Telangan I ఏదీ రాజ్యాంగ స్ఫూర్తి.. సందేహమా? సవాళ్ల?
75ఏళ్ల గణతంత్ర స్వాతంత్ర దేశంలో 16 సార్లు భారత రాజ్యాంగం అమెండ్మెంట్ చేశారు కారణం ఏదైనా సరే రాజ్యాంగంలో మార్పులు చేయడం ఇప్పుడున్న సమాజానికి అవకాశం గా మార్చుకొని 100కు పైగా చేశారు..
జయభేరి, హైదరాబాద్ : భారతదేశము సర్వసత్తాక గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్యంగా ఏర్పాటైన తర్వాత ప్రతి వారికి సమానమైన సామాజిక ఆర్థిక హక్కును కల్పించింది భారత రాజ్యాంగం.. రాజ్యాంగం ప్రకారంగా రాజకీయాల్లోని వివిధ హోదాల్లో పనిచేస్తున్న ప్రజా నేతలు ప్రజాపాలనను కొనసాగించేలా ప్రతి విషయాన్ని రాజ్యాంగంలో సమగ్రంగా లిఖించినటువంటి ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నోసార్లు రాజ్యాంగం అవతరణ దినోత్సవం నాడు భావోద్వేగమైన ఉపన్యాసాన్ని చేశారు... గణతంత్ర దినోత్సవంగా అమలు జరపబడిన రోజు నుంచి ఆయన మాట్లాడిన మాటలు నేటికీ సజీవంగా ఉన్నాయి అంటే అతిశయతి కాదు. వికసితభారత్ అంటూ భారతదేశ వికసిస్తోంది ఎన్నో కోట్ల నిధులతో దేశం అభివృద్ధి రంగంలో ముందుకు పోతుంది సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలుగా జరుగుతున్నాయని చెప్పుకొస్తున్న ఆయా ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని 106 సార్లు రాజ్యాంగాన్ని మార్పులు చేర్పులు చేశారంటే రాజకీయ నాయకుల చిత్తశుద్ధికి తార్కాణం..
రాజ్యాంగ స్ఫూర్తికి దెబ్బతినకుండా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను నియమ నిబంధనలను సరిగ్గా పాటిస్తే రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు...
నిజానికి భారతదేశంలో రోజురోజుకీ పెరుగుతున్న జనాభా దృష్టి అవసరాల దృష్టి ఆర్థిక స్థితి గతులను మార్పులు చేర్పులు చేసుకునే విధి విధానాల్లో రాజ్యాంగానికి లోబడి పని చేయాలి కానీ మానవ వికాసానికి మానవ అభివృద్ధికి మానవ స్వార్ధ నీతి ప్రలోభాలకు రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేస్తే ఇంకా రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడ ఉంటుంది!?
రాజ్యాంగంలోని అంగాలను వేరుచేసి ముక్కలు ముక్కలుగా మార్పులు చేర్పులు చేసి మనిషి అవసరానికి అనుగుణంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సానుకూలంగా రాజ్యాంగాన్ని మార్పులు చేస్తూ పోతే మళ్ళీ నియంత పాలనే కాక ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన కొనసాగుతుంద!?
గణతంత్ర దినోత్సవం లౌకికవాదం సార్వభౌమాధికారం అనే పెద్ద పెద్ద మాటలకు అర్ధాలు కూడా తెలియని యువతరాన్ని చూస్తే వీళ్ళ కోసమా రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్పులు చేసింది అనే సందేహం రాకమానదు.... దేశ సంపదమెక్కమంటే దేశాన్ని అప్పుల పాలు చేసే ప్రజా పాలకులు ఉన్నంతకాలం ఇలాంటి స్వార్థ ప్రజా పాలకుల చెరలో చెక్కిన రాజ్యాంగం ఇలాగే మొక్కలు ముక్కలుగా మార్పులు చేర్పులు జరగక మానదు.... ఆనాడు రాజ్యాంగాన్ని ముసాయిదా కమిటీ వేసి రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు కష్టపడి భారత రాజ్యాంగాన్ని నిర్మించిన ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనల నుండి భారత రాజ్యాంగం ఆవిర్భవించి అప్పటి మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి చేతుల మీదుగా గణతంత్ర దినోత్సవాన్ని రిపబ్లిక్ డే గా జరుపుకున్న ఆనాటి నుంచి నేటి వరకు రాజకీయ పరిణామాల దృష్ట్యా రాజ్యాంగంలో 100కు పైగా మార్పులు చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు...
ఎందుకు మార్చాలి మార్చాల్సిన అవసరం ఏముంది అనే సందేహాలు ఎవరికి రాలేకపోగా ఎస్ మార్చాలి మార్చేసేయాలి అంటూ మార్చుకుంటూ వెళ్లిపోతే రాబోయే తరాలకు మళ్ల కు కొత్త రాజ్యాంగాన్ని పునర్ నిర్మించుకునే ధీరుడు విద్య వంతులు ఎవరున్నారో ఈ సమాజం అర్థం చేసుకోవాలి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుండి ప్రధాన మంత్రుల వరకు రాజ్యాంగాన్ని మార్చుకుందాం అనే ఒక నియంతృత్వ మతతత్వ పోకడలతో రాజకీయం పూర్తిగా స్వార్ధ రాజకీయాలుగా మారిపోయిన నేటి సమాజంలో భారత రాజ్యాంగం రాజ్యాంగ స్ఫూర్తి సమాజంలో సర్వమత సర్వ మానవాళి సౌబ్రాతృత్వానికి పునాది వేస్తుంది అంటే అది అనుమానమే.....
లౌకికవాదం అని ఎత్తితే జైల్లో పెట్టండి అని చెప్పిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజాస్వామ్యంగా ప్రజల మద్దతు తో ముఖ్యమంత్రి కాకలిగారా లేదంటే వారు ఆరాధించే దైవం నియమిస్తే ముఖ్యమంత్రి అయ్యారా ప్రజాస్వామ్యవాదులు మౌనం వహిస్తూ దీనిపై ఎవరు పెద్దగా మాట్లాడడం లేదు.... అది ఏ మతాన్నో కించపరుస్తూ ఒక్క మాటంటే ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో ప్రతి మండలంలో ప్రతి గ్రామాల్లో అల్లర్లు అలజడులు గొడవలు కొట్లాటలు ధర్నాలు రాస్తారోకోలు.... ఇదా ప్రజాస్వామ్యంలో కోరుకున్నది...
మత విశ్వాసాలతో మత చాందసవాద పోకడలతో ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన కొనసాగించలేరు అని ఆనాడే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆవేదనను వెలుబుచ్చారు... ఒకే ఓటు ఒకే విలువ రాష్ట్రపతి దగ్గర నుంచి సాధారణ పౌరుని ఓటు ఒకే విలువను కలిగి ఉంటుంది అని గంట పదంగా చెప్పిన అంబేద్కర్ ఆశయ స్ఫూర్తిని ప్రజాస్వామ్యం మార్పుల చేర్పులతో రాజ్యాంగం పరిహాసమవుతూ వస్తోంది...
2024 వరకు 75 సంవత్సరాల ప్రజాస్వామ్య భారత అవనిలో భరతమాత అనే పదంతోనే దేశభక్తిని అడ్డు పెడుతూనే ఆధ్యాత్మిక రాజకీయానికి తెరలేపుతున్న ఆయా రాజకీయ పార్టీలు అధికారం కోసం కాక ప్రజాస్వామ్య మనుగడను పునరుద్ధరించడానికి అయితే కాదు.... కులం మతం పునాదుల మీద ప్రజాస్వామ్యాన్ని బతికించలేరు అన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాట నేటికీ ఆలోచించాల్సిందేగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది.... రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగ నియమ నిబంధనలు చట్టం ఇవన్నీ పుస్తకాల్లో అక్షరాలు గానే మిగిలిపోతున్నాయి కానీ చట్టం అధికారం ఉన్న వాళ్ళ చేతిలో చుట్టంగా మారిపోయి వాళ్లు చెప్పు చేతల్లో చట్టం పనిచేస్తుంది అనేది జగమెరిగిన సత్యం. అది బహిరంగ రహస్యం. స్వార్థాలకు మోసాలకు కుట్రలకు కుతంత్రాలకు అధికారాల కోసం రాజ్యాంగాన్ని వందలసార్లు మార్పులు చేర్పులు చేసుకోవడం వెనుక అసలు సత్యం ఏంటో ఈ ప్రపంచానికి ఆయా ప్రభుత్వాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది... సున్నితమైన మత విశ్వాసాలను అడ్డుపెట్టి దేవాలయాలకు ఆధ్యాత్మిక శోభలకు భారతదేశాన్ని తాకట్టుపెట్టే ప్రభుత్వాలు ఉన్నంతకాలం ప్రజాస్వామ్యంలో సాధారణ పౌరుని హక్కును కూడా కాపాడుకోలేని స్థితికి చేరుతుంది అంటే అది రాజ్యాంగ స్పూర్తికి దెబ్బ తగిలినట్టే..
ఇప్పటికైనా భారతదేశ ప్రజలు భారతదేశము యొక్క రాజ్యాంగాన్ని కచ్చితంగా చదవాలి... రాజ్యాంగం ఏం చెబుతోంది రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగ నియమ నిబంధనలు హక్కులు విధులు వీటన్నింటి వివరాలు స్వయంగా ఎవ్వరికి వారు చదువుకొని తెలుసుకొని రాజ్యాంగ పరిరక్షణకు నడుం కట్టాలి... ఆ దిశగా యువత ముందుకు రావాలి రేపటి భారతదేశం వారిదే కాబట్టి కుల మత ప్రాంత విద్వేషాలను రెచ్చగొట్టే ఆయా రాజకీయ పార్టీలను బొంద పెట్టాలి...
భారత్ ఇండియా హిందుస్థాన్ ఇలా ఏ పేరుతో పిలిచినా మనమంతా భారతీయులం హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కు ఇలా ఎన్ని మతాలు ఉన్నా మనమంతా ఒకే భారత జాతి బిడ్డలం.. హిందుస్థాన్లోనే మనమంతా ఒక్కటే అనే నినాదం దాగున్న ఈ జనాలకు అర్థం కావట్లేదు.... 75వ గణతంత్ర దినోత్సవం లో ఒక్కరు కూడా ఆకలైన వాడికి బుక్కెడు అన్నదానం కార్యక్రమాలు చేయరు... జెండా ఎగరేయడం ప్రాణాలర్పించిన త్యాగదలను తరుచుకోవడం బాధ్యత తీర్చుకోవడం అంతే.... కనీసం ఆగస్టు 15 జనవరి 26వ తేదీలలో కచ్చితంగా ఆయా స్వచ్ఛంద సంఘాలు సాంస్కృతిక శాఖలు ప్రభుత్వం కచ్చితంగా అన్నదాన కార్యక్రమాలను ముమ్మరంగా చేయాలి.... ఇది రాజ్యాంగ స్పూర్తికి నిదర్శనం.. తిండి గూడు బట్ట ఈ మూడు ప్రతి వ్యక్తికి అవసరం. వ్యక్తి అభివృద్దే వ్యవస్థ అభివృద్ధి.... వ్యక్తి యొక్క హక్కులు దొంగిలించబడ్డప్పుడు వ్యవస్థ యొక్క తీరు స్వార్థపూరితంగా మారిపోతుంది... దీని ఫలితంగా రాజ్యాంగ స్పూర్తికి సవాళ్లుగా మారి రాజ్యాంగం పరిహాసమవుతుంది... ఇది మంచిది కాదు... రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయకుండా ప్రజా పాలకులు అధికారులు ప్రజలు పనిచేసినప్పుడే రాజ్యాంగం రాజ్యాంగ స్ఫూర్తి ఆశయాలు ఆదర్శవంతంగా నిలుస్తాయి....
- కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, కవి, రచయిత
9848 962 799
Post Comment