ఏకరూప క్రీడా దుస్తులు, ఐడీ కార్డ్స్ పంపిణీ

ఏకరూప క్రీడా దుస్తులు, ఐడీ కార్డ్స్ పంపిణీ

సైదాపూర్ మండలంలోని ఏక్లాస్పూర్ గ్రామంలో కీర్తిశేషులు కొత్త పద్మనాభ రెడ్డి జ్ఞాపకార్ధంగా వారి కుమారులు శ్రీ.కొత్త నారాయణ రెడ్డి మాజీ సర్పంచ్ కొత్త రాజిరెడ్డి, కొత్త నాగిరెడ్డి, ప్యాక్స్ చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప క్రీడా దుస్తులు, ఐడీ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని సైదాపూర్ మండల AMC చైర్మన్ దొంత సుధాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు పంపిణీ చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకుని సమాజంలో గుర్తింపు పొందాలని పాఠశాల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తామని విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.. ఇంత మంచి గొప్ప కార్యక్రమానికి చేయూతనిస్తున్న కొత్త పద్మనాభ రెడ్డి  కుమారులని సన్మానించి వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, AMC వైస్ చైర్మన్ న్యాదండ్ల రాజుకుమార్, మాజీ ZPTC బెదరకోట రవీందర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మ్యాకల రవీందర్, కూతురు విద్వాన్ రెడ్డి, AMC డైరెక్టర్లు ఉడిగే రాజశేఖర్ తాళ్ల పెళ్లి వెంకటేశం మాజీ సర్పంచ్ కొండ గణేష్, ఎండి చోటే మియా, యువజన కాంగ్రెస్ సైదాపూర్ మండల అధ్యక్షులు వేముల సాయికుమార్, కాంగ్రెస్ పార్టీ ఎక్లాస్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు అంబాల ప్రేమ్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Read More Medigadda I మేడిగడ్డ.. బొందల గడ్డ... భాష మార్చుకోకపోతే ప్రజలు చీదరిస్తారు!

IMG-20250806-WA3705

Read More Congress I లెక్కలు తేల్చాల్సిందే...

Views: 0