చిలుక రాజు సేవలు చిరస్మరణీయం
ఘనంగా చిలుక రాజు జయంతి వేడుకలు
చిలుక రాజు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన నేతలు
జయభేరి, మేడ్చల్ : మేడ్చల్ మాజీ సర్పంచ్ రామన్నగారి రాజేశ్వర్ గౌడ్ ( చిలుక రాజు) 64వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ లోని పెద్ద చెరువు సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతేకాకుండా సర్పంచ్ గా ఉన్న సమయంలో రామన్న గారి రాజేశ్వర్ గౌడ్ ( చిలుక రాజు ) చేసిన సేవలను స్మరించుకున్నారు. కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అన్ని రకాల సహకారాలు అందిస్తూ రామన్న గారి రాజేశ్వర్ గౌడ్ ( చిలుక రాజు) అందరూ మనసులో నిలిచారని గుర్తు చేసుకున్నారు.
ఇదే విధంగా గిర్మాపూర్ లో వార్డు కార్యాలయంలో పనిచేసే వారి కష్టాన్ని గుర్తించి ఒక్కొక్కరికి పది మంది కార్మికులకు రూ.1000 వేల చొప్పున ఉచితంగా అందజేశారు. దీంతో స్థానికులు తండ్రి బాటలోనే తనయుడు కూడా నడుస్తున్నారు అంటూ రామన్న మణికంఠ పై ప్రశంస జల్లులు కురిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ అన్నదాన కార్యక్రమానికి దాదాపు 1000 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ హనుమంత్ రెడ్డి, బల్రెడ్డి, మాజీ బీజేపీ అధ్యక్షులు ఆంజనేయులు, రాఘవరెడ్డి, సత్యనారాయణ, రాజిరెడ్డి, మామిండ్ల వేణు, చీరల రాము, శేఖర్, వెంకటేశ్, ప్రభు,చంద్ర శేఖర్, శ్రిపాల్, జావిద్, అర్జున్, వంశీ తదితరులు పాల్గొన్నారు.



