నారాయణ పాఠశాలలో ఘనంగా అకాడమిక్ ఫెయిర్ కార్యక్రమం
జయభేరి షాద్ నగర్ ఫిబ్రవరి 28 : రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ నారాయణ పాఠశాలలో ఘనంగా అకడమిక్ ఫెయిర్ కార్యక్రమం. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ వివిధ సబ్జెక్టులకు సంబంధించిన మోడల్స్ వారి సొంత నైతికతో ఏర్పాటు చేశారు. గణితం ,సైన్స్ ,సోషల్ స్టడీస్, భాషా విభాగాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సందర్శకులకు తమ ప్రాజెక్టు వివరాలను తెలిపారు. ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటుంది అని అది విద్యార్థి దశలో మొదలుకొని ఉద్యోగం ,వ్యాపారం, వంటి అనేక రంగాలలో రాణించడానికి ఇలాంటి ఒక గొప్ప అవకాశాలు వినియోగించుకున్నందుకు తమకు ఎంతో ఆనందకరంగా ఉందని విద్యార్థులు అన్నారు.
Views: 4


