ముఖ్య అతిధిగా పాల్గొని బహుమతులు అందించిన మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి
జయభేరి, మేడిపల్లి : సంక్రాంతి పండుగ సందర్బంగా మేడిపల్లి సాయి హిల్స్ కాలనీ అశోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల రంగోలి పోటీలలో మహిళ లు పెద్ద ఎత్తున ఉత్సహంగా పాల్గొని ముగ్గులు వేశారు, ఈ కార్యక్రమం నికి ముఖ్య అతిధిగా మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి పాల్గొని బహుమతులు మొదటి బహుమతి నళిని, రెండవ బహుమతి ప్రీతి, మూడవ బహుమతి రవలి, నాల్గవ బహుమతి అరుణ లకు, ముగ్గుల పోటిల్లో పాల్గొన్నా మహిళలందరికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమం లొ కాలనీ అధ్యక్షకార్యదర్శులు మధుసూదన్, మోహన్ రెడ్డి అశోసియేషన్ సభ్యులు డివిజన్ నాయకులు, మహిళలు యువతులు పాల్గొన్నారు...