Telangana I క్యాబినెట్ భేటీతో.. బీఅర్ స్ లో పెరిగిన దడ.!?

సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పర్యటించి లక్షల కోట్ల నిధులను విడుదల చేసి మహిళా సాధికారతకు నడుంబిగించారు

Telangana I క్యాబినెట్ భేటీతో.. బీఅర్ స్ లో పెరిగిన దడ.!?

జయభేరి, హైద‌రాబాద్ :

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పరిపాలనలో ఆరు గ్యారెంటీయుల పథకాలను అమలు చేయాలని క్యాబినెట్ మీటింగ్ సమావేశం అయింది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు.. లోక్సభ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అదిలాబాద్ జిల్లా పర్యటనలో సీఎం చేసిన ఘాటు వ్యాఖ్యలపై సమీక్ష ఇలాంటి ఎన్నో విషయాలపై 'జయభేరి' సమగ్ర రాజకీయ కోణంలో కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ పూర్తి విశ్లేషణ... 

Read More ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పర్యటించి లక్షల కోట్ల నిధులను విడుదల చేసి మహిళా సాధికారతకు నడుంబిగించారు. ఆర్థిక మంత్రి నా పక్కనే ఉన్నాడు ఆయనే మీకు డబ్బులు ఇచ్చేది అంటూ చురకలు అంటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్కును చూపించుకున్నారు. ఇక ఇదే విషయాలపై ఆరు గ్యారెంటీ ఇలా పథకాల అమలుపై ఆ సభలు మాట్లాడుతూ త్వరలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు 500 రూపాయలకు సిలిండర్ అన్న పథకాన్ని త్వరలోనే అమలు చేస్తాం అన్న నేపథ్యంలో ఈ విషయాలపై తెలంగాణ క్యాబినెట్ సమావేశానికి పూనుకుంది. ఇక ఈ సమావేశంలో దాదాపు నాలుగు ఐదు గంటల పాటు సాగిన క్యాబినెట్ సమావేశంలో ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. అదిలాబాద్ పర్యటనలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలకు కార్యరూపం దాల్చడానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసేందుకు రంగం సిద్ధమైందని తెలిపారు. అలాగే శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన విజయోత్సవంతో పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగించాలనే దృఢనిశ్చయంతో దాదాపు పని పూర్తయిందనే సంకేతాలు గట్టిగా వినబడుతున్నాయి... నల్లగొండ ఖమ్మం వరంగల్ పెద్దపల్లి ఇలాంటి స్థానాల్లో కచ్చితంగా అధికారాన్ని దక్కించుకొని టార్గెట్ 17 రీచ్ అవ్వాలని తహతోలాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పథక రచనలకు శ్రీకారం చుట్టింది. క్యాబినెట్ సమావేశంలో త్వరలో ఈనెల 10వ తేదీన బడ్జెట్ సమావేశం పెట్టే యోచనలో ఉంది. ఈ బడ్జెట్ లో ఇప్పటికే తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ చిన్న తరహా కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం ఐటి రంగానికి చేయూత ఇలా సంక్షేమ పథకాల అమలు కోసం ఎంతెంత బడ్జెట్ను కేటాయించాలని నిర్ణయాన్ని ఈనెల తొమ్మిదవ తారీఖున మరొకసారి కూర్చొని రాష్ట్ర క్యాబినెట్ బడ్జెట్కు ఆమోదముద్ర తెలపనంది.

Read More ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుక్స్,పెన్నులు పంపిణీ 

ఇక ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై ఎలాంటి చురుకులు వేయాలో తెలియక తికమగపడుతూ సంక్షేమ పథకాలు పార్లమెంటు ఎన్నికల్లో గెలిస్తేనే ఇస్తారని ఆరు గ్యారెంటీ పథకాల్లో ఒక్క దానైనా అమలుపరిచారా అంటూ లేనిపోని మాటలతో సమయాన్ని వృధా చేసుకుంటుంది.. ఇప్పటికే బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో మీలాఖత్ అయ్యి తెలంగాణలో మాకు వచ్చిన ఎంపీ సీట్లను బిజెపిలో కలుపుతామని ఆరోపణలు రాజకీయ కోణంలో వస్తున్న నేపథ్యంలో మరింతగా బీఆర్ఎస్ పార్టీకి స్థానాలు దక్కకపోవడం అనుమానంగా ఉంది. ఇంకో రకంగా బిజెపి పార్టీ ఈసారి కచ్చితంగా నరేంద్ర మోడీని మరొకసారి అధికారంలోకి తీసుకురావడానికి ప్రముఖుల పర్యటనతో తెలంగాణ దద్దరిల్లనుంది.. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో పలు అంశాలపై సుదీర్ఘ చర్చ సాగిన నేపథ్యంలో త్వరలోనే మరో రెండు పథకాలు ప్రజలకు అందుబాటులో రానున్నాయి. ఇప్పటికే ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజలు పెట్టుకున్న అప్లికేషన్లను పరిశీలిస్తూ డేటా ఎంట్రీ చేస్తున్న తరుణంలో ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ వాలంటీర్లు వాటిని స్కూపీ చేస్తూ ఎవరు ఏ పథకానికి అర్హులు నిర్ణయించే పనిలో నిమగ్నమై ఉన్నారు.

Read More ఖేల్ ఖుద్ పోగ్రామ్ (అటాలపోటీ) ఏకల్ అభియాన్ ద్వారా భోవనేశ్వ (ఒడిస్సా)కి బయలుదేరిన క్రీడాకారులు

ఇప్పటికే ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు, రైతులకు రైతుబంధు, 500 రూపాయలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అలాగే 200 యూనిట్ల వరకు పేదవాళ్ళకి ఉచిత కరెంటు ఇచ్చే పథకాలను ప్రవేశ పెట్టడానికి అన్ని రకాల సిద్ధం అవుతోంది. అంటే మొత్తానికి ఈ రెండు పథకాలు ప్రవేశ పెడితే నాలుగు పథకాలు అమలుపరిచిన అవుతుందనే కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి లోక్సభ ఎన్నికలకు ముందే బడ్జెట్ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే పనిలో క్యాబినెట్ మీటింగ్ సమగ్ర ఆలోచనలకు వచ్చింది. ఇలా విజయోత్సవంతో ప్రజలకు ఇచ్చిన పథకాలను అమలుపరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా పార్లమెంటు స్థానాలను దక్కించుకునే అవకాశం లేకపోలేదు..

Read More తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి

ఇక ప్రతిపక్షంలో రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ బిజెపితో జత కడుతుందా అన్న అనుమానాలను తెరలేపుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి తో భేటీ కావడం చర్చాంశనీమవుతుంది... ఇదే గనక నిజమైతే కవితను కేంద్ర మంత్రిగా ప్రకటించే అవకాశం లేకపోలేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురిని బిజెపికి అనుకూలంగా మలుస్తూ కేంద్ర మంత్రిగా చూడాలనే కలలు కంటున్నాడు. తన కొడుకు కేటీఆర్ ను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడాలనుకునే కలలు నిజమవుతాయో లేదో అది కాలము ప్రజలే నిర్ణయించాలి. ప్రస్తుత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ చురుగ్గా రాజకీయ పదక రచన చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే వలసలు కాంగ్రెస్లోకి ఎక్కువవుతున్నాయి... తాజాగా మాజీ మంత్రి తాటికొండ రాజయ్య టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నట్లు ప్రకటించేశాడు...

Read More మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం 

పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడేసరికి టిఆర్ఎస్ కి ఉన్న తొమ్మిది పార్లమెంటు స్థానాలు కాపాడుకుంటారు లేదంటే పూర్తిగా ఎంపీ స్థానాలు పరాజయాన్ని పొందుతారో ప్రజలే నిర్ణయించాలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశమై దాదాపు పలు కీలక అంశాలపై చర్చించి త్వరలోనే మరో రెండు ఆరు గ్యారెంటీ పథకాల్లోని రెండు పథకాలను ప్రజలకు కార్యరూపం దాలుస్తోంది... పార్లమెంటు ఎలక్షన్ల కంటే ముందే బడ్జెట్ను ప్రవేశ పెడుతూ ఆ బడ్జెట్లో విభిన్న రంగాల్లో ఉన్న అంశాలను వాటికి తగిన బడ్జెట్ను కేటాయిస్తూ పదేండ్ల విధ్వంసాన్ని అభివృద్ధి గా మార్చడానికి కృషి చేస్తున్నమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి అదేమీ పట్టట్లేదు.. అంటే కేంద్రంలో బిజెపితో దోస్తీ కుదురుతుంది అన్నట్టే కదా అని పలు అనుమానాలకు తావిస్తోంది... పార్లమెంటు ఎన్నికలకు ముందే బడ్జెట్ సమావేశాలు ఆలోపే ఆరు గ్యారెంటీ పథకాల్లోని 4 గ్యారెంటీ లకు కార్యరూపం దాలుస్తూ ప్రజలకు అందించే దిశగా కాంగ్రెస్ విజయోత్సవంతో అడుగులు వేస్తున్న నేపథ్యంలో కచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించక మానదు అన్నట్టుగా కనిపిస్తోంది.

Read More నవవధువు వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన గోలి సంతోష్

-  కడారి శ్రీనివాస్
 కాలమిస్ట్, కవి, సీనియర్ రాజకీయ విశ్లేషకులు
9848 962 799

Read More నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా