దంచి కొడుతున్న వానలు

రైతే రాజు అనడానికే నా... ఏ ప్రభుత్వం ఆదుకోదా...

దంచి కొడుతున్న వానలు

జయభేరి, సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ లో దంచి కొడుతున్న వానలు. అకాల వర్షాలతో తల్లడిల్లి పోతున్న రైతన్న పంట.. ఆరుగాలాల కష్టపడి పండించిన పంట చేతికి రాకపోతే ఎంత బాధ ఉంటుందో ఆ రైతన్నకే తెలుసు... చేను కోతకు వచ్చే సమయానికి ఈ రాకాసి తుఫాన్ కారణంగా రైతు ఆవేదన అంతా ఇంతా కాదు. ఈ రైతు దుఃఖాన్ని ఎవరు ఆపగలరు. ఈ రైతును ఎవరు  ఓదార్చ గలరు. రేపు మాకు పంట చేతుకు వస్తుంది కదా అని... తన పిల్లలకు ఫీజులు కట్టొచ్చు  కదా అని ఆ రైతు ఎదురుచూస్తూ ఉండగా... ఈ రాకాసి తుఫాన్ రైతును అతలాకుతలం చేసింది. పంటను నేలపాలు చేసింది. రైతు బోరున విలపిస్తున్నారు. ఎవరు ఆపగలరు ఈ రైతు బాధను... ఏ ప్రభుత్వం సహాయ పడగలదు.. రైతును రాజును చేస్తాం అనే మాట తప్ప రైతును ఆదుకునే ప్రభుత్వాలు లేవు.. ఈరోజు రైతులను చూస్తుంటే వాళ్ల బాధ అంతా ఇంతా కాదు. పంట మొత్తం నేల పాలు అయినది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రైతులను ఆదుకొని పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరుచున్నాం.

IMG-20251029-WA3476

Read More Telangana I మేయర్, కార్పోరేటర్లంతా రాజీనామా చేసి  ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి..

Views: 119