Telangana MP I టార్గెట్ @17
తెలంగాణలో ఉన్న 17 ఎంపీ స్థానాలను మేం అంటే మేం అంటూ ఒకరికొకరు విజయ డంక మ్రోగించబోతున్న తరుణంలో ప్రజల ఎరికి పట్టం కడతారో వారికే అవకాశం దక్కే వీలుంది..
జయభేరి, హైదరాబాద్ :
ముందుగా కాంగ్రెస్ పార్టీ నిన్నటికే ఎంపీ టికెట్ల ఆశావాదుల అప్లికేషన్ ముగిసిపోయింది. ఇప్పుడు వరకు అందిన సమాచారం ప్రకారం 140 పైగా తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆశావాహులు అభ్యర్థనను చేసుకున్నారు. ఆశావాదుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కలిసి వచ్చే విజయం గతంలో విజయాన్ని సాధించి అధికారంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల ఆదరాభిమానాలను ఇదే దశలో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ వాటి లెక్కలను అవినీతి బాగోతాల్ని భూకబ్జాల చిట్టాలను కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటకు తీసే పనిలో శరవేగంగా ఫైల్లు దస్తావేజులన్నీ చెక్ చేస్తున్నరు.పార్లమెంటు ఎన్నికల్లో గత అసెంబ్లీ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పరిపాలన వీటిని అన్నింటిని పరిగణలోకి తీసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ సీట్లు 15 నుండి 18 వరకు వచ్చే అవకాశం ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైనా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ఉచ్చు కథతో విజయ పదంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందిన కాడికి అవకాశాలను అందిపుచ్చుకొని ఎలాగైనా ఈసారి కేంద్రంలో మోడీని గద్దె దించాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్టు అలాగే కాంగ్రెస్కు మరి కలిసి వచ్చే అవకాశం బీఆర్ఎస్ లోని కాంగ్రెస్ వలస వెళ్లిన నేతలను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమాన్ని చురుగ్గా జరిగితే, తెలంగాణలో బీఆర్ఎస్ డ్రామ కంపెనీ పూర్తిగా ఖాళి అయిపోవడం ఖాయం. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ బలం చేకూర్చే సంక్షేమ పథకాల్లో ఆరు గ్యారెంటీ పథకంలో భాగంగా మొట్టమొదటిది ఆర్టీసీ లో మహిళలకు ఉచిత ప్రయాణం అలాగే 500 కే గ్యాస్, ఉచిత కరెంటు, మరికొన్ని పథకాలు బలాన్ని చేకూరుస్తుండగా ప్రజా పాలనలో భాగంగా ప్రజల నుంచి భారీ ఎత్తున అప్లికేషన్స్ తీసుకొని వాటిని ప్రక్షాళన చేసే క్రమంలో చురుగ్గా పని కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ స్థానాల్లో కలిసి వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోంది. అందుకని ఈనెల 5 6 తారీకు వరకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశావాదులు ఎక్కువగానే అభ్యర్థన చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే కొన్ని ఎంపి స్థానాలు భువనగిరి నల్లగొండ ఖమ్మం ఇలాంటి సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా మెజారిటీ కనపరచనుంది. నిన్న జరిగిన ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
ఇక బిఆర్ఎస్ పార్టీ బల బలాలు బలహీనతలు ఒకసారి విశ్లేషణ చేసుకుంటే... గత ఓటమిని జీర్ణించుకోలేక ఇప్పటికే ఎమ్మెల్యే స్థానంలో ఒక దళితులు చేతిలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఓటమిని జీర్ణించుకోలేని తరుణంలో ప్రతిపక్షంలో ఉన్న బి ఆర్ ఎస్ పార్టీ విజయాన్ని దక్కించుకోకపోగా పార్లమెంటు స్థానాలు 9 సిట్టింగ్ స్థానాలను కాపాడుకుంటే చాలు అనే ఆరోపణలు తెలంగాణలో బలంగా వినిపిస్తున్నాయి..అదనంగా సీట్ల కోసం వెంపర్లాడితే ఉన్న సీట్లు పోయే అవకాశం కనిపిస్తున్నందున ఉన్న తొమ్మిది సీట్లను బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి కాపాడుకుంటే మంచిది. ఒకవైపు ఓటమి బాధ మరొకవైపు ఎంపీ సీట్లను ఎలాగైనా దక్కించుకోవాలని దృఢ సంకల్పం వీటితో పాటు గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో అవినీతి అక్రమాలు భూకబ్జాలు కేసులు క్రిమినల్ కేసులు వీటి నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచన బలంగా ఆ నేతలను భయానికి గురిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే డిఆర్ఎస్ పార్టీ మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తుందనేది నగ్న సత్యం. తొమ్మిది స్థానాలను కాపాడుకుంటూ కనీసం ఒక్క స్థానాన్ని అయినా రాబట్టుకోగలుగుతుందా అంటే అది అనుమానమే.. ఎందుకంటే ప్రతిపక్షంలో కూర్చుంది కాబట్టి పూర్తిగా బలహీన పడిపోయింది అనేది వాస్తవం..
ఇక బిజెపి పార్టీ బలాలు బలహీనతలు ఒకసారి నెమరు వేసుకుంటే గత ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లను దక్కించుకున్న ఈ పార్టీ ఇంకా అదనంగా పెద్ద మొత్తంలో ఎంపీ సీట్లను దక్కించుకొని మరొకసారి ప్రధానమంత్రిగా మోడీని నియమించుకోవాలని మోడీకి బహుమతిగా ఎంపీ సీట్లను అందివ్వాలని ఉత్సాహంతో బిజెపి బాగానే పావులు కదుపుతోంది.. అందుకనే రాష్ట్ర వ్యవహారాల బిజెపి ఇన్చార్జి అమిత్ షా ప్రధానమంత్రి మోడీ పర్యటనలు తెలంగాణలో రాబోయే రోజుల్లో విస్తృతంగా జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. బిజెపి గెలుపు లక్ష్యంగా అనేక వ్యూహాలు రచిస్తున్నది. కేంద్రంలో బిజెపి పార్టీ బిల్ అంటే 400 స్థానాలను ఎలాగైనా టార్గెట్ చేసుకొని కేంద్రంలో మళ్లీ అధికారానికి రావాలని చూస్తోంది బిజెపి పార్టీ. అందుకనే తెలంగాణలో పూర్తిగా దృష్టి పెడుతూ అమిత్ షా మోడీ ప్రత్యేక దృష్టి పెట్టి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కనీసం 8 నుంచి 10 స్థానాలు దక్కించుకోవాలని ఇప్పటికే నాలుగు ఎంపీ స్థానాలను కాపాడుకుంటూ మహబూబ్నగర్ మల్కాజ్గిరి ఆయా సెగ్మెంట్లలో బిజెపిని గెలుపు కోసం విపరీతంగా కష్టపడుతున్నారు. అలాగే కొన్ని కొన్ని వినూత్న స్లోగన్లతో ప్రజల దగ్గరికి వెళుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అభివృద్ధిని వివరించే ప్రయత్నంలో రాష్ట్ర బీజేపీ క్యాడర్ చక చక అడుగులు ముందుకు వేస్తోంది. బిజెపి ఎంపీ స్థానాల తటస్థ ఓటర్ల వైఖరి అలాగే ఉంది ఏం మారలేదు.బిజెపి బలం మోదీ ప్రచారం, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, హిందుత్వం, రామజన్మ భూమి, ఆలయ స్థాపన, రాముని కళ్యాణంలో అక్షింతలను ప్రతి ఇంటికి చేరవేయడం, జైశ్రీరామ్ అంటూ స్లోగనలు ఇవ్వడం, గోడలపై రాయడం, వికసిత భారత్, విశ్వకర్మ అనే కొత్త పథకాలతో ఓటర్లకు గాలం వేస్తూ అనేక రోడ్ షోలను నిర్వహించే అవకాశం ఉంది ఇవి బలాలుగా కనిపిస్తున్నాయి.
మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మూడు పార్టీలు బలాలు బలహీనతలు ఈ విధంగా ఉన్నాయి. పార్లమెంటు శాసనసభ ఎన్నికలు పాల్గొనే ఓటర్లు భిన్నమైన తీర్పించే అవకాశం ఉన్న నేపథ్యంలో టిఆర్ఎస్ను ఓడించడానికి కాంగ్రెస్ బిజెపి పార్టీలు కలిసికట్టుగా పనిచేసే అవకాశం లేకపోలేదు. అలా అని బిజెపి కాంగ్రెస్ పార్టీ కలవవు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నాగర్ కర్నూల్ పెద్దపల్లి మహబూబాబాద్, నల్లగొండ ఖమ్మం,ఇలాంటి అనేక తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తెలంగాణ హక్కులను కాపాడుకుందాం అనే శ్లోకంతో వస్తున్న టిఆర్ఎస్ పార్టీ తన అస్తిత్వాన్ని దక్కించుకుంటుందా కోల్పోతుందా అనే అనే సవాళ్ల మధ్య తమ భవితవ్యాన్ని పార్లమెంటు ఎన్నికల్లో తేల్చుకొనుంది.... గెలిచిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ ఓటమి భారంతో టీఆర్ఎస్ పార్టీ రామ మందిరం నిర్మాణం జైశ్రీరామ్ వికసితభారత్ నినాదాలతో బిజెపి తెలంగాణలో ఎలాగైనా 17 స్థానాలు దక్కించుకోవాలని పరుగులు పెడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు...
- కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, కవి, సీనియర్ రాజకీయ విశ్లేషకులు
9848 962 799
Post Comment