పోటీ చేసి అభ్యర్థులను గెలిపించుకుంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని దించాలని యోజనలో గట్టిగా పట్టుబట్టి కూర్చుంది. ఎందుకంటే నీవు నేర్పిన విద్య కదా గురువా అన్నట్టుగా ఉంది ఈ ఉపాయాన్నిక తీరు చూస్తే...
అకస్మాత్తుగా గత పది ఏళ్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోతే ఖచ్చితంగా పోటీ చేసే ఆచారానికి బిఆర్ఎస్ ప్రభుత్వమే పునాది వేసింది అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చురకలు అంటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 64 మంది ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థిని కంటోన్మెంట్ నియోజకవర్గంలో గెలుపొందించి ఆ సంఖ్యను పెంచుకోవాలని ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆకస్మాత్తుగా చనిపోతే ఆరు నెలల్లో గనక చనిపోతే కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిందే... కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం ఆకస్మికంగా మరణించడం కనీసం మూడు నెలలు కూడా నిండకపోవడంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుందా లేదా అనే విషయంపై తెలంగాణ రాష్ట్రంలో వాడి వేడి చేర్చ రగులుకుంటూనే ఉంది. ఒకవేళ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వస్తే కాంగ్రెస్ పార్టీ ఎవరిని నియమించాలి అనే సందిగ్ధంలో కసరత్తులు మొదలు పెడుతుంది.
గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2007లో ఈ జనార్దన్ రెడ్డి అకస్మాత్తుగా మృతి చెందడంతో త్యాగాలకు సిద్ధపడని నాటి టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలు నిర్వహించింది. అలాగే 2017లో నారాయణఖేడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే పటోళ్ల కృష్ణారెడ్డి ఆకస్మికంగా మృత్యువాత పడడంతో అప్పుడు త్యాగానికి సిద్ధపడకుండా టిఆర్ఎస్ పార్టీ మళ్లీ ఉప ఎన్నికలు నిర్వహించింది. అలాగే 2016లో పాలేరు నియోజకవర్గంలో పాలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి మృతి చెందడంతో అక్కడ కూడా ఉప ఎన్నిక నిర్వహించింది కేసీఆర్ ప్రభుత్వం. సాధారణంగా పార్టీలకతీతంగా ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోతే ఆకస్మికంగా మృతి చెందితే రాజకీయ పార్టీలు ఆ కుటుంబం నుంచి వారసులకు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుంది. కాని టిఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి ఆచారానికి పులిస్టాప్ పెట్టేసింది. త్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించామని చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోతే కనీసం కనికరం లేకుండా మొండివైఖరి ప్రదర్శించి తెలంగాణ చరిత్రకు తలవొంపులు తెచ్చి పెట్టింది అని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వం విభిన్న పథకాలను రచిస్తోంది..
ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మృతి ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు తెరతీస్తుండడంతో ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతుందా లేదంటే ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తాను నిరూపించుకోవాల్సి ఉంటుందా అనే ఆలోచనలకు పునాది వేస్తుందో లేదో అది కేసీఆర్ ఆలోచించుకోవాలి... ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్న సంకేతాలు వినిపిస్తుండడంతో పార్లమెంటు ఎన్నికలతో పాటు కంటోన్మెంట్లో ఉప ఎన్నిక కూడా రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటికిప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఆకస్మిక మృతి చెంది ఉప ఎన్నిక పెట్టాలని ఆలోచన స్పీకర్ నుంచి రాష్ట్ర సీఈవోకు ఇంతవరకు అందకపోవడం, అక్కడి నుంచి కేంద్ర కార్యాలయానికి తెలంగాణలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీటు ఖాళీ ఉందంటూ అధికారికంగా తెలుపకపోవడం, కొంత ఆలస్యం జరుగుతుండడం ఒకవైపు ఉంటే, రాష్ట్ర శాసనసభ స్పీకర్ అధికారికంగా కంటోన్మెంట్ సీటు ఖాళీ ఉందంటూ తెలియజేస్తూ కేంద్ర కార్యాలయానికి పంపే కార్యక్రమంలో త్వరితగతిన పనులు పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలా కేంద్ర కార్యాలయానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే కనుక వెంటనే ఉపఎన్నికకు కేంద్ర కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది.
మొత్తానికి త్యాగాల పేరుతో తెలంగాణ రాష్ట్రానికి మేమే ప్రాణాలర్పించి అడ్డుపడి తెలంగాణ సాధించుకుందాం అని చెప్పిన టిఆర్ఎస్ పార్టీ గత పది ఏళ్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోతే కనీసం కనికరం చూడకుండా ఏకగ్రీవానికి ఆనాడు ప్రత్యర్థి స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కోరిన వినకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించిన ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికల నిర్వహించి తన పంతాన్ని నెగ్గించుకున్న టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు చరిత్ర పునరావృతం అవుతుంది అనే చారిత్రక సత్యానికి టిఆర్ఎస్ పార్టీ బలి కాక తప్పడం లేదు.
ఏది ఏమైనా తాను తీసుకున్న సమాధిలోనే టీఆర్ఎస్ పార్టీ తానే పడుతుండడం సర్వత్ర ఈ పాపం టిఆర్ఎస్దే అంటూ ప్రజలు గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకగ్రీవం చేయాలని కోరుకుంటుందా!? మొండిగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్నికలకు సిద్ధమవుతుందా వేచి చూడాల్సిందే....
... కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
Post Comment