ఘనంగా శ్రీ పద్మావతి అమ్మ వారికి సారె సమర్పణ
జయభేరి, కరీంనగర్ :
కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘం గడ్డం శ్రీరాములు ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్మశాలి ఆడబిడ్డ పద్మావతి అమ్మవారికి పుట్టింటి కానుకగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, సారె పద్మశాలి సమాజం పక్షాన సమర్ఫించడం జరిగినది. పద్మశాలి కులబంధువులందరరు కుటుంబ సమేతంగా సాంప్రదాయ దుస్తులతో శోభయాత్రగా వచ్చి అమ్మవారికి సారె సమర్పించడం జరిగినది. తిరుచానూర్ తిరుపతిలో అధికారికంగా పద్మావతి అమ్మ వారికి సారె సమర్పించడం జరుగుతుంది. అక్కడి సంప్రదాయన్ని మేము ఆనవాయితీగా సారె సమర్పించడం జరిగినది. వెంకటేశ్వర స్వామి వారి కళ్యానికి ముందు రోజు సమర్పించడం మా అదృష్టం.. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మెతుకు సత్యం, జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు వాసాల రమేష్, POPA జిల్లా అధ్యక్షులు పోలు సత్యనారాయణ, దేవసాని పాపన్న, మోర రాజేశం, అల్స భద్రన్న, జిల్లా యువజన సంఘము అధ్యక్షులు గుడిమల్ల శ్రీకాంత్, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వంగర ఆంజనేయులు, కోశాధికారి గజవెల్లి కనకయ్య, ఉపాధ్యక్షులు తేల్ల చంద్రశేఖర్, ఎలిగేటి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి వడ్డేపల్లి జ్యోతి, ఉషకోయిల సుజాత, బొల్లి రవి, పొరండ్ల రమేష్, నల్ల శ్రీధర్, మాసం సుధాకర్ బొల్లబత్తిని రవీందర్ తదితరులు చాలామంది పాల్గొన్నారు.


