తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, హైదరాబాద్ నగర శాఖ కార్యవర్గ సమావేశం
జయభేరి, హైదరాబాద్ : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, హైదరాబాద్ నగర శాఖ కార్యవర్గ సమావేశం బుధవారం సాయంత్రం 4:00 గంటలకు భూగర్భ జలవనరుల శాఖ, చింతల్ బస్తీ, ఖైరతాబాద్, హైదరాబాద్ లో నిర్వహించబడింది. ఈ సమావేశాన్ని హైదరాబాద్ నగర శాఖ సంఘం అధ్యక్షుడు గండూరి వెంకటేశ్వర్లు, కార్యదర్శి శెట్టిపల్లి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా టి.జి.ఓ రాష్ట్ర అధ్యకుడు ఏలూరి శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ హాజరై, క్రింది అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. అనంతరం క్రింది అజెండా అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేయబడ్డాయి.
2. ప్రస్తుతం నగర శాఖలో ఖాళీగా ఉన్న కోశాధికారి పదవిని భీమ్ సింగ్ కి, జాయింట్ సెక్రెటరీ పదవిని వెంకట రమణకి మరియు మరొక జాయింట్ సెక్రెటరీ పదవిని వెంకటేశ్వర్కి, అదే విదంగా నరసింహ దారిని EC మెంబర్ నుండి జాయింట్ సెక్రెటరీ గా పదోన్నతి కల్పించడంతో పాటు వెంకట నర్సయ్యని కూడా కార్యావర్గంలోకి తీసుకోవడానికి ఏకగ్రీవంగా తీర్మానించడమైనది.
3. హైదరాబాద్ నగర శాఖ కార్యవర్గం 2026 వాల్ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్ & డైరీల ప్రిపరేషన్ పనిని మొదలు పెట్ట వలసిందిగా తీర్మానిస్తూ నగర శాఖ సభ్యులందరూ అడ్వర్టైజ్మెంట్ తప్పని సరిగా ఇవ్వవలసినదిగా తీర్మానించడమైనది.
4. 4. 2025 సర్వ సభ్యత్వం నమోదు కార్యక్రమం డిసెంబర్ లోపుగా పూర్తి స్థాయిలో చేయాలనీ ఏకగ్రీవంగా తీర్మానించబడింది.
5. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, హైదరాబాద్ నగర శాఖ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్, హైదరాబాద్"ను అధికారికంగా స్థాపించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను తక్షణమే ప్రారంభించాలని ఈ సమావేశం తీర్మానించబడింది.
పై తీర్మానాలు కార్యవర్గ కమిటీ సభ్యులచే ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నగర శాఖ కార్యవర్గ సభ్యులు: బాబు భేరి, సబిత, భీమసింగ్, మహేష్, లావణ్య, స్వరూప, యశోద, పద్మలత, వెంకటేశ్వర్లు, వెంకటయ్య, ప్రభాకర్, సముజ్వల, యాదగిరి, శ్రీనివాస్, ప్రసన్న, లలిత, అంజూం, పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.


