భాస్కర్ అకాల మరణానికి చింతిస్తూన్న నకరేకల్ ఎమ్మెల్యే
1992-93 సంవత్సరానికి గాను పదవ తరగతి చదువుతున్న వారిలో వేముల వీరేశం ఉన్నారు. తన క్లాస్మెట్ గాజుల భాస్కర్ అకాల మరణం చెందారని తన స్నేహితుల ద్వారా తెలుసుకొని పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసాగా నిలిచారు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.
జయభేరి, నకిరేకల్: శాలిగౌరారం మండలం ఇటుకల పహాడ్ గ్రామానికి చెందిన గాజుల భాస్కర్ అకాల మరణానికి చింతిస్తూ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించి అతని భార్య పిల్లల్ని పరామర్శించి వారికి భరోసగా నిలబడ్డారు.
అంతేకాకుండా వారికి ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించారు. అలాగే వారికి కట్టుకుంటానికి ఇద్దరమ్మాయి ఇవ్వాలని తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ని అభ్యర్థిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గాజుల భాస్కర్ 92, 93 10వ తరగతి చదివిన తన తోటి స్నేహితులు మాజీ సర్పంచ్ అల్లి సైదులు, గైగుల్లా అవిలయ్య, పుసోజు వీరయ్య, అల్లి వెంకన్న, పెరుమాండ్ల వీరయ్య, కడారి శ్రీనివాస్, ఎంఈఓ గా పనిచేస్తున్న మందుల సైదులు, పోలేపాక సుదర్శన్, వెంకన్న శ్రీనివాస్, సంతసాగర్, అరగంటి ప్రభాకర్ లతోపాటు గోపాశి కన్నయ్య, జయరాజు సుధాకర్ సురేష్, గ్రామ స్థాయిలో ఉన్న పలువురు భారీ ఎత్తున గాజుల భాస్కర్ పార్టీవ దేహానికి వీడ్కోలు పలికారు...


