Nagaaram Municipality I ఖల్ నాయక్.. కౌన్ ఆతా బై... అనే దేవ్ దే.. ఖేంగే...

ఎవ్వరు వస్తారు రానియ్!? చూసుకుందాం!? ఏం చేసుకుంటావో చేసుకోపో... అంటూ బెదిరింపులు 

Nagaaram Municipality I ఖల్ నాయక్.. కౌన్ ఆతా బై... అనే దేవ్ దే.. ఖేంగే...

జయభేరి, నాగారం :

  • ఒకవైపు గత ప్రభుత్వం లో అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డ అధికారులకు తగిన శిక్షలు
  • ఇంకోవైపు రాజకీయ.. అధికారుల అండతో నిలబడుతున్న అక్రమ నిర్మాణాలు
  • ఇదేందని ప్రశ్నించిన వారికి సమాధానాలు ఉండవు
    ఇక్కడ మరో ఖల్ నాయక్ పుట్టుకొచ్చి.. రౌడీ యుజాన్ని చెలాయిస్తున్నాడు
  • ఎవ్వరు వస్తారు రానియ్!? చూసుకుందాం!? ఏం చేసుకుంటావో చేసుకోపో... అంటూ బెదిరింపులు 

నాగారం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలకు నెలవుగా మారిపోతుంది.. ఒకవైపు గత ప్రభుత్వం లో అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డ అధికారులకు తగిన శిక్షలు పడుతున్న ఇంకోవైపు రాజకీయ అండ దండలు చూసుకుని మునిసిపల్ అధికారులు చైర్మన్లు అండగా నిలబడుతూ అక్రమ నిర్మాణాలకు దారులు తెరుస్తున్నారు. ఇదేందని ప్రశ్నించిన వారికి సమాధానాలు ఉండవు.. ఏం చేసుకుంటావో చేసుకో పో..? అని వక్ర బుద్ధి పోకడలు... నాగారం మున్సిపాలిటీలో జోరుగా నిర్మాణాలవుతున్నాయి... ఒకవైపు అక్రమ నిర్మాణాలు, ఇంకోవైపు రియల్ ఎస్టేట్ దందాలు జోరుగా కొనసాగుతున్న పర్మిషన్లు లేకుండా ఇస్టారీతిగా అక్రమ కట్టడాలను కడుతున్న పట్టించుకోని మునిసిపల్ అధికారులను ఏమనాలో మీరే ఆలోచించుకోండి... ఖల్ నాయక సినిమాలో హీరో చేస్తే... ఇక్కడ మరో ఖల్ నాయక్ పుట్టుకొచ్చి రౌడీ యుజాన్ని చెలాయిస్తున్నాడు... ఎవ్వరు వస్తారు రానియ్!? చూసుకుందాం!? ఏం చేసుకుంటావో చేసుకోపో...  అంటూ అధికారులకు ఇటు ఇంటి ఓనర్ ను బెదిరింపు ధోరణికి దిగుతున్న సాక్షాత్ నాగారం మున్సిపల్ కమిషనర్ కు కంప్లైంట్ అందించిన, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో నాగారం మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తుంది అంటే సిగ్గుపడాలో..! తల దించుకోవాలో ఏమనాలో అర్థం కావటం లేదని స్థానిక ఇంటి యజమాని తన ఆవేదనను వెలగక్కుతున్నాడు.

Read More మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

ఇక వివరాల్లో కెళితే... నాగారం మున్సిపాలిటీ నాగారం మెయిన్ రోడ్డు ఆవేశ రెస్టారెంట్ పక్కన ఉన్న ఇదిగో ....71/2 అంతస్థుల ఈ పెద్ద బిల్డింగు అక్రమ నిర్మాణానికి అడ్డంగా మారిపోతుంది... మునిసిపల్ పర్మిషన్ అక్కర్లేదు!? మునిసిపల్ అధికారులు ఇటువైపు చూడరు? ఎవరు ఏం చేసుకుంటారో పోండి...? అనే రీతిలో..  నాగారం మున్సిపాలిటీ లోని నాగారం మెయిన్ రోడ్డు ఆవేష రెస్టారెంట్ పక్కనే ఉన్న ప్లాట్ నెంబర్ 10 లోని 678 గజాల భూమిలో జి ప్లస్ టు పర్మిషన్తో నాలుగు అంతస్తుల భవనం మీకు గతంలో కనిపించేది... కానీ ఇప్పుడు అది 7 1/2 అంతస్తుల భవనంగా మారిపోయింది. స్థానిక ఇంటి యజమాని ఆరోపణల ప్రకారం గతంలో జి ప్లస్ టు పర్మిషన్ తో ఉన్న నాలుగు అంతస్తుల భవనం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నాయక్ అనే వ్యక్తికి పైన రెండు అంతస్తులను అమ్మి వేశాడు. కింద ఉన్న రెండు అంతస్తులో ఆరోపణ చేసిన వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో పైన రెండు అంతస్తులు ఉన్న నాయక్ తన వక్రబుద్ధిని చూపిస్తూ కింద ఉన్న రెండు అంతస్తుల భవనాన్ని కూడా తానే దక్కించుకోవాలని సదరు వ్యక్తి దగ్గరికి వెళ్లి నీ పేపర్స్ ను బ్యాంకులు కొలెస్ట్రాల్లో పెట్టి నవు కదా వాటిని విడిపిస్తూ నీకు "రెండున్నర కోట్ల రూపాయలను ఇస్తా"! అంటూ ఆశ చూపి ఒక పత్రాన్ని తనతో రాయించుకొని 10 రోజుల్లో నీకు డబ్బులు ఇస్తాను అంటూ మాయ మాటలు చెప్పి గత పది నెలలుగా సతాయిస్తున్నాడని ఆరోపణదారుడు పూర్తి వివరాలను అందిస్తున్నాడు..

Read More కురుమల పోరాటానికి ఎమ్మార్పీఎస్ మద్దతు కావాలి...

House1A

Read More వివాహ వేడుకల్లో పాల్గొన్న ఉద్యమ నాయకులు మహ్మద్ అప్జల్ ఖాన్

ఇప్పుడే అసలు సమస్య మొదలైంది.. సదరు నాయక్ అనే వ్యక్తి తక్కువకు అంటే 30 లక్షలకు బిల్డింగ్ తీసుకొని పూర్తిగా మొత్తం బిల్డింగునే కాజేయాలని చూస్తూ నాలుగు అంతస్తులున్న భవనంపై ఐదు ఆరు ఏడున్నర అంటే మూడు ఫ్లోర్ల కు పైగా అక్రమ నిర్మాణానికి తెర లేపాడు. నాయక్ అంటే కల్ నాయక్ అనుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ పర్మిషన్ ఉండదు? అధికారులు అంటే లెక్కలేదు? ఎవరేం చేసుకుంటారో చేసుకొని? అంటూ సదరు అదే ఇంటి కింద రెండు అంతస్తుల ఓనర్ కు చుక్కలు చూపిస్తున్నాడు... దీనిపై ఆరోపణ చేస్తున్న సదరు వ్యక్తి కమిషనర్ కు పదేపదే చెబుతున్న పోలీస్ కంప్లైంట్ చేసిన ఎవరొస్తారో రానియ్ దేఖేంగే అంటున్న ఈ ఖల్ నాయకున్ని  ఎవరు అడ్డుకుంటారో ఆ దేవుడికే తెలియాలి.
నమ్మించి నయవంచన చేస్తూ.. నేనున్నాను అంటూ తన గొంతుని కోస్తున్న ఇలాంటి నవీన నాగరిక సమాజంలో ఎవరిని నమ్మాల్నా వద్ద అనే విషయాన్ని జీర్ణించుకోలేక మామూలు జనం విలవిలలాడిపోతున్నారు... నమ్మితే నట్టేట ముంచే మనుషులను చూసి ఏమనాలో తెలియక నాగారం మున్సిపాలిటీలో ఈ అక్రమ నిర్మాణ దారుడికి అడ్డు అదుపు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ సదరు మునిసిపల్ కమిషనర్ కు మున్సిపల్ చైర్ పర్సన్కు చెప్పిన పట్టించుకోకపోవడం, చూస్తే దీని వెనుక బలంగా రాజకీయ కోణం ఉంది అని ఆరోపణదారుడు బలంగా ఆరోపిస్తున్నాడు... అయితే మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న సదరు సిబ్బంది కళ్ళున్న చూడలేని అధికారులుగా పరిమిషన్ లేని కట్టడాలను చూస్తూ నిలబడిపోవడం వీళ్ళ అసహతనానికి రాజకీయ ఒత్తిడి ఉందా? అనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.. 20 నుంచి 30 లక్షల వరకు ముడుపులు నాగారం మున్సిపాలిటీలోని సదరు పెద్దలకు అందినట్టుగా గుసగుసలు వినపడుతున్నాయి... మొత్తానికి ప్లాట్ నెంబర్ 10, లోని 678 గజాల్లో 71/2 అంతస్తుల భవనానికి పర్మిషన్ లేకపోయినా ఈ ఖల్నాయక్ అక్రమ నిర్మాణాన్ని అడ్డుకునేది అధికారులు చూస్తూ నిలబడిపోవడం కాసులకు కక్కుర్తి పడడమేనా అంటూ స్థానికులు నిక్కచ్చిగా నిర్మొహమాటంగా ఆరోపణలు చేస్తున్నారు..

Read More మత్తుపదార్థాల అవగాహన కార్యక్రమం