Telangana I యువత ఆలోచన విధానం..!

ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగం లేవు మా నీళ్లు దోచుకుంటున్నారు మా నిధులు దోచుకుంటున్నారు అని ఏకకంఠంతో గలమెత్తిన మనమే ఇప్పుడు సొంత రాష్ట్రంలో కూడా అవినీతి అన్యాయం జరిగిందంటూ మళ్లీ నెత్తినోరు కొట్టుకుంటున్నo

Telangana I యువత  ఆలోచన  విధానం..!

జయభేరి, హైద‌రాబాద్ : మారుతున్న సమాజంతో పాటు మనము మారాలి కాబట్టి ఎలా పడితే అలా ప్రవర్తించడం కరెక్టు కాదు. రాష్ట్రం సాధించుకున్న ఎనిమిది ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగం లేవు మా నీళ్లు దోచుకుంటున్నారు మా నిధులు దోచుకుంటున్నారు అని ఏకకంఠంతో గలమెత్తిన మనమే ఇప్పుడు సొంత రాష్ట్రంలో కూడా అవినీతి అన్యాయం జరిగిందంటూ మళ్లీ నెత్తినోరు కొట్టుకుంటున్నo... ఇలాంటి సందర్భంలో యువత ఆలోచన విధానం ఎటువైపు వెళుతుంది అంటే పెడదారి పడుతుంది అని చెప్పక తప్పదు. చెప్పడానికి బాధాకర విషయమే అయినా మద్యం పానానికి బానిసలుగా మారుతున్నది యువతే అని చెప్పక తప్పదు.

ఇంకోవైపు యువత ఆండ్రాయిడ్ ఫోన్లను ఎక్కువగా వాడుతూ అసభ్యకరమైన నీలి చిత్రాలకు బానిసలుగా మారిపోతున్నారు. రాత్రి ఒంటిగంట రెండు గంటల వరకు బజార్లు తిరుగుతున్న యువత ఉదయం  11 గంతలకైన అయినా నిద్ర లేవరు. నేటి యువతకు ఆధ్యాత్మిక చింతన కొరవడుతోంది. కేవలం చదువు మార్కులు సర్టిఫికెట్ గ్రేడ్లు అంటూ ఒక తరం యువత పరిగెడుతుంటే మరొకవైపు యువత రాష్ట్రంలో మద్యపాన దుకాణాల ముందు క్యూలు కడుతున్న వైనం మన కళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంది.

Read More చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 

ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్లలోపు యువతి యువకుల ఆలోచన విధానం రాకెట్ల దూసుకుపోతున్న ఎక్కడో బానిసలుగా మారే ఆలోచన కాలం వడిలోకి మరణశయ్యపై కి స్వాగతం పలికే దారుల్లో వెళుతున్నారు. యువత ఆలోచనలు డబ్బుకి ప్రాధాన్యం ఇస్తున్న తమ ఆరోగ్యలపై మాత్రం ఎలాంటి చీకు చింత లేదనిపిస్తోంది. వందకి 85, 90 శాతం యువత మద్యపానం ధూమపానం గుక్కాలకు బానిసలుగా మారుతున్నారు. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యంనికి పెద్దపీట వేస్తున్న అంతే వేగంతో చెడు అలవాట్లు కు అలవాటు పడే దుకాణాలకు తలుపులు బార్లుగా తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పండగ వచ్చిన పదం వచ్చిన బాధైనా కష్టమైనా సంతోషమైనా ఏది ఏమైనా బాటిల్లు చేతిలో ఉంచాల్సిందే. అంతెందుకు తాజాగా ఓ సినిమాలో సినీ గేయ రచయిత  చంద్రబోస్ సీసా సీసా అంటూ సాగే ఒక పాటలో కూడా ఇప్పుడు యువత అదే తోప పడుతుందనే ఒక సందేశాన్ని ఆ పాటలు ఆయన రాయడం జరిగింది.

Read More ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.

అంటే యువత ఆలోచనలకు సానుకూలంగానే చిత్రాలు వస్తున్నాయి. ఒక సినిమాలే కాదు సోషల్ మీడియాలో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి అసభ్యకరంగమైన చేష్టలతో తమ ఇమేజ్ను పెంచుకోవడానికి నాన్న ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ దారి ఎటువైపు వెళుతుంది అనేది వాళ్ళ అస్సలు పట్టించుకోవడం లేదు. క్షణికావేశం క్షణికా సుఖాలకు లోనవుతూ యువత భవిష్యత్ నీరుగారి పోతుంది. మానవా అరణ్యంలో సంచరిస్తున్న మానవజాతి సమస్తమును చూసీ అడవి నీతి కూడా సిగ్గుపడుతుంది... యువత తీరు మార్చుకోకపోతే భవిష్యత్ అంధకారమే.. విద్య వైద్యం ఇంకా కొరవడుతున్న నేటి సమాజంలో యువత డ్రగ్స్ వైపు అలవాటు పడుతున్న సంగతి మనందరికీ తెలుసు. 10 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు పిల్లలు ఎంతోమంది డ్రగ్స్ కు అలవాటు పడి వీధుల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. అందిన కాడికి దోచుకుని జల్సా లకు అలవాటు పడే యువత దాదాపు 80% ఉండొచ్చు అని ఒక అంచనా.

Read More ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 

ఇక యువత చదువుకుంటున్న తరుణంలోనే ప్రేమ అనే ఒక వెపన్ కి అంటూ కట్టబడి తమ ప్రాణాలు తామే తీసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకోవడం మహా నేరo. క్షమించరాని విషయం.

Read More నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా 

 అయినప్పటికీ ప్రేమజంటలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయి. యువత ముఖ్యంగా తామేది కావాలంటే అది జరగాల్సిందే అన్న ఆలోచనలతో జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువత ఆలోచనలకు పదును పెడుతూ ఐటీ హబ్ను ఏర్పాటు చేసిన అక్కడ గ్రామీణ జిల్లా మండల స్థాయి యువకులు ఎక్కడ కనిపించట్లేదు. కారణం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వం స్కూల్లు మూతపడ్డాయి. విద్యార్థులు లేక టీచర్ల కొరత కారణాలు ఏవేవైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ బడులను మూసి వేయించింది. దీంతో గ్రామీణ మండల ప్రాంతాల్లోని యువతి యువకులు పదవ తరగతి వరకు చదువుకొని ఆపై అడవి పనికి అలవాటు పడుతున్నారు.ఇక ఇక్కడి నుంచే మత్తుకు అలవాటు పడి దేశానికి బాగుపడకపోగా సమాజానికి ఉపయోగ కాకపోగా కుటుంబానికి దుఃఖాన్ని మిగిలిస్తున్నారు.

Read More మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులో అభినందన సభ

ఇక ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ నాయకుల చేతిలో ఆట వస్తువులుగా మారుతున్న యువతరాన్ని చూస్తే జాలిస్తోంది. అవసరానికి వాడుకొని వదిలేసే ఆయా రంగు రంగు జెండాల రాజకీయ పార్టీల నేతల తీరును చూసి యువత ఆలోచనల్లో మార్పు రాకపోగా వారికి అభిమానులుగా మారిపోయి ఎంతటి కార్యానికైనా సిద్ధపడుతున్నారు. ఇది రేపటి తరానికి చాలా ప్రమాదకరం.
యువత అంటే రంగు జెండాలు బీరు సీసాను తాగే సిగరెట్టు తినే గుట్కాను మత్తును అనుభవించే డ్రగ్స్ కానే కాదు. యువత అంటే ఈ దేశానికి బలం. యువత తలుచుకుంటే చరిత్రనే తిరగరాయవచ్చు. యువత ఉద్యమిస్తే తలరాతన తామే సరి చేసుకోవచ్చు. కానీ యువత ఏం చేస్తోంది అని నిజంగా ఆలోచిస్తే యువత ఆలోచనల్లో వికలాంగులుగా మారిపోతున్న నీటి ఆధునిక యువతరానికి ఇది ఒక చెంపపెట్టుగా భావించాలని నా మనవి....

Read More డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్

... కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్

Read More మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం