ప్రపంచ ఆక్వాకల్చర్ ఇండియా 2025 కార్యక్రమంకు బయలుదేరిన మత్స్య రైతులు, అధికారులు

ప్రపంచ ఆక్వాకల్చర్ ఇండియా 2025 కార్యక్రమంకు బయలుదేరిన మత్స్య రైతులు, అధికారులు

జయభేరి, కరీంనగర్ :
ప్రపంచ ఆక్వా కల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ కు కరీంనగర్, పెద్దపెల్లి జిల్లా మత్స్యశాఖ అధికారి నరేష్ నాయుడు ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మత్స్య రైతులు సోమవారం రోజున బయలుదేరి వెళ్లారు.
భారతదేశం లో పెరుగుతున్న ఆక్వాకల్చర్ రంగం, సముద్ర అభివృద్ధిలో దాని ప్రాముఖ్యతను గుర్తిస్తూ, భారతదేశంపై దృష్టి పెట్టడానికి ప్రపంచ ఆక్వాకల్చర్ కమ్యూనిటీని ఏకతాటిపైకి తీసుకురావడం. ఈ కార్యక్రమంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు పాల్గొంటాయి.
ఈ కార్యక్రమానికి బయలుదేరిన వారిలో పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ కొలిపాక నరసయ్య, కరీంనగర్ జిల్లా వైస్ చైర్మన్ పెసరు కుమార్ స్వామి, కరీంనగర్ ఎఫ్ డి ఓ మంజుల, ff అశోక్, కరీంనగర్ జిల్లా డైరెక్టర్లుమోటం వెంకటేష్, పప్పు సమ్మయ్య జక్కుల బాబు, రేగుల రాజేందర్, నిమ్మల సురేష్ ఎలవేణి సదానందం, 40 మంది మత్స్య రైతులు తరలి వెళ్లారు.

Views: 49