Telangana I రాజకీయంలో ఇవన్నీ మామూలే..

ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జంపు జిలాని కాడ!? వేముల వీరేశం జంపు జిలాన!? అధికారం ఏ పార్టీకి దక్కితే ఆ జెండా ఆ కండువా.. ఆ జెండా కప్పుకొని పబ్బం గడుపుకోవాలే.. ఇప్పుడు ఇదే వరుస తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నడుస్తున్న తీరు..

Telangana I రాజకీయంలో ఇవన్నీ మామూలే..

జయభేరి, నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలలో నకిరేకల్ నియోజకవర్గం ఒకటి... 2007వ సంవత్సరంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నియోజకవర్గ ఏర్పాటయింది.. ఈ నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా ఉండేది... ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ తరఫున ఇక్కడి నుంచి ఎంతోమంది పోరాడిన చరిత్ర ఈ నియోజకవర్గానికి పేరును తెచ్చి పెట్టింది.. సుమారు 30 సంవత్సరాల కాలం కమ్యూనిష్టు పార్టీ తరపున నర్రా రాఘవరెడ్డి శాసనసభ ప్రతినిధిగా ఎన్నికయ్యాడు. ఇది చరిత్ర ..  ఇప్పుడు ఇదంతా గతం... మరి వర్తమానం సంగతి ఏంటి!?

నకరికల్ నియోజకవర్గం లో రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉన్నాయి.. 2014 నుంచి నకిరేకల్ రాజకీయ భవితవ్యంఎంటి!? అనే విషయాలను పరిశీలిస్తే... 2014 సంవత్సరంలో టిఆర్ఎస్ పార్టీ మెజారిటీతో గెలిచింది. అందులో భాగంగా నకిరేకల్ నియోజకవర్గంలో నుంచి  ఉద్యమంలో పనిచేసి పిడి ఆక్ట్ ద్వార జైలు పాలైన చెరుకు సుధాకర్ ను కాదని 2014లో వేముల వీరేశం ఎమ్మెల్యేగా నిలబడి గెలిచి తొలి తెలంగాణ ఎమ్మెల్యేగా చరిత్రపుటల్లో నిలిచారు ఎమ్మెల్యే వేముల వీరేశం.

Read More ఆర్థికసాయం అందజేత..

నకిరేకల్ నియోజకవర్గంలో తనదైన మార్కును చూపిస్తూ అభివృద్ధి సంక్షేమానికి పెద్ద పీట వేసిన అక్కడక్కడ కొన్ని మైనస్లు లేకపోలేదు... దానికి తోడు ఎమ్మెల్యే వేముల వీరేశం కంటే ఆయన సతీమణి వేముల పుష్ప ఎక్కువగా పెత్తనం చెలాయిస్తుందన్న ఆరోపణలు ఆనాడు ఎదుర్కొన్నారు... కట్ చేస్తే దాని ఫలితంగానే 2018లో నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో పరాజయం పొందాడు ఎమ్మెల్యే వేముల వీరేశం... కాలక్రమంలో అభివృద్ధి సంక్షేమం కుంటు పడుతోంది అనీ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజల అభిష్టం మేరకే టిఆర్ఎస్ లో కలుస్తున్నానని గులాబీ కండువా కప్పుకున్నాడు.. ఇక్కడే అసలైన కథ మొదలైంది..
2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన చిరుమర్తి లింగయ్య టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఒక్క వరలో రెండు కత్తులు దూరడం అసాధ్యం కదా... అంటే ఒకే టిఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇద్దరు అధికార పార్టీ కార్యకర్తలే కావడం అందులో నువ్వా!? నేనా!? అన్నట్టుగా ప్రతి కార్యక్రమంలో కలహాలకు కాలు దువ్వడం!

Read More వర్గల్ క్షేత్రాన్ని... తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి గా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం

నకరేకల్ నియోజకవర్గంలో ప్రతి అభివృద్ధి సంక్షేమం నావల్లనే అంటే కాదు కాదు నేనే అభివృద్ది సంక్షేమం చేసింది అంటూ ఎడాపెడా మాటలు తూటాల్లా పేల్చారు ఇద్దరు... మొత్తానికి టిఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి తీర్థం తీసుకున్నారు...

Read More అంబరాని అంటిన బతుకమ్మ సంబరాలు

అది ఎందుకోసమో అందరికి తెలుసు... ఇదిలా ఉంటే 
2018లో ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నకరేకల్ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నానని ముఖ్యమంత్రి సలహాల మేరకే ఉమ్మడి నల్లగొండ జిల్లా జగదీశ్ రెడ్డి ఆదేశాల మేరకే పని చేస్తున్నానని విధేయుడుగా ఉంటున్నానని మళ్లీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి టికెట్ తానే దక్కించుకున్నాడు... ఇప్పుడు ఇదే విషయం మింగుడు పడని వేముల వీరేశం ఎలాగైనా ఎమ్మెల్యే కావాలనే (ఆశతో) గతంలో ఎమ్మెల్యేగా చేశాడు కదా మరి ఆ దాహం తీరలేదేమో కనుకనే ఎమ్మెల్యే కావాలనే ఒకే ఒక్క ఏకైక ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీపై కన్ను పడింది... అంతే నాడు 2014లో చెరుకు సుధాకర్ ను కాదనీ  ఎమ్మెల్యేగా గులాబీ పార్టీలో టికెట్ తెచ్చుకున్న వేముల వీరేశం కాల గమనంలో నేడు నకరే కల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నే నమ్ముకుని పని చేస్తున్న  మరికొంతమంది ఎమ్మెల్యే ఆశవాదులను కాదని ఏకంగా గుంట కండ్ల జగదీష్ రెడ్డికే ఆపోజిట్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంకన చేరిపోయాడు వేముల వీరేశం... ఏకంగా మంత్రి జగదీశ్ రెడ్డి కే సవాలు విసిరినట్టు కాంగ్రెసులో చేరిపోయి టికెట్ తగ్గించుకున్నాడు. ఇంకేముంది ఒకనాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వేముల వీరేశంపై విరుసుకుపడిన మాటలు ఇప్పుడు వేముల వీరేశం కి వరాలుగా మారిపోయాయి.. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కస్సుబుసన్న ఆ కోపమంతా ఎక్కడ పోయిందో ఏమో తెలియదు.

Read More ఫ్లాష్ ప్లాష్ ఫ్లాష్ ప్లాష్... ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు

కానీ వేముల వీరేశమును గెలిపిస్తే నేను సంతోషిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు దేనికి సంకేతం!?

Read More మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలం

అన్న సందేహాలు నకిరేకల్ నియోజకవర్గంలో సర్వత్రా వినిపిస్తున్నాయి.. ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ల పంపకాల విషయంలో నకిరేకల్లో స్థానికులను కాదని చెప్పి వేముల వీరేశంకి కాంగ్రెస్ టికెట్ దక్కనే దక్కింది...  నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే బరిలో వేముల వీరేశం ఇప్పుడు తనదైన మాటలతో తనదైన పలుకుబడితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకే అంటూ ఆయన పంచన చేరి ఎమ్మెల్యేగా ఎలాగైనా రెండవసారి గెలుపొందాలని తహతహలాడుతున్నాడు..

Read More సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం...

ఎలాగో అలాగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్లు తగ్గించుకున్నాడు.. అది ఆయన అభిమానులకు ఆయన కార్యకర్తలకు సంతోషం... కాంగ్రెసులో గెలిస్తే వేముల వీరేశం సొంత గూటికి వెళతాడా!? జంప్ జిలాని!?గా మారుతాడా అన్న సందేహాలు నియోజకవర్గంలో సాధారణ ప్రజల్లో ఎవ్వరిని అడిగిన స్పష్టంగా వినిపిస్తున్నాయి.. ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిస్తే వేముల వీరేశం మారని గ్యారంటీ ఏంటని అక్కడి స్థానికులు అడుగుతున్నారు...!?

Read More మీరే దిక్కు సారు... భూ నిర్వహితులు

2023లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విజయ డంక మోగించి మూడు రంగుల జెండాను రెపరెపలాడించి శ్రీమతి సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చిన కారణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆమె చేతిలో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ విభిన్న రీతిలో రాజకీయ పావులను కలుపుతూనే ఉంది...అందులో భాగంగా  నకరేకల్ నియోజకవర్గంలో మంచి పేరు మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్న వేముల వీరేశంపై నజర్ పడిందో ఏమో తెలియదు గానీ మొత్తానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నకిరేకల్ నియోజకవర్గం నుంచి వేముల వీరేశం పేరును ఖరారు చేసింది... ఇక్కడే అసలైన కదా మలుపు తిరగనుందా అంటే.... 
ఏమో చెప్పలేo.. ఏమ్మో గుర్రం ఎగరవచ్చు!? అన్న చందంగా మారవచ్చు కదా... ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిస్తే జంపు జిలానిగా మారడు అని గ్యారంటీ ఏముంది!? ఎందుకంటే గతంలో కమ్యూనిస్టుగా జీవితాన్ని కొనసాగించిన వేముల వీరేశం గులాబీ పార్టీ నుంచి తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం మళ్లీ సొంత గూటికి వెళ్ళడు అన్న డౌటును ఎవరు తీరుస్తారు...!? జంపు జిలానీలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మారిపోయారనే ఆరోపణలు ఎలాగు తెలంగాణ రాష్ట్రంలో వినపడుతున్నాయి కదా...  కెసిఆర్ యే మా గురువు మా తండ్రి, ఆయన బతికి ఉన్నంతవరకు మేము ఆయన శిష్యులం అని చెప్పుకొచ్చిన వేముల వీరేశం ఇప్పుడు ఈ తెలంగాణా పోరులో తన తండ్రి లాంటి కేసిఆర్ రాజకీయ జీవితంపైనే కదం తొక్కుతాడా గొంతెంతి ఎదిరించి మాట్లాడుతాడా!?

Read More వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్  ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

అంటే ఇప్పుడు కాంగ్రెస్ జపాన్ని తపిస్తున్న వేముల వీరేశం గెలిచిన తరువాత గులాబీ పార్టీలోనికి జంపు జిలానిగా వెళ్లడం ఖాయమని స్థానికులు గంటపదంగా చెబుతున్నారు... కాలజ్ఞానంలో ఇది ఇలాగే జరిగితే కాంగ్రెస్ పార్టీకి కష్టాలు తప్పవు సుమీ....
ఏదేమైనా నకరేకల్ నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా కనుమరుగయింది దానికి నేనే కారణం అని చెప్పుకున్నా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికే ఇప్పుడు ఎదురుగా నిలబడబోతున్న వేముల వీరేశం ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన భవితవ్యం ఏంటో ప్రజలే నిర్ణయించుకోవాలి... ఎందుకంటే గతంలో ఇదే కాంగ్రెస్ నుంచి ప్రజలు గెలిపించిన చిరుమర్తి లింగయ్య గులాబీ కండువా కప్పుకున్న సంగతి మరిచిపోలేదు ... మరి గులాబీ పార్టీలో పదవి అనుభవించి అక్కడ టికెట్ దక్కకపోతే కాంగ్రెస్ నుంచి మళ్లీ టికెట్ను సంపాదించుకున్న వేముల వీరేశం. ఒకవేళ గెలిస్తే తిరిగి గులాబీ కండువా కప్పుకోడని గ్యారెంటీ ఏంటి అని నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు గుసగుసలు పెట్టుకుంటున్నారు... ఎందుకంటే ఇదే మాట పబ్లిక్ గా అంటే వేముల వీరేశం ఊరుకోడు కదా అనే భయం వాళ్ళలో వణుకు పుట్టిస్తోందట....

Read More వ్యవసాయ సహకార సంఘం 43 వ సాధారణ సమావేశం


...కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్

Read More ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి....