స్వామీ వివేకానంద ఆశయాలను కొనసాగిద్దాం
హాజిపల్లి గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
జయభేరి షాద్ నగర్ జనవరి 12 :స్వా మీ వివేకానంద 163వ జయంతి సందర్బంగా ఫరూఖ్ నగర్ మండలం హాజిపల్లి గ్రామంలో స్వామీ వివేకానంద యూత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి విష్ణువర్ధన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే స్వామి వివేకానంద జయంతి సందర్బంగా హాజీపల్లి గ్రామంలో రక్తధాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. విష్ణువర్ధన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు స్వామి వివేకానంద 163వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పాలమూరి విష్ణు వర్ధన్ రెడ్డి
స్వామిజీ యువకులకు ఎప్పటికప్పుడు ప్రేరణ కలిగించి యువత సన్మార్గం వైపు నడిచేలా చేశారన్నారు. ఆ మహానీయుడు పుట్టినరోజు ఈరోజు కాబట్టి జాతీయ యువజన దినోత్సవంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిందన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటిన గొప్ప మహానుభావుడు స్వామి వివేకానంద అని అన్నారు. రక్తధానం చేయడం వల్ల ప్రమాదంలో ఉన్నవారికి ఎంతో ఉపయోగపడి ప్రాణాలు కాపాడుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుమార్, ఉపసర్పంచ్ ఇస్నాతి గంగాదర్, బిజెపి సీనియర్ నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, ఇస్నాతి మహేందర్, చేగు సుధాకర్ అప్ప, కుడుముల బాల్ రాజ్, రంగన్న గౌడ్, దినేష్ రెడ్డి, ఇస్నాతి శ్రీనాథ్, వార్డు మెంబర్లు మహేందర్, విష్ణు, అనిత, వివేకానంద యూత్ అధ్యక్షులు ధరణిధర్, యూత్ సభ్యులు నవీన్, ప్రశాంత్, రాఘవేందర్, దేవేందర్, నర్సింగ్ రావు, మరియు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



