పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పండ్లు, పెన్నులు, నోట్ పుస్తకాలను పంపిణీ
జయభేరి, మహేశ్వరం, మార్చి 12 :
మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పున్న నిర్మల పుట్టినరోజు సందర్భంగా సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ (VM) హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో నిర్వహించిన సేవా కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పాఠశాల విద్యార్థులకు పండ్లు, పెన్నులు, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత, ఖిల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్ కుమార్ VM స్కూల్ ప్రిన్సిపల్ నర్సింహ రెడ్డి సెక్రటరీ ప్రసాద్ అకాడమీ కోఆర్డినేటర్ మాధురి, జగన్నాథం నర్సింగ్, శివప్రసాద్, దోర్నాల చంద్రమౌళి, వనం వెంకటేశం, గజం వెంకటేశం, జెల్లా నరేందర్, రమాదేవి, సుజాత, స్రవంతి, అశ్విత, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..


