యాద‌గిరిగుట్ట‌లో కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ

కాంగ్రెస్ నేత‌లు భూక‌బ్జాల‌కు పాల్ప‌డ్డార‌ని బీజేపీ నేతలు ఆరోప‌ణ‌లు

యాదగిరిగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేసిన‌ ఇరువ‌ర్గాలు

కాంగ్రెస్‌, బీజేపీ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

యాద‌గిరిగుట్ట‌లో కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ

జయభేరీ, యాదగిరిగుట్ట, జనవరి 11: యాద‌గిరిగుట్ట ప‌ట్ట‌ణంలోని కాంగ్రెస్‌,బీజేపీ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్క‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం హైద‌రాబాద్‌కు చెందిన ఓ వ్య‌క్తి ప్లాట్‌ను యాదగిరిగుట్ట ప‌ట్ట‌ణానికి చెందిన కాంగ్రెస్ నేత‌లు క‌బ్జా చేశార‌ని పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన‌ బీజేపీ నేత‌ల‌ను కాంగ్రెస్ నేత‌లు అడ్డుకున్నారు.

దీంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య మాట‌లు పెరిగి ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింద‌ని తెలిపారు. రెండు పార్టీల నేత‌లు పోలీస్‌స్టేష‌న్‌కు భారీగా త‌ర‌లివ‌చ్చార‌ని, వారిని చెద‌ర‌గొట్టిన‌ట్లు తెలిపారు. కాగా ఇరువ‌ర్గాలు ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదు చేశార‌ని తెలిపారు. ఫిర్యాదుల‌పై విచార‌ణ జ‌రిపి కేసు న‌మోదు చేస్తామ‌ని తెలిపారు. యాదగిరిగుట్ట ప‌ట్ట‌ణంలో ఎలాంటి అల్ల‌ర్ల‌కు ఆస్కారం లేద‌ని, అల్ల‌ర్ల‌కు పాల్ప‌డితే తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని హెచ్చ‌రించారు.

Read More Telangana I జంప్ జిలానీల తో ఎల్బీనగర్ తికమక

IMG-20260111-WA1376

Read More SBI | రమేష్ మృతి తీరని లోటు   

Views: 3