ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మడకం రామకృష్ణ మరణించాడు.

ఇసుక లారీ ఢీ కొట్టి మరణించిన మడకం రామకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి.

స్థానిక అధికారులు ఇసుక లారీల అతివేగాన్ని నివారించాలి.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మడకం రామకృష్ణ మరణించాడు.

జయభేరి, చర్ల, జూన్ 14 : చర్ల మండల కేంద్రంలోని బీఎస్పీ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సామాల ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పార్టీ మండల అధ్యక్షులు కొండా చరణ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా తేగడ గ్రామానికి చెందిన విద్యావంతులు కొప్పుల రాజా బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. ముందుగా కొండా చరణ్ పార్టీ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు.

బహుజన సమాజ్ పార్టీలోకి కొప్పుల రాజా రావడం బహుజన చైతన్యానికి నిదర్శనం అని ఇది ఎంతో శుభ పరిణామం అని అన్నారు. ఆయనకు ఆయన కుటుంబానికి పార్టీ నిరంతరం అండగా ఉంటుందని తెలిపారు. చర్ల మండలం లో సుబ్బంపేట గ్రామంలో ఇసుక లారీ ఢీకొని మడకం రామకృష్ణ అనే వ్యక్తి మరణించారని ఇది ఎంతో బాధాకరమని రామకృష్ణ కుటుంబానికి బహుజన్ సమాజ్ పార్టీ ప్రగాఢ సానుభూతి తెలుపుతుందని అన్నారు. మడకం రామకృష్ణ మరణం కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని ఆరోపించారు. ఇసుక లారీల అతివేగాన్ని నియంత్రించకపోవడం కచ్చితంగా ప్రభుత్వం తప్పేనని కాబట్టి మడకం రామకృష్ణ మరణానికి నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Read More Telangana I పరీక్షకే..పరీక్ష...

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాన రహదారిపై లారీల నిలుపుదలను నివారించాలని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి చెన్న0 మోహన్ పార్టీ మండల ఈసీ మెంబర్ గుర్రాల విజయ్ కుమార్ పార్టీ నాయకులు కొప్పుల రాంబాబు, ఎస్ కే జహీరుద్దీన్ భాషా తదితరులు పాల్గొన్నారు.

Read More Love : అమ్మను ప్రేమించలేనోడికి  అమ్మాయి కావాల్సొచ్చిందిరా?

Views: 0