సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

జయభేరి, వెంకటాపురం, మార్చి 5 : వెంకటాపురం మండలం వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ పరిధిలోని ఆర్ అండ్ బి రోడ్డు తోట మల్లికార్జున్ రావు ఇంటి వద్ద నుండి బొజ్జ లక్ష్మి ఇంటి వరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి ఐదు లక్షల రూపాయల వ్యాయంతో మంజూరైన సిసి రోడ్డు పనులను గ్రామపంచాయతీ సర్పంచ్ బి రమ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పూనెం రాజేశ్వరి, వార్డు సభ్యులు డర్ర రవి, బద్ది ప్రశాంత్,చెరుకూరి అజయ్, బివిఎస్ రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్, రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయుడు, గారపు వెంకటేశ్వర్లు, భార్గవ్, ఆంజనేయులు, భరత్, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Views: 0