BJP_Bandi Vs Ponnam I విజయ సంకల్ప యాత్ర ..? అసలు ఉద్దేశం ఏంటి!?
హుస్నాబాద్ లో బండి సంజయ్ పర్యటన రాజకీయ దుమారాన్ని లేపుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్లపై బిజెపి శ్రేణులు ఒకింత దుమారానికి తెర తీస్తున్నారు.
జయభేరి, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా బిజెపి గెలిచి మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని చూడాలి అంటూ బిజెపి సంకల్పించిన యాత్ర విజయసంకల్ప యాత్ర. ఈ యాత్రలో భాగంగా తెలంగాణలో అన్ని సెగ్మెంట్లలో బిజెపి శ్రేణులు భారీ ఎత్తున విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇదంతా బాగానే ఉంది కానీ హుస్నాబాద్ లో బండి సంజయ్ చేస్తున్న విజయ సంకల్ప యాత్రకు బ్రేక్ పడేలా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా దుమారాన్ని లేపుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేసిన వాఖ్యలు ఒకసారి పరిశీలిస్తే బండి సంజయ్ హుస్నాబాదులో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో ఒకసారి ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడగాలి అంతేకాదు భారత్ మాత, జైశ్రీరామ్ అంటూ ఎన్నికల్లో ఈ పదాలు వాడకూడదు అన్న మాటలు వల్లించడం కాదు మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపించమని అన్న వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు రాముడి పైనే కామెంట్ చేస్తావా అంటూ వాగ్వివాదానికి దిగుతూ రాజకీయ దుమారాన్ని లేపుతున్నారు...
దీనికి బదులుగా బండి సంజయ్ తన నోటికి పదులు పెడుతూ నువ్వు నీ అమ్మకే పుట్టావా అనే వ్యాఖ్యలు వల్లించడం రాజకీయాల్లో కన్నతల్లిని వాడుకోవడం ఇది మంచి పద్ధతి కాదు అంటూ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రెండు విషయాలను గమనిస్తే బిజెపి పార్టీ జైశ్రీరామ్ అంటూ ప్రజాస్వామ్యంలో ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారు అంటూ చేసిన కామెంట్ పై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మంత్రి స్థానంలో ఉండి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ యాత్రను అడ్డుకుంటున్నారని శ్రీరాముడిపై నాన్న మాటలు అన్నారనే రాజకీయ దుష్ప్రచారాన్ని నేర్పుతున్న బీజేపీ ఆయన మాట్లాడిన మాటలను ఎందుకు వక్రీకరిస్తుందో అది ప్రజలే అర్థం చేసుకోవాలి.
బిజెపి పార్లమెంటులో ఎలాగైనా తెలంగాణ నుంచి సీట్లు కొల్లగొట్టాలని విజయసంకల్ప యాత్ర పేరుతో జైశ్రీరామ్ అనే పదాన్ని బిజెపి నానుడిపదంగా వాడుతూ ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతుందా లేదా అనే విషయాన్ని ప్రజలే నిర్ణయించుకోవాలి.. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సంక్షేమ అభివృద్ధి పథకాలపై దృష్టి సారిస్తున్న తరుణంలో బిజెపి కనీసం అభివృద్ధిని కాంక్షించకుండా పార్లమెంటు ఎలక్షన్లో ఎలాగైనా గెలవాలని ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారాన్ని రేపుతూ రాజకీయంగా లబ్ధి పొందాలని దుర్బుద్ధితోనే ఇలాంటి కామెంట్లు చేస్తుందని కాంగ్రెస్ వాదులు మండిపడుతున్న బిజెపి మాత్రం దాన్ని సమర్ధించుకుంటుంది... పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఏం జరగాలి ఎలా జరగాలి? మోడీ ప్రభుత్వంలో ప్రజలకు ఏం సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందాయనే ఆలోచనతో బీజేపీ అడుగు వేయాలి కానీ ప్రజలను ఉద్దేశించి మతపరంగా విద్వేషాలను రెచ్చగొడుతూ పొన్నం ప్రభాకర్ మంత్రి స్థానంలో ఉండి రాముడు ఎక్కడ పుట్టాడు అని ప్రజల్ని అడుగుతూ నీ తల్లికి నువ్వు పుట్టావా అని అడిగితే ఎట్లా ఉంటుంది అని కామెంట్ చేయడం ఆయన విజ్ఞతకే వదిలేయాలి..
భారత పార్లమెంటు ఎన్నికల్లో పార్లమెంటు మెంబర్గా రావడానికి ప్రజలు కాంక్షించి ఓటేస్తే ఎంపీ అభ్యర్థిగా ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి సమాజ సేవకుడిగా ప్రజాసేవకుడిగా పార్లమెంటులో ఆయన నియోజకవర్గానికి ఏం కావాలో తెలుసుకొని ప్రజాభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి ఉండాలి కానీ రాముడు ఎక్కడ పుట్టాడు రాముడు భారతీయుడా రాముని పాలన అంటూ మతవిద్వేషాలను రెచ్చగొట్టడం దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు... ప్రతి తల్లికి పుట్టిన బిడ్డను తల్లి చూడదు నరసమ్మ బాబు పాప అని మనకు పరిచయం చేస్తుంది ఏ తల్లికి పుట్టినవో అని చెబుతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ తరఫున కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్న తరుణంలో ప్రజలు కోరుకునేది ఏంటి? రామ మందిరమా? రాముని పాలన? అయినా పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా విజయసంకల్ప యాత్ర చేస్తున్న మీరు బిజెపి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రజల్లో కులమత విదేశాలను రెచ్చగొట్టడం కాదు హిందూ ముస్లిం భాయి భాయి అని అనుకునే ఆ రోజుల నుంచి నువ్వు కట్టర్ హిందూ నేను క్రిస్టియన్ మీరు ముస్లిం అంటూ ఈ వ్యత్యాసాలను చూపెడుతూ రాముని గుడి కాకపోతే మసీదు మందిరం నిర్మించుకోండి అనే సంకేతాలను ప్రజల్లో అందివ్వడం ఇది భారత శిక్షాస్మృతికి అర్హుడని రుజువు చేయక తప్పదు.
గతంలో పార్లమెంటేరియన్ గా చేసిన అనుభవం బండి సంజయ్ కి ఉంది. గతంలో కేసీఆర్ పై వేసిన పంచులు బాగానే పేలాయి కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వానికి కలిసి వచ్చింది. అయితే పార్లమెంట్ ఎలక్షన్ లో కచ్చితంగా తెలంగాణ నుంచి ఎంపీ సీట్లు రాబట్టుకొని, మళ్లీ ప్రధానమంత్రిని మోడీని చేయాలని ఉద్దేశం పార్టీ పరంగా వాళ్లకు మంచి ఉద్దేశమే అయినా సమాజానికి భారతీయ జనతా పార్టీ ఏ అందిస్తున్నది అనేది ముఖ్యంగా ప్రజలు ఆలోచించుకోవాలి.. ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాలు పెరుగుతుంటే భారత ప్రధానమంత్రి మోడీ సముద్ర గర్భంలోకి వెళ్లి తపస్సు చేయడం అనేక కామెంట్లకు దారితీస్తుంది.. ఒకవైపు భారత దేశంలో ముఖ్యమంత్రిగా బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్యాసం చేసే వాళ్ళు రాజకీయంలోకి ప్రవేశించి ముఖ్యమంత్రిగా చలామణి అవుతూ దేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చడానికి విశేష కృషి చేస్తున్నారు. కానీ ఒకసారి చరిత్రను పునరావృతం చేసుకుంటే కాకతీయులు తన పరిపాలనలో సేవా మతాన్ని స్థాపించిన దాఖలాలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి... అంటే నవీన నాగరికర సమాజంలో శాంతిర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ చంద్రమండలంలో అడుగుపెట్టిన ఈ మనిషి తిరిగి ఆధ్యాత్మిక పోకడలో రాజకీయానికి సమాధి వేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కులమతాలకు అతీతంగా ఉండాలి కానీ రాముని పేరుతో వందేమాతరం జై భారత మాత అనే నినాదాలతో ఈ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తారనేది రాజకీయపరంగా ఒక్కసారి ప్రజలే ఆలోచించాలి. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజల కోసం ప్రజలచేత ప్రజల ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్న నాయకుడు ప్రజలకు సేవ చేయాలే కానీ కులమతాలకు పదును పెడుతూ జైశ్రీరామ్ అంటూ భారతదేశన్ని ప్రపంచ దేశాల్లో ఏ స్థానంలో నిలబెడతారు అనేది వారే నిర్ణయించుకోవాలి...
ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి వర్సెస్ కాంగ్రెస్ రాజకీయ దుమారాన్ని రేపుతున్న ఈ నేపథ్యంలో రాముడి పుట్టుక గురించి రామాలయ నిర్మాణం గురించి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఎంపీలు ఏం సాధించారో ?
ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. రామ మందిరం నిర్మాణం రాముడు ఎక్కడ పుట్టాడు తెలంగాణ ప్రజలకు అనవసరమైనటువంటి విషయం. ప్రజలను రెచ్చగొడుతూ జై హిందు జై భారత్ వందేమాతరం జైశ్రీరామ్ అనే నినాదాలు బిజెపి ఇకనైనా చాలించి ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పదవిలో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పనిచేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి బిజెపి ఎంపీలు ఎన్ని కోట్ల నిధులు సమర్పించారు సంక్షేమ అభివృద్ధికి ఏం చేశారు ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి...
అంతేకానీ నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మత కల్లోలాలను సృష్టించే విధంగా బిజెపి తన చీఫ్ ట్రిక్కులను ఇకనైనా మానుకోవాలి... రాముడు ఎక్కడ పుట్టిన సర్వాంతర యామి రామరాజ్యం కావాలని అందరికీ ఉంటుంది అలా అని రాముని మీరొక్కరే ఆపాదించుకొని మిగతా వారిని శత్రువులుగా చూడడం ప్రజాస్వామ్యంలో క్షమించరాని నేరం... హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్లను బిజెపి సాధనంగా తీసుకోకపోగా తన తల్లిని శ్రీరాముని జన్మస్థానాన్ని ప్రశ్నించాడంటూ రాజకీయ దుమారాన్ని రేపడం బిజెపి చేస్తున్న నీచమైన పనిని చెప్పాలి... ఇప్పటికైనా కాంగ్రెస్ బిజెపి అలాగేటిఆర్ఎస్ ఈ మూడు రాజకీయ పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఏం చేస్తారు గతంలో ఏం చేశారు అనే విషయాలని ప్రజలకు వివరిస్తూ సంక్షేమ అభివృద్ధిని కోరుకునే రాజకీయ పార్టీలుగా ప్రజాస్వామ్య బద్దంగా ఈ దేశానికి ఒక చట్టం ప్రకారంగా నడుస్తున్న రాజకీయాన్ని పెడత్రోవ పట్టకుండా చూసే బాధ్యత భారత ప్రధానిగా నరేంద్ర మోడీకి ఎంతైనా ఉంది.
రాజకీయంలో ఎవరి పుట్టుక ఎలా ఉంటుందో శ్రీరాముడు ఎక్కడ పుట్టాడు ప్రజలకు అవసరం లేదు. అసలు రాజకీయం అంటేనే పూర్తిగా వ్యభిచారం అయిపోయిన ఈ రోజులలో రాజకీయంగా నేను పతివ్రతను అని అంటే ఎవరు ఒప్పుకోరు... బండి సంజయ్ ఎంపీగా చేసిన అనుభవం ఉంది.
కరీంనగర్ సెగ్మెంట్ కి ఎన్ని సంక్షేమ నిధులు తీసుకొచ్చారు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూనే ఇంకోవైపు రాబోయే రోజులలో భారత ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు గెలిపించాలో చెబితే చాలా ఆనందంగా ఉంటుంది... అంతేకానీ రాముడు ఎక్కడ పుట్టాడు రామాలయం మేమే కట్టించాం ఈ రెండు కాకపోతే మందిర్ మసీదులు నిర్మించుకోండి మాకేం ఇబ్బంది లేదు అంటూ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం భారత ఎన్నికల కమిషన్ సునిషితంగా పరిశీలిస్తూనే ఉంది... ఇప్పటికైనా ఆయా రాజకీయ పార్టీలు కుల మతాలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి దిశలో ప్రజలకు సేవ చేసే నిజమైన రాజకీయ నాయకులుగా ప్రజా దర్బారులోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇలాంటి సున్నితమైన మత విద్వేషాలను రెచ్చగొట్టడం కాదు ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని 75 ఏళ్ల ప్రజాస్వామ్యంలో దళితులు దళితులుగానే మారిపోతున్నారు ఉన్నవారు ఉన్నతంగా మారిపోతున్నారు లేనివారు దరిద్రులుగా మారిపోతున్నారు ఇది మన 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశం అని గర్వంగా చెప్పుకోవాలొ లేదంటే సిగ్గుపడాలో ఎవరికి వారే ఆలోచించుకోవాలి...
... కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత