నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

ఆధ్యాత్మిక కేంద్రం అయిన యాదాద్రి భువనగిరి జిల్లాలో గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

జయభేరి, భువనగిరి : జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలోనీ జిఎంఆర్ బ్యాంకెట్ హాల్ లో జరిగిన జిల్లా "గోపా" సర్వ సభ్య సమావేశo లో నూతన జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. "గోపా" జిల్లా అధ్యక్షులు దంతూరి కుమార స్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి బాల రాజ్ గౌడ్,  కోశాధికారి నల్లమాస ప్రవీణ్ గౌడ్, ఉపాధ్యక్షులు తిరుమల కృష్ణ గౌడ్, నారగోని కృష్ణయ్య గౌడ్, కాటేపల్లి ఉపేందర్ గౌడ్, చెక్కిళ్ల శ్రవణ్ కుమార్ గౌడ్, ఉయ్యాల బిక్షమయ్య గౌడ్, ఆర్గనైజేషన్ సెక్రటరీలు ఆగయ్య గౌడ్, నల్లమాస కుమార్ గౌడ్, బత్తిని శ్రీధర్ గౌడ్, దూడల వెంకటేష్ గౌడ్, నర్సింగ్ యమునా గౌడ్, ఈసీ మెంబర్స్ యమగాన్ని బుగ్గయ్య గౌడ్, రాయగిరి చంద్రయ్య గౌడ్, అనంతల వెంకన్న గౌడ్, ఎరకల నరేష్ గౌడ్, పాండాల మహేష్ గౌడ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా "గోపా" రాష్ట్ర అధ్యక్షులు బండి సాయన్న గౌడ్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గౌడ్ ఆఫీసియల్స్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆవిర్భవించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ సంబరాలకు సిద్ధం అవుతుంది అన్నారు.  అన్ని రంగాల్లో గౌడ్ కుల వెనకబాటును సభ్యులకి గుర్తు చేసారు. ఈ వెనుకబాటు తనం ను అధిగమించాలి అంటే చదువే పరిష్కారం చూపుతుంది కాబట్టి అందరూ నాణ్యమైన విద్య ను అందుకున్నప్పుడే ఆర్థికంగా సామాజికంగా రాజకీయo గా బలపడుతారని వివరించారు. నూతన జిల్లా అధ్యక్షులు దంతూరి కుమార స్వామి గౌడ్ సభాఅధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో "గోపా"కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెక్కిళ్ళ మధు సుధన్ గౌడ్ మాట్లాడుతూ.. గౌడ్ లు అంతా ఐక్యం కావలసిన సందర్భాన్ని తెలిపారు. మరో ఉపాధ్యక్షులు ముద్దగౌని రామ్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ గౌడ్ ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపగాని ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యా అవకాశాలను అందుకునే మార్గాలను సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ తరఫున గుడేపూరి సాయి వేణు గౌడ్,  మాదు సైదులు గౌడ్,  పొట్లపల్లి అశోక్ గౌడ్, నల్గొండ జిల్లా "గోపా" అధ్యక్షులు దంతూరి సైదులు గౌడ్, నకరికంటి శ్రీనివాస్ గౌడ్, సిద్దగోని పరమేశ్ గౌడ్, యాదాద్రి జిల్లా గౌడ, సంఘం నాయకులు, నల్లమాస మనోజ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Read More Telangana I చెత్త మనుషులు

Views: 13