జయభేరి, మేడ్చల్ :
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హత ఉన్న ప్రతి రైతుకు డబిల్ పూర్ పిఏసీఎస్ చైర్మన్ సురేష్ రెడ్డి అన్నారు. రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రుణమాఫీ ని అందరి రైతులకు పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ రైతులతో కలిసి జిల్లా వ్యవసాయ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఏసీఎస్ డబిల్ పూర్ సొసైటీలో రుణమాఫీ కి అర్హత గల 668 రైతులు ఉండగా 347కి, పిఏసీఎస్ మేడ్చల్ సొసైటీ లో 449 రైతులకు 351 మందికి, పిఏసీఎస్ పుడూర్ సొసైటీ లో 650 మందికి 210 మంది రైతులకు, డబిల్ పూర్ ఎస్.బి.ఐ బ్యాంకు లో 400 మందికి రుణమాఫీ జరిగిందన్నారు. ప్రభుత్వం రైతులకు సకాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల బ్యాంకులు రైతుల అకౌంట్లు హోల్డ్ చేస్తున్నాయని దింతో వడ్డీ శాతం 7 బదులు 11 శాతం వడ్డీ విదిస్తుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు రుణమాఫీ చేయకపోతే రైతుల పక్షాన కోర్టుకు వెళ్లాడాని సిద్ధంగా ఉన్నామన్నారు.