మున్సిపల్ పోరులో బిఆర్ఎస్ జోరు
మాజీమంత్రి మల్లారెడ్డి విస్తృత ప్రచారం.. బండమాధారం, శ్రీరంగవరం, నూతన్ కాల్ లో మల్లారెడ్డి రోడ్ షో..
జయభేరి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. మాజీమంత్రి మల్లారెడ్డి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తనదైన శైలిలో ప్రచారంలో అన్ని పార్టీలకన్నా ముందున్నారు. శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధి బాండమాధారం, శ్రీరంగవరం, నూతనకాల్ గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 17వ వార్డు నర్సింహా, 18 వ వార్డు ఓం ప్రకాష్, 20వ వార్డు వరలక్ష్మి సురేందర్, 21వ వార్డు భాస్కర్, 16వ వార్డు సద్ది సురేష్ రెడ్డి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటిలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. మహిళలకు రూ.2500, ఆడబిడ్డకు ద్విచక్ర వాహనాలు, తులం బంగారం లాంటి ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అందరిని మోసం చేసారని విమర్శించారు. రెండేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి చేసిన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు భాస్కర్ యాదవ్, ముద్దుల శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, మెట్టు శ్రీకాంత్ రెడ్డి, దాయనంద్ యాదవ్, యూనిస్ పాషా, అకిటి నవీన్ రెడ్డి, జీవన్, సంజీవయ్య, రణదీప్ రెడ్డి, జైపాల్ రెడ్డి, సంజీవ్ గౌడ్, రఘుపతి రెడ్డి, సుశాంత్ రెడ్డి, శ్రవణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.



