కేశంపేట మండలంలోని అల్వాల గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా బండలాగుడు పోటీలు
బండ లాగుడు పోటీలు ప్రారంభించిన కేశంపేట మండలం మాజీ జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి
జయభేరి, షాద్ నగర్, ఫిబ్రవరి 16 : రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని అల్వాల గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా బండలాగుడు పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ బండలాగుడు పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేశంపేట మాజీ జెడ్పిటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించి బండలాగుడు పోటీలను ప్రారంభించారు. బండలాగుడు పోటీల కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేష్ రెడ్డి, డిప్యూటీ సర్పంచ్ మల్లేష్, కమిటీ ప్రెసిడెంట్ మెంబర్స్, శ్రీనివాస్ మాధపురం మల్లేష్, తిరుమల రెడ్డి వెంకటేష్, చేగురి శ్రీశైలం పాండు ఆర్ శంకరయ్య, ఏ చంద్ర శేఖర్, నరేష్ కుమార్. కుమ్మరి రాజు, మహేందర్ తదితరులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు...
Views: 0


