ఘనంగా కుమ్మరుల శ్రావణ మాస తొలి బోనాల జాతర
జయభేరి, దేవరకొండ : నల్గొండ జిల్లా ధర్వేశిపురం శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వద్ద ఆదివారం కుమ్మరుల శ్రావణమాస తొలి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కుమ్మర శాలివాహన సంఘం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కుమ్మరుల తొలి బోనాల జాతర కమిటీ అధ్యక్షురాలు ఏడుకొండల సత్యవతి వెంకటేశ్వర్లు మరియు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తోటపల్లి కిరణ్ మాట్లాడుతూ కుమ్మరులు ఐక్యంగా ఉండాలని, గ్రామ దేవతల వద్ద కుమ్మరులను పూజారులుగా నియమించాలని, రాజకీయంలో చొరవచూపి ఉన్నత పదవులను అధిరోహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు తోటపల్లి కిరణ్,నీలకంఠం రాములు, కాసర్ల వెంకటేశ్వర్లు, మాడుగుల యాదగిరి, ఘనపురం వెంకటేశ్వర్లు, తోటపల్లి వెంకటయ్య, బొడ్డుపల్లి మల్లేశం, ఏరుకొండ రాము, తోటపల్లి శ్రీనివాస్,డాక్టర్ శ్రీను,బొడ్డుపల్లి బాలకృష్ణ,ఏరుకొండ నరేష్,ఏరుకొండ వెంకటయ్య, లక్ష్మీ, ఈశ్వరమ్మ,తోటపల్లి వెంకటేష్ తోటపల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు.


