Telangana I తుంగతుర్తి గడ్డపై ఎగరబోయే జెండా..!?

అవినీత!? సంక్షేమమా!?

Telangana I తుంగతుర్తి గడ్డపై  ఎగరబోయే జెండా..!?

జయభేరి, హైద‌రాబాద్ :

నియోజకవర్గ జరిగిన తరువాత విద్య వైద్యం అభివృద్ధి సంక్షేమం సమపాలుగా అందుతాయి అనుకున్న తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు అవి నీటి మూటలుగానే గాలి మాటలు గానే మిగిలిపోయాయి.. ఇందుకు నిదర్శనం 2014 నుంచి ఇప్పటివరకు అంటే 2023 వరకు ఎమ్మెల్యేగా నిలబడి ప్రజల మద్దతును కూడగట్టుకున్న గాదరి కిషోర్ కుమార్ ఆయన పనితీరును ఆయన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు ఏ తీరుగా అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా జయభేరి అక్షర యజ్ఞాన్ని కొనసాగించింది.. ఒక్కొక్క అక్షరం సాక్షిగా ఇది నిజం అని చెప్పడానికి కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ కలం నుండి అక్షర యజ్ఞానికి ప్రాణం పోసుకుంది...

Read More గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి 

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత నియోజకవర్గాలుగా విభజింపబడిన తిమ్మట తుంగతుర్తి నియోజకవర్గం కొత్త పుంతలు తొక్కింది.... తుంగతుర్తి నియోజకవర్గ 2014 18లో రెండుసార్లు ఎమ్మెల్యేగా చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా మొత్తం మీద గెలుపు పిలుపును అందుకున్నాడు గాదరి కిషోర్.. ఒకప్పుడు గాదరి కిషోర్ ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉండే వాడు మనకు ఒక్కసారి ఆయన చేసిన అభివృద్ధి ఆయనపై వస్తున్న ఆరోపణలు ఒక్కసారి విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం..

Read More ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన  పద్మశాలి కులస్తులు

గతంలో 2014లో తనకున్న ఆస్తి కోటి 82 లక్షల 328 వేల రూపాయలు... ఇక 2020 రెండు తర్వాత 735 కోట్లు వారి బినామీ పేర్లపైనే అక్షరం సాక్షిగా ఉందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.. ఇక తాను వెనకేసుకున్నది అదేనండి దోచుకున్న సొమ్ము అక్షరాల 735 కోట్లు ఈ విషయం ఆయా సోషల్ మీడియాలో బహిరంగంగా వినిపిస్తున్న బహిరంగ రహస్యం... తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఉద్యమం కొనసాగించిన గాదరి కిషోర్ ఆనాటి ఉద్యమ భావాలను మరిచిపోయాడు ఏమో తెలియదు కానీ ఎమ్మెల్యే పదవి అంటే అదొక రాచరికం అని అనుకున్నాడు ఏమో తెలియదు గానీ తన అనుచరులకే అంటే తన అనుయాయులకే సంక్షేమ పథకాలను ఎడపెడ గుప్పించాడు... సంక్షేమ పథకాలలో దళిత బంధు పథకంలో ఎమ్మెల్యే చేతివాటాన్ని బలంగా చూపించుకున్నాడని ఆరోపణలు దళిత బంధురాని అభ్యర్థుల నోళ్లలో నుంచి శాపనార్ధాలుగా బయటికి వస్తున్నాయి.. అయ్యా ఎమ్మెల్యే మాకు ఈ సమస్య ఉంది అని చెబుదామని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కి తిరుమలగిరి కి వెళితే అక్కడ ఆయన బంటు గవర్నమెంట్ కు సంబంధం లేకుండా ఆయన వ్యక్తిగతంగా పెట్టుకున్నా ఒక గుంట నక్క అన్ని పనులు చెకచక తానే బాస్ ల వ్యవహరిస్తూ అన్ని పనులు తానే చేసేసేలా పధక రచన్ని చేసుకుంటారు...

Read More ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు

ఇంకేముంది ఎమ్మెల్యేతో పని అసలు ఉండదు కేవలం ఆయన కింద ఆయన చెప్పులు మోసే వాళ్లకే ఎక్కువ గిరాకీ ఉంటుంది... ఎక్కువ మాట్లాడితే బెదిరింపులు ఇంకాస్త ముందుకు వెళితే భూకబ్జాలు... అదేనండి మద్దిరాల గ్రామంలో 23 ఎకరాల భూమి కబ్జా అయినట్టు గట్టిగా ఆరోపణలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఇక మోత్కూరులో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఘనత ఎమ్మెల్యే గారికి దక్కుతుంది.. ఇక అరవపల్లిలో బినామీలకు తన భూమిని అప్పనంగా కట్టబెట్టిన ఈ ప్రజా పరిపాలకుడు దాదాపు ఎన్నో కేసులు నమోదైన అన్ని కేసుల నుండి తప్పించుకునే ప్రయత్నం బాగానే చేశాడు.... అంటే లోకల్ సీఐ రావాలన్నా లోకల్ ఎస్ఐ ట్రాన్స్ఫర్ కావాలన్నా ఎమ్మెల్యే గారి సంతకం అవసరమే... అంటే లా అండ్ ఆర్డర్ ని కూడా తన అదుపులో పెట్టుకున్న సదరు ఎమ్మెల్యే గారు ఇసుక మాఫియా లో భాగమే కాసులు దండుకున్నట్టుగా ఆరోపణలు గుప్పున వినిపిస్తున్నాయి..

Read More తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు

ఇక ప్రతిపక్ష పార్టీ పేరుకే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విధంగా అక్కడ ఎంత పోరాటం చేస్తున్న ఫలితం మాత్రం శూన్యంగానే కనిపిస్తోంది... నిజానికి తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న మండలాలు అన్నిటిలోనూ రోడ్ల సమస్య ప్రధానంగా ఉంటే భూకబ్జాలు సంక్షేమ పథకాలలో చేతివాటం ఎమ్మెల్యే హస్తగతమైన బినామీ భూముల గురించే ఆ నోట ఈ నోట చర్చాంష నియమవుతుంది.. ఇక కాంగ్రెస్ ఈ పార్టీలో నాయకుల కంటే ఎమ్మెల్యే అభ్యర్థులే ఎక్కువగా ఉంటారు...

Read More మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

గత రెండుసార్లుగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ నుంచి విజయం అందుకో లేకపోయినా దయాకర్ ఎన్నోసార్లు ఎమ్మెల్యే అందించిన కాసులకు కక్కుర్తి పడ్డారని విమర్శలకు తావిస్తోంది... అదేం లేదు నికార్సైన కాంగ్రెస్ వాదిని అంటూ ప్రతి మీడియాలో కాంగ్రెస్ పార్టీ నా తల్లి అని చెప్పుకుంటూ కాలం గడుపుకుంటున్న 2023 ఎలక్షన్లో మళ్ళీ తనకే టికెట్ ఇవ్వాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. బాగానే ఉంది మరి పిడమర్తి రవి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన వ్యక్తి అయినా ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గం లో ఆయనకు టికెట్ రావడానికి తను కూడా ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తున్నారు... ఇక డాక్టర్ రవి ఇదే వరుసలో జ్ఞానసుందర్రావు మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి జోరుగా కొనసాగిస్తుంది.. ఇక అవినీతి అక్రమాలు భూకబ్జాలు వీటిపై తుంగతుర్తి నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని ప్రజలు ఎమ్మెల్యే పై దుమ్మెత్తి పోస్తున్నారు... రెండుసార్లు ప్రజలు అధికారం ఇచ్చిన తరువాత తన పద్ధతిని పూర్తిగా అహంకారపూరిత ధోరణితో ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్నారని ఈసారి బుద్ధి తెచ్చుకోవడానికి కచ్చితంగా ఎమ్మెల్యేను ఓడించి తీరుతామని గంటపదంగా చెబుతున్నారు కొన్ని మండలాల్లోని ప్రజలు... అదేం లేదు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయి అని నమ్మకాన్ని పెట్టుకున్న గాదరి కిషోర్ కు విజయం అందక మానదు...

Read More ఖేల్ ఖుద్ పోగ్రామ్ (అటాలపోటీ) ఏకల్ అభియాన్ ద్వారా భోవనేశ్వ (ఒడిస్సా)కి బయలుదేరిన క్రీడాకారులు

ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం ఎంత మెరుగ్గా ఉన్నా అంతే విధంగా భూకబ్జాలు అవినీతి కేసులు సంక్షేమ పథకాలలో చేతివాటం ప్రశ్నించిన వారిని బెదిరించడం అవసరమైతే తన అనుచరులతో కొట్టడం ఇవి ఎమ్మెల్యేకి ఓటమికి కారణాలుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి..
నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రపంచంలో ఎక్కడ ఎవ్వరు సాహసోపేతంగా ఇచ్చినవి కావు... కేవలం రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఉద్దేశంతోటే సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు... మరి అలాంటి సంక్షేమ పథకాలన్నీ ప్రతి నియోజకవర్గంలో సక్రమంగా జరుగుతున్నాయి అంటే అది అనుమానమే...అలాగే తుంగతుర్తి నియోజకవర్గంలో ఎంతోమంది ఎమ్మెల్యే గారి బాధితులు ఆవేదన వెలగకుతూ సోషల్ మీడియాలో పూర్తిగా తమ వైఖరిని తమ విధానాన్ని నిజాయితీగా నిక్కచ్చిగా వెలగకుతున్నారు...

Read More నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి 

ఇంకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావడానికి విశ్వప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో విజయం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా విజయం సాధించాలనే ఉద్దేశంతో ఎన్నో రోడ్షోలు బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తున్న ఈ నేపథ్యంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఇంతవరకు ఎమ్మెల్యే టికెట్ ఎవరికో స్పష్టం కాలేదు... దాంతో కాంగ్రెస్ నాయకులు టికెట్ మాకే అంటే కాదు కాదు కాదు అది నాకే అంటూ ఒకరిపై ఒకరు బలమైన నమ్మకాన్ని పెట్టుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు ఒక అడుగు ముందుకేస్తూ అసలు గాదరి కిషోర్ స్థానికుడే కాదు ఈ స్థానికేతరుడికి ఎలా  ఓటేస్తారు అంటూ ప్రజలను ఓటును నాకే వేయండి అని చెప్పడానికి ఈ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు...

Read More కురుమల పోరాటానికి ఎమ్మార్పీఎస్ మద్దతు కావాలి...

తుంగతుర్తి నియోజకవర్గంలో స్థానికులుగా కాంగ్రెస్ నేతలు లేరా !?అదే అధికార ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు కరువయ్యారా!? నిజానికి ఈసారి గాదరి కిషోర్ కి టికెట్ రాదనుకున్న మళ్లీ స్థానిక ఎమ్మెల్యేలకే టికెట్ను కేసీఆర్ ప్రకటించడం వీరి అహానికి అడ్డు లేకుండా పోయింది... అందుకనే కాబోలు మాట మాట్లాడితే సంక్షేమ పథకాలు ఇచ్చిన అభివృద్ధి చేశాం మళ్లీ నన్ను ఎమ్మెల్యేగా చేయండి మీకు అన్ని విధాలా తోడుంటా అని నమ్మబలికే మాటలు మాట్లాడుతున్న ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కు మరి తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు అధికారం అందిస్తారు లేదంటే కర్రు కాల్చి వాత పెడతారో వేచి చూడాల్సిందే. తుంగతుర్తి నియోజకవర్గం అసలే కమ్యూనిస్టు ఉద్యమ భావాలతో నిండిపోయిన ప్రాంతం కాబట్టి ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే విధానంలో చైతన్యవంతులుగా ఉంటారు... మరి ఆ చైతన్యాన్ని చూపిస్తున్న అక్కడ జర్నలిస్టులు కచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా వార్తలు రాయగలుగుతున్నారా అంటే ఎమ్మెల్యే గారి నీడలో బతుకుతున్నారు కదా ఏం రాస్తాం అనుకోని రాయట్లేదేమో అని సాధారణ ప్రజల్ని మీడియా పేరు చెబితే ఏ వాళ్ళు ఏం పని చేయరు!?
 ఏం చెప్పిన రాయరు !? అనే విధంగా ప్రజల నుండి సమాధానాలు వస్తున్నాయి... ఎంతైనా స్థానిక ఎమ్మెల్యే అంటే ఆ మాత్రం భయం ఉండాల్సిందే.... ఎమ్మెల్యే పదవి అంటే అది ఒక దేశానికి రాజు అనుకుంటున్నాడేమో కానీ ఐదు సంవత్సరాలకు ఒకసారి కచ్చితంగా ప్రజల మద్దతును కూడగట్టుకోవాల్సిందేనని భారత రాజ్యాంగ నిర్మాత ప్రతి పౌరుడికి ఓటు హక్కును అందించింది రాజ్యాంగం సాక్షిగా శాసనసభ్యుడుగా ఎన్నుకోవడానికి ప్రజలకే అధికారం కట్టబెట్టింది...

Read More నర్సారెడ్డి ఉన్నన్ని రోజులు గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బాగుపడదు..!

ఎమ్మెల్యే అంటే 24 గంటలు ప్రజల కోసమే పని చేయాలి ప్రజల కోసమే తన పదవిని ఉపయోగించాలి కానీ తుంగతుర్తి నియోజకవర్గంలో దానికి భిన్నంగా ఎన్నో కరెన్సీ కట్టలను కూడగట్టుకుని ఈసారి ఎలక్షన్లో భారీగా నిధులను ఖర్చు చేసే పనిలో ఉన్నారని విషయాన్ని ప్రతిపక్ష పార్టీ నాయకులను గిల్లితే అర్ధరాత్రి లోనైనా సరే ఎమ్మెల్యే చరిత్రను పూటలు పుటలుగా విప్పి మరీ చెబుతారు. అలా చెప్పేవాళ్లే ఓట్లు వేస్తారు అనుకోండి.. అది వేరే విషయం. ఇంతకీ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు మీరే ఆలోచించుకోండి సరైన నాయకున్ని మీరే ఎంచుకోండి ఇది మన నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం విద్య వైద్యం ఉపాధి అవకాశాలు ఏ ప్రభుత్వమైతే ఇస్తుందో అదే ప్రభుత్వానికి ఓటు వేసి మన మద్దతును తెలుపుతూ మన భావితరానికి బంగరు బాటను వేసుకోవాలి... అంతేకానీ ఓ అధికారి ఓ ఎమ్మెల్యేకు ఓ పోలీసోడికో భయపడి ఓటును దుర్వినియోగం చేసుకోవద్దు.... ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి ఓటు అయినా చెత్త ఏరుకునే ఒక సామాన్య పౌరుడి ఓటు అయిన ఒకే విలువను కలిగి ఉంటాయి... అందుకే ఓటును సద్వినియోగం చేసుకోవాలి ప్రజల కోసం పని చేసే నాయకున్ని ఎంచుకోవాలి... నిజానికి తుంగతుర్తి నియోజకవర్గ సంక్షేమం అభివృద్ధి విషయంలో కొంతమేర అభివృద్ధి జరిగినా సంక్షేమం వెనుక ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి....

Read More హరీష్ రావు పై అక్రమ కేసులు తగవు

... కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్