అంబేద్కర్ ఆశయ సాధన కోసమే పనిచేస్తా..

లోతుకుంట ప్రాంతంలో అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు… కేడి రమేష్

అంబేద్కర్ ఆశయ సాధన కోసమే పనిచేస్తా..

జయభేరి, అల్వాల్ : 
77వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా లోతుకుంట ప్రాంతంలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు లోతుకుంటలోని అంబేద్కర్ వాదులు కేడి రమేష్ సీనియర్ జర్నలిస్టు సంకసర్ల సువర్ణ తదితరులు. ఈ సందర్భంగా కేడీ రమేష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ కలలుగన్న భారత స్వతంత్ర దేశంలో బడుగు బలహీనులకు విద్య వైద్యం ఆరోగ్యం అందకుండా పోతుందని అలాంటి తరుణంలో తనకున్న శక్తి మేర బడుగు బలహీన వర్గాలకు ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తూ పేదలందరికీ అందుబాటులో విద్యను అందే విధంగా కృషి చేస్తానని మీడియా ముఖంగా తెలియజేశారు. ముఖ్యంగా అంబేద్కర్ తన జీవితం మొత్తం రాజ్యాంగ రచనలో ధారపోసి భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచ మేధావిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది ఆయన కలలుగన్న భారత స్వాతంత్రం కోసమని ఆ దిశగా ప్రతి ఒక్కరు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశానికి గణతంత్ర దినోత్సవంగా 77 సంవత్సరాలు దాటుతున్న ఇంకా బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక రాజకీయ స్వాలంబన రాకపోవడం పేద వర్గాలు పేదవారీగా మిగిలిపోవడం ధనికవర్గాలు ఉన్నత ధనిక వర్గాలుగా మారిపోవడం అభివృద్ధికి నిదర్శనం కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అంబేద్కర్ వాదులు పాల్గొని అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Views: 3